
సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.
వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.
మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.
కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment