ఎండ సెగ.. మేనిగనిగ
బ్యూటిప్స్
వేసవిలో ఉక్కపోతకు పొట్టి, స్లీవ్‌లెస్, ట్యాంక్ టాప్స్ దుస్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి స్టైల్‌గానూ ఉంటాయి. అయితే, వీటి వల్ల ఎండకు చర్మం ట్యాన్ అవుతుందని భయపడుతుంటారు. ఈ సమస్య దరిచే రకుండా ఉండాలంటే... వేసవిలో చర్మసంరక్షణ జాబితాలో సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎస్.పి.ఎఫ్ 40 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను పగటి వేళలో బయటకు వెళ్లడానికి 15-30 నిమిషాల ముందు రాసుకోవాలి. దీని వల్ల సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడటం వల్ల కలిగే హాని శాతం తగ్గుతుంది. {పతిరోజూ పగటి వేళలో కనీసం 15-20 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అప్పుడే చర్మం తన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ను కోల్పోదు, త్వరగా పొడిబారదు.
ఈతకొట్టేటప్పుడు నీటిలో క్లోరినేటెడ్ శాతం అధికంగా ఉంటే చర్మం, జుట్టు పొడిబారతుంది. అందుకని ఈత కొట్టిన తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లతో స్నానం చేయాలి.పగటి వేళలో 3-4 సార్లు ఎలాంటి క్లెన్సర్లు వాడకుండా కేవలం నీటితోనే ముఖాన్ని, చేతులను, పాదాలను శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి డీ-హైడ్రేషన్ సమస్య తలెత్తదు. జిడ్డు చర్మం అయితే స్వేదగ్రంధులు ఈ కాలం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటప్పుడు ఔషధమూలికలతో తయారైన ఫేస్‌ప్యాక్‌లతో చర్మసౌందర్యాన్ని కాపాడుకోవాలి.
పగటి వేళ సూర్యకిరణాల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకని ఈ టైమ్‌లో వీలైనంతవరకు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు. మేకప్ వేసుకునేవారు మినరల్ మేకప్‌ని వాడటం మేలు. లేత రంగులు, చర్మానికి తగినంత చమట పట్టేలా ఉండే సౌందర్య ఉత్పత్తులను వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు, టోపీ తప్పనిసరిగా ఉపయోగిస్తే 70 శాతం ఎండతాకిడి వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చు.