న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లైమ్‌రోడ్‌ను సొంతం చేసుకున్నట్లు ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. తద్వారా ఓమ్నీ చానల్ విభాగంలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. డీల్‌లో భాగంగా ఒకేసారి 31.12 కోట్ల నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఏఎం మార్కెట్‌ప్లేసెస్(లైమ్‌రోడ్)తో స్లంప్ సేల్ పద్ధతిలో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
రెండు సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం లైమ్‌రోడ్‌కు చెందిన రూ. 14.61 కోట్ల ఆస్తులు, రూ. 36.26 కోట్ల లయబిలిటీలు సైతం బదిలీకానున్నట్లు తెలియజేసింది. 2022 మార్చితో ముగిసిన గతేడాదిలో లైమ్‌రోడ్ రూ. 69.31 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం మహిళా విభాగం అమ్మకాలు ఆదాయంలో 65 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment