పార్టీలో పర్‌ఫెక్ట్‌గా..! | Perfect for the party ..! | Sakshi
Sakshi News home page

పార్టీలో పర్‌ఫెక్ట్‌గా..!

Published Wed, Sep 11 2013 11:23 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

పార్టీలో పర్‌ఫెక్ట్‌గా..! - Sakshi

పార్టీలో పర్‌ఫెక్ట్‌గా..!

టీనేజర్స్ ఎక్కడ ఉంటే సందడంతా అక్కడే అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా వేడుకలలో తామే అంతా అయినట్టు తిరిగేస్తుంటారు. అతిథుల దృష్టిని ఆకర్షించేది ఎక్కువగా వీరే! అందుకే వస్త్రాలంకరణ పట్ల టీనేజర్స్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం అవసరం.
 
 ముందు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది సందర్భానుసారంగా దుస్తుల ఎంపిక. పాశ్చాత్య, సంప్రదాయ వేడుకలను దృష్టిలో పెట్టుకొని థీమ్‌కు తగ్గ దుస్తులను ఎంచుకోవాలి.
     
 ఇతరులను పోల్చి దుస్తులను ఎంచుకోకూడదు. తమ శరీరాకృతికి తాము ఎంచుకున్న దుస్తులు నప్పుతాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
     
 తమ ఎత్తు, లావు, శరీరాకృతిని బట్టి ధరించే దుస్తులు పర్‌ఫెక్ట్ ఫిట్‌గా ఉండేలా ఎంచుకోవాలి.
     
 చక్కని డ్రెస్‌ను ఎంచుకున్నా చాలామంది రంగుల విషయంలో పొరపాటు పడుతుంటారు. దీంతో పార్టీలో చార్మింగ్‌గా వెలిగిపోయేవారు సైతం గాడీ రంగులను ఎంచుకోవడంతో ఎబ్బెట్టుగా కనిపిస్తారు. ఫలితంగా దుస్తుల ఎంపిక తెలియనివారుగా నలుగురిలో పేరుపడిపోతారు. అందుకే తమ మేనిరంగును బట్టి దుస్తుల రంగు ఉండేలా చూసుకోవాలి.
     
 సాయంకాలం పార్టీలకు కాంతివంతమైన ముదురు రంగులు, పగటి పూట తేలికపాటి రంగు దుస్తులను ఎంచుకోవాలి.
     
 సంప్రదాయ వేడుకలకు హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులు, వెస్ట్రన్ పార్టీలకు సింపుల్‌గా అనిపించేలా వస్త్రాలంకరణ ఉండాలి.
     
 క్యాజువల్ ఈవెనింగ్ పార్టీస్ అయితే బ్లూ డెనిమ్ జీన్స్, డీప్ యు-నెక్ టాప్, రెడ్ స్కర్‌‌ట టీనేజ్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది.
 
  యాక్సెసరీస్ కూడా సింపుల్‌గా, దుస్తులకు మ్యాచ్ అయ్యేవి ధరించాలి. ఒక చేతికి బ్రేస్‌లెట్, పెద్ద పెద్ద చెవి రింగులు లేదా హ్యాంగింగ్స్, నడుముకు స్టైలిష్ బెల్ట్, కాళ్లకు హీల్స్ వాడితే చాలు, అల్ట్రామోడ్రన్‌గా కనిపిస్తారు.
 
  చిన్న చిన్న స్కర్ట్‌లు, ఫ్రాక్‌లు ధరించినప్పుడు తప్పనిసరిగా డ్రెస్ మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి.
 
  స్లీవ్‌లెస్ టీ -షర్ట్ ధరించినప్పుడు పొడవాటి స్కర్ట్, ఫ్లిప్-స్లాప్స్ అయితే పార్టీ లుక్ అదిరిపోతుంది.
     
 అబ్బాయిలైతే కార్గో ప్యాంట్లు, టీ షర్ట్ ధరిస్తే చాలు రాక్ అండ్ రోల్‌లా క్యాజువల్ పార్టీలో స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు.
     
 ఇటీవల పార్టీ థీమ్స్ చాలా రకాలుగా ఉంటున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా థీమ్ పార్టీస్ అయితే దానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement