సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కోఫౌండర్, సీఈవో అంకితి బోస్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్ల గక్కారు. తనని అన్యాయంగా సంస్థ నుంచి బయటకు పంపించడమే కాదు..తనని, తన కుటుంబ సభ్యుల్ని ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2నెలల క్రితం జిలింగో సీఈవో అంకితి బోస్‌పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీ నిర్వహించిన ఆడిటింగ్‌లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో జిలింగో ఇన్వెస్టర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లు సంస్థ నుంచి అంకితి బోస్‌ను తొలగించారు.
ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు."గుర్తు తెలియని వ్యక్తులు నా మీద చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి, లేనిపోని నిందలు వేసి అనైతికంగా 51రోజుల క్రితం సంస్థ నుంచి సస్పెండ్ అయ్యా. అవకతవకలు ఎలా జరిగాయో, సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని సంస‍్థ ప్రతినిధుల్ని కోరాను.
ఆ రిపోర్ట్‌ల గురించి యాజమాన్యం స్పందించలేదు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిరూపించుకునేందుకు అందుకు సంబంధించిన ఫ్రూప్స్ తన వద్ద ఉన్నాయని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. వాటిని బయటపెట్టేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు పేర్కొంది. అందుకు సంస్థ తగిన సమయం ఇవ్వలేదు. పైగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఆన్‌లైన్‌లో నిరంతరం బెదిరిస్తున్నారంటూ అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment