సెంట్రల్ మాల్‌లో యువరాజ్ సింగ్
సోమాజిగూడ : భారత్ క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ నగరంలో సందడి చేశారు. తమ అభిమాన క్రికెటర్ కళ్ల ముందు ప్రత్యక్షమైతే అనుభూతే వేరు కదూ! హైదరాబాద్ సెంట్రల్‌లో అభిమానులకు అలాంటి ఘటనే ఎదురైంది. తన సొంత బ్రాండ్ స్పోర్ట్స్ క్లాతింగ్ వేర్ ‘యువీకెన్’ ఉత్పత్తులను పంజాగుట్ట సెంట్రల్‌లో మంగళవారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల సహాయార్థం తాను యువీకెన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.
ఫౌండేషన్ యువీకెన్ పేరుతోనే క్లాతింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ స్టోర్స్‌లో తమ క్లాతింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నాడు. క్లాతింగ్ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థంగా వినియోగించనున్నట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment