అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్‌నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
ప్రతిభను నమ్ముకోవాలి
ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అవడానికి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్‌లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి!
– రాశీ ఖన్నా
జ్యూలరీ బ్రాండ్:
మాయా సాంఘ్వీ జ్యూయెల్స్
ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది.
మాయా సాంఘ్వీ జ్యూయెల్స్..
అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్‌తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్‌లెట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
శాంతి బనారస్..
సంప్రదాయ బనారస్‌కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.
బ్రాండ్ వాల్యూ
చీర డిజైనర్: శాంతి బనారస్
ధర: రూ. 1,40,000
∙దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment