Ankiti Bose
-
మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేసిన అంకితి బోస్!
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కో-ఫౌండర్, మాజీ సీఈవో అంకితి బోస్ మరోసారి తెరపైకి వచ్చారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్, సీడెడ్ ఫండ్ సంస్థ కోఫౌండర్ మహేష్ మూర్తిపై రూ.800 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మార్చి 1,2023న ఓ బిజినెస్ మ్యాగజైన్లో మహేష్ మూర్తి ఓ కథనం రాశారు. అయితే ఆ కథనంలో తన పేరును ప్రస్తావించినందుకు గాను మహేష్ మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంకితి బోస్ న్యాయ సంస్థ సింఘానియా అండ్ కో ఎల్ఎల్పీ ఆధ్వర్యంలో బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పలు నివేదికల ఆధారంగా వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..పరువు నష్టం దావా కేసులో మూడేళ్లుగా స్టార్టప్‌లపై మహేష్ మూర్తి తీరును తప్పుబడుతూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 20న నమోదైన ఈ డిఫర్మేషన్ కేసు (పరువు దావా నష్టం) లో అంకితి బోస్ పిటిషనరేనని తేలింది. మహేష్ మూర్తి కథనం ఏం చెబుతోంది? మహేష్ మూర్తి రాసిన బిజినెస్ మ్యాగజైన్లో పేరు కంపెనీ, సీఈవో పేరు ప్రస్తావించకుండా ‘ఒక మహిళ (అంకితి బోస్) ప్రముఖ ఫ్యాషన్ పోర్టల్ (జిలింగో)ను నడుపుతుంది. జిలింగోలో పెట్టుబడిదారులైన సీక్వోయా క్యాపిటల్ నిధుల్ని దుర్వినియోగం చేశారు. న్యాయపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందేలా ఆమె తన లాయర్లకు రూ. 70 కోట్లు ఫీజుగా చెల్లించేందుకు సంస్థ నిధుల్ని వినియోగించారని తెలిసింది. అంతేకాదు తానొక గ్లామరస్ సీఈవోగా ప్రపంచానికి తెలిసేలా ఓ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె సదరు పీఆర్ సంస్థకు సంవత్సరానికి రూ.10 కోట్లు చెల్లించారు. ఆ నిధులు సైతం జిలింగో నుంచి పొందారని తెలిపారు. బోస్ స్పందన మహేష్ మూర్తి రాసిన కథనంపై అంకితి బోస్ స్పందించారు. ఆ ఆర్టికల్‌లో 'అబద్ధాలు, వక్రీకరణలు, విషపూరిత వాదనలు' ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లలో బాధ్యతాయుతంగా ఉండాలి. మహిళా వ్యవస్థాపకుల శక్తి సామార్ధ్యాలతో వారి సాధించాలనుకున్న లక్ష్యాల్ని నిరోధించేలా, లైంగిక ధోరణిలు ప్రతిభింభించేలా ఉన్నాయని ఆమె అన్నారు. నిధుల దుర్వినియోగం బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అంకితి బోస్. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో జిలింగో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా..ఆ సంస్థను ముందుండి నడిపించారు. కానీ గత ఏడాది రేపోమాపో యూనికార్న్ హోదా దక్కించుకోబోతున్న జిలింగో స్టార్టప్ పునాదులు కదిలిపోయాయి. నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటకు వచ్చారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
నా వ్యక్తిగత ఫోటోలతో ఇబ్బంది పెడుతున్నారు - అంకితి బోస్
చిన్న వయసులోనే స్టార్టప్ స్థాపించి, అతి తక్కువ కాలంలోనే యూనికార్న్ కంపెనీగా తీర్చిదిద్దిన యంగ్ లేడీ ఎంట్రప్యూనర్‌గా ఎదిగిన అంకితి బోస్కి గడ్గు కాలం నడుస్తోంది. ఇప్పటికే వృత్తిగతంగా ఇబ్బందులో ఉండగా తాజాగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరింత చిక్కుల్లో పడింది. జీవితంలో ఎన్నడూ చూడనంత విద్వేషాన్ని ఆమె ప్రస్తుతం అనుభవించాల్సి వస్తోంది. సింగపూర్ బేస్డ్గా జిలింగో అనే ఈ కామర్స్ సైట్‌ను స్థాపించి యూనికార్న్ కంపెనీగా ఎదిగేలా కృషి చేసింది అంకితి బోస్. అయితే ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల సీఈవో పోస్టుకు రాజీనామా చేసి ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. ఈ అనూహ్య పరిణామాలతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. మెయిన్‌స్ట్రీమ్ మొదలు సోషల్ మీడియా వరకు అంకితి బోస్పై పుంఖాలుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. అయితే వీటితో తనకు మనఃశాంతి కరువైంది అంకితి బోస్ బాధపడుతోంది. దీంతో తాను పడుతున్న ఇబ్బందులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తెలిపారు.. పర్సనల్ ఫోటోలతో జిలింగో నుంచి నేను బయటకు వచ్చాక వందల కొద్ది వార్తలు నాపై వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ఎవ్వరూ నా అభిప్రాయం కోరకుండానే తమకు తోచినట్టుగా నన్ను చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు రాస్తున్నారని అంకితీ అంటున్నారు. నా పర్సనల్ ఫోటోలు, చాట్స్, డాక్యుమెంట్స్, రికార్డ్స్ ఇతర విషయాలను సేకరించి ప్రచురిస్తున్నారు. నన్నొక మంత్రగత్తెలా చూపిస్తున్నారంటూ బాధను వ్యక్తం చేస్తోంది. ఇంత ద్వేషమా నా మీద వస్తున్న తప్పుడు కథనాల కారణంగా జనాల్లో నాపై ద్వేషం పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నన్ను తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా ఇష్టారీతిగా దూషిస్తున్నారు. అవమానకరంగా మాట్లాడుతున్నారు. నా జీవితంలో ఇంతటి ద్వేషాన్ని నేనెప్పుడు చూడలేదంటూ వాపోతోంది అంకితిబోస్. కుట్రపూరితంగా నన్ను కుట్రపూరితంగా జిలింగో నుంచి తొలగించారని అంకితి బోస్ అన్నారు.. నా పని తీరు నచ్చలేదని, నేను నిధులు దుర్వినియోగం చేసినట్టు ఎవరో అనామక వ్యక్తి (విజిల్ బ్లోయర్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఇది కక్షగట్టి కుట్రపూరితంగా చేసిన చర్యగా ఆమె అంటున్నారు. చదవండి: అంకితి బోస్‌కు షాక్..సీఈవోగా తొలగించిన జిలింగో! -
తనకు అన్యాయం జరిగిందంటోన్న డైనమిక్ యంగ్ లేడీ సీఈవో
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కోఫౌండర్, సీఈవో అంకితి బోస్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్ల గక్కారు. తనని అన్యాయంగా సంస్థ నుంచి బయటకు పంపించడమే కాదు..తనని, తన కుటుంబ సభ్యుల్ని ఆన్లైన్లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2నెలల క్రితం జిలింగో సీఈవో అంకితి బోస్పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీ నిర్వహించిన ఆడిటింగ్‌లో అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో జిలింగో ఇన్వెస్టర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సంస్థ నుంచి అంకితి బోస్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు."గుర్తు తెలియని వ్యక్తులు నా మీద చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి, లేనిపోని నిందలు వేసి అనైతికంగా 51రోజుల క్రితం సంస్థ నుంచి సస్పెండ్ అయ్యా. అవకతవకలు ఎలా జరిగాయో, సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని సంస్థ ప్రతినిధుల్ని కోరాను. ఆ రిపోర్ట్‌ల గురించి యాజమాన్యం స్పందించలేదు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిరూపించుకునేందుకు అందుకు సంబంధించిన ఫ్రూప్స్ తన వద్ద ఉన్నాయని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. వాటిని బయటపెట్టేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు పేర్కొంది. అందుకు సంస్థ తగిన సమయం ఇవ్వలేదు. పైగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఆన్లైన్లో నిరంతరం బెదిరిస్తున్నారంటూ అంకితి బోస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి👉అంకితి బోస్‌కు షాక్..సీఈవోగా తొలగించిన జిలింగో!