fashion market
-
శారీ.. ఫర్ ఎవర్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది. నేతలో క్రియేటివిటీ.. చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.వాతావరణం మారింది నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు. చీర చుట్టూ ఫ్యాషన్..పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వేస్ట్‌తో బెస్ట్
యువత సామాజిక బాధ్యతతో ఓ ముందడుగు వేస్తే వారి వెనుక నడవడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి, అక్షరల ప్రయోగాన్ని విజయవంతం చేసి ఆ విషయాన్ని నిరూపించింది ముంబయి నగరం. టెక్స్టైల్ రంగంలో వచ్చే వేస్ట్ మెటీరియల్‌తో ఫ్యాషన్ మార్కెట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు తమ జుహూ బీచ్ స్టూడియో బ్రాండ్‌ను సగర్వంగా ప్రకటించు కుంటున్నారు.హ్యాట్ కేక్ముంబయికి చెందిన ప్రకృతి రావు, అక్షర మెహతాలు అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. కోర్సు పూర్తయింది ఇక కెరీర్ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. మార్కెట్లోకి కొత్త ఆలోచనలతో రావాలి. అది పర్యావరణానికి హితంగానూ ఉండాలి... అని ఆలోచించిన మీదట వారికి వచ్చిన ఆలోచన ఇది. చేనేత, వస్త్రాలకు రంగులద్దే కుటుంబ నేపథ్యం వారిది. వస్త్రాల మీద ఒకింత అవగాహన ఎక్కువనే చెప్పాలి. రా మెటీరియల్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలని ఆలోచించారు. వస్త్రాల తయారీ పరిశ్రమల నుంచి తానులోకి రీల్ చుట్టగా మిగిలిన క్లాత్, ఎక్కడో ఓ చోట మిస్ ప్రింట్ కారణంగా పక్కన పడేసిన మీటర్ల కొద్దీ వస్త్రం... ఇలా సేకరించిన క్లాత్‌తో నాలుగేళ్ల కిందట 60 హ్యాట్లు తయారు చేశారు. అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత వంద స్లింగ్ బ్యాగ్‌లు చేశారు. తమ మీద తమకు ధైర్యం వచ్చిన తర్వాత బేబీ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. వారి ప్రయోగం పూర్తి స్థాయి వ్యాపార రూపం సంతరించుకుంది. ముంబయిలోని జుహూ బీచ్ స్టూడియో (జేబీఎస్) వారి వర్క్ ప్లేస్. ఇప్పుడు వాళ్లు పదిమంది మహిళలకు హ్యాండ్ క్రాఫ్ట్స్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించారు. గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్లో జేబీఎస్ ఒక బ్రాండ్ ఇప్పుడు. నిరుపయోగం కాకూడదుప్రకృతి రావు... టెక్స్టైల్ రంగం గురించి వివరిస్తూ... వస్త్రం తయారయ్యే క్రమంలో భూగర్భ జలాలు భారీ స్థాయిలో ఖర్చవుతాయి. తయారైన వస్త్రం అంతా ఉపయోగంలోకి రాకపోతే ఎలా? మిల్లులో తయారయ్యే వస్త్రంలో ముప్పావు వంతు మాత్రమే మార్కెట్‌కు వెళ్తోంది. మిగిలినది వృథా అవుతుంటుంది. ఇక ఫ్యాషన్ స్టూడియోల దగ్గరకు చేరిన క్లాత్‌లో డిజైన్ కోసం కొంత వాడేసి మిగిలినదానిని పారేస్తుంటాయి. ఇలా చెత్తకుండీల్లోకి చేరిన క్లాత్ మట్టిలో కలిసేలోపు కాలువల్లోకి చేరి ప్రవాహాలకు అడ్డుపడి వరదలకు కారణమవుతాయి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరులను నూటికి నూరుశాతం ఉపయోగించుకోవాలి. అదే ప్రకృతికి, పర్యావరణానికి మనమిచ్చే గౌరవం అన్నారు ప్రకృతిరావు, అక్షర మెహతా. -
వీమార్ట్ చేతికి లైమ్‌రోడ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ లైమ్‌రోడ్‌ను సొంతం చేసుకున్నట్లు ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ రిటైల్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. తద్వారా ఓమ్నీ చానల్ విభాగంలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. డీల్‌లో భాగంగా ఒకేసారి 31.12 కోట్ల నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఏఎం మార్కెట్‌ప్లేసెస్(లైమ్‌రోడ్)తో స్లంప్ సేల్ పద్ధతిలో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! రెండు సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం లైమ్రోడ్కు చెందిన రూ. 14.61 కోట్ల ఆస్తులు, రూ. 36.26 కోట్ల లయబిలిటీలు సైతం బదిలీకానున్నట్లు తెలియజేసింది. 2022 మార్చితో ముగిసిన గతేడాదిలో లైమ్‌రోడ్ రూ. 69.31 కోట్ల ఆదాయం సాధించినట్లు తెలియజేసింది. ప్రస్తుతం మహిళా విభాగం అమ్మకాలు ఆదాయంలో 65 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
తనకు అన్యాయం జరిగిందంటోన్న డైనమిక్ యంగ్ లేడీ సీఈవో
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కోఫౌండర్, సీఈవో అంకితి బోస్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్ల గక్కారు. తనని అన్యాయంగా సంస్థ నుంచి బయటకు పంపించడమే కాదు..తనని, తన కుటుంబ సభ్యుల్ని ఆన్లైన్లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2నెలల క్రితం జిలింగో సీఈవో అంకితి బోస్పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీ నిర్వహించిన ఆడిటింగ్‌లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో జిలింగో ఇన్వెస్టర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సంస్థ నుంచి అంకితి బోస్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు."గుర్తు తెలియని వ్యక్తులు నా మీద చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి, లేనిపోని నిందలు వేసి అనైతికంగా 51రోజుల క్రితం సంస్థ నుంచి సస్పెండ్ అయ్యా. అవకతవకలు ఎలా జరిగాయో, సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని సంస్థ ప్రతినిధుల్ని కోరాను. ఆ రిపోర్ట్‌ల గురించి యాజమాన్యం స్పందించలేదు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిరూపించుకునేందుకు అందుకు సంబంధించిన ఫ్రూప్స్ తన వద్ద ఉన్నాయని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. వాటిని బయటపెట్టేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు పేర్కొంది. అందుకు సంస్థ తగిన సమయం ఇవ్వలేదు. పైగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఆన్లైన్లో నిరంతరం బెదిరిస్తున్నారంటూ అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి👉అంకితి బోస్‌కు షాక్..సీఈవోగా తొలగించిన జిలింగో! -
జిప్ అప్ హుర్రె
భారతీయ వనితకు అందం సంప్రదాయ చీరతోనే వస్తుంది. ఎన్ని మోడర్న్ డ్రెస్‌లు వేసినా కూడా.. అచ్చమైన ఆడపిల్లలా కనిపించాలంటే చీరతో సింగారించుకోవాల్సిందే. చీరకట్టులో అందం చూసి దానికి ఫ్యాన్స్ అయిపోయిన విదేశీ వనితలూ ఉన్నారు. చేయి తిరిగిన పడుచులకు కూడా శారీ కట్టుకోవడానికి 15 నిమిషాలు కావాల్సిందే. అదే అలవాటు లేని ఆడవాళ్లకు చీర కట్టుకోవడం కత్తిమీద సామే. అందంగా కట్టుకున్నా.. కుచ్చుళ్లు ఎక్కడ జారిపోతాయో అని టెన్షన్ కొందరిది. వీరి టెన్షన్‌కు చెక్ పెడుతూ ఇన్‌స్టా శారీస్ తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ రెడీమేడ్ శారీని లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్టు వేసుకుని జిప్ లాగితే సరి.. శారీలో సెట్ అయిపోతారు. నయా ట్రెండ్స్‌తో ఫ్యాషన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్న డిజైనర్లు.. రోజుకో వెరైటీ కాస్ట్యూమ్స్‌తో అదరగొడుతున్నారు. శారీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వాటికి తమ క్రియేటివిటీ జోడించి మరిన్ని మెరుగులు అద్దుతున్నారు. ఇన్నాళ్లూ డిఫరెంట్ శారీస్‌తో మార్కులు కొట్టేసిన వీళ్లు.. చీరకట్టును ఈజీ చేస్తూ ఇన్‌స్టా శారీలను తీసుకొచ్చారు. జస్ట్ జిప్‌తో ఈజీగా ధరించే విధంగా డిజైన్ చేశారు. ట్రెడిషన్‌ను మిస్ చేయకుండా బ్లౌజ్ అటాచ్‌మెంట్‌తో ఈ చీరలు వస్తున్నాయి. బ్లెండెడ్ సిల్క్, ఫ్రెంచ్ లేస్, ఫాలోయింగ్ నెట్ వంటి మెటీరియల్స్‌తో ఈ కస్టమైజ్డ్ శారీస్ ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మాయిలకు వరం.. ఈ ఫాస్ట్ గోయింగ్ వరల్డ్‌లో శారీ డ్రేపింగ్‌తో ఇబ్బంది పడే అమ్మాయిలకు ఇది ఒక వరం. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు చీరలు కట్టుకునే టైం కూడా ఉండదు. వారికి కూడా ఈ రకం చీరలు ఎంతో హెల్ప్ చేస్తాయి. పార్టీల్లో స్పెషల్‌గా, యూనిక్‌గా కనిపించాలని భావించే వాళ్లు ‘ఇన్‌స్టా శారీస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కలెక్షన్లలో రస్టిక్ రెడ్, ఎమరాల్డ్ గోల్డ్, బోల్డ్ గోల్డ్, బ్రిలియంట్ పింక్ వంటి రంగుల్లో కనిపిస్తున్నాయి. వీటి ధర రూ.9,000 నుంచి రూ.20 వేల వరకు ఉంది. - నీతా, సఖి ఫ్యాషన్స్ డిజైనర్ శిరీష చల్లపల్లి -
కొంగు సింగారం
వాలుజడ చివరన వేలాడుతూ.. నడకలతో నాట్యం చేసే కుచ్చులంటే మహిళలకు మహా ఇష్టం. అయితే బారెడు జడలు కానరాక బావురుమంటున్న కుచ్చులకు ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త ప్లేస్ ఇచ్చేసింది. శతాబ్దాల పాటు మగువల కురుల్లో కొలువున్న ఈ అలంకరణ వస్తువు.. కాస్త లుక్ మార్చుకుని ష్యాషన్ కాస్ట్యూమ్స్లోని యువతులకు భుజకీర్తులుగా.. చీరకట్టులో ఉన్న స్త్రీల కొంగు సింగారంగా రూపుదిద్దుకుని నయా పోకడల్లో కనిపిస్తోంది. కుచ్చుల గంటలు ఒకప్పుడు జడలకు మాత్రమే అలంకారంగా ఉండేవి. నేటి యువతులు వస్త్రధారణలో ఏ ట్రెండ్ ఫాలో అయినా.. కుచ్చుల గంటలను కామన్ యాక్సెసరీస్‌గా కొలుస్తున్నారు. ‘లవ్ హ్యాంగింగ్స్’ పేరుతో కొత్త లుక్ సంతరించుకున్న కుచ్చుల గంటలు రకరకాల మోడల్స్‌లో ఇప్పుడు ఫ్యాషన్ మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచింగ్ లవ్ హ్యాంగింగ్స్.. వేసుకున్న కాస్ట్యూమ్‌కు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఫ్యాషన్ హ్యాంగింగ్స్ రకరకాల రంగుల్లో ఈ హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి. పెరల్స్, స్టోన్స్, కుందన్, నేచురల్ స్టోన్స్, బీడ్‌స ఇలా స్పెషల్ ఫినిషింగ్‌తో లవ్ హ్యాంగింగ్స్‌ను స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జాకెట్ వెనుక డోరీలకు, డ్రెస్‌లకు, చీరల కొంగులకు వీటిని సెట్ చేసుకోవచ్చు. క్రి యేటివ్ ఫ్యాషన్ లవర్స్.. సాదాసీదా చీరకు కొంగు చివర్లో గుత్తులుగా కాంట్రాస్ట్ కలర్ కుచ్చులను ఫిక్స్ చేసి డిజైనరీ చీరగా మార్చేస్తున్నారు. వస్త్రాలకే కాదు.. యాక్సెసరీస్‌కూ లవ్ హ్యాంగింగ్స్ రిచ్ లుక్ తీసుకొస్తున్నాయి. మహిళలు ఇష్టంగా వేసుకునే గాజులకు, హ్యాండ్‌బ్యాగ్ జిప్‌లకు కూడా అతికినట్టు సరిపోతున్నాయి. ఈ కుచ్చులు బ్యాంగిల్ స్టోర్స్‌లో, డిజైనర్ మెటీరియల్ సేల్ సెంటర్స్‌లో దొరుకుతున్నాయి. - శిరీష చల్లపల్లి