పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత చూపాల్సిందే అనుకుంటోంది నవతరం. ఇక వెస్ట్రన్ స్టైల్ పార్టీలో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు. ప్లెయిన్ డ్రెస్సులకు స్పెషల్ అట్రాక్షన్‌గా యంగ్‌స్టర్స్‌ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి డిటాచబుల్ హ్యాండ్ కఫ్స్. పార్టీలోనే కాదు క్యాజువల్ వేర్‌గానూ వీటిని ధరించవచ్చు. చూసినవారు థంబ్స్ అప్ ఇవ్వకుండా ఉండలేరు.
ఎంబ్రాయిడరీ కఫ్స్...
కాంబినేషన్ లేదా పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే డిటాచబుల్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ కఫ్స్ ఏ ప్లెయిన్ డ్రెస్‌కైనా నప్పుతాయి. స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ట్రైబల్, మిషన్, మిర్రర్ ఎంబ్రాయిడరీ వీటిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఎంబ్రాయిడరీ డిజైన్‌ను బట్టి ధర ఉంటుంది.
జ్యువెలరీ కఫ్స్..
సంప్రదాయ వేడుకలు ముఖ్యంగా పెళ్లి వంటి వేడుకలలో ధరించడానికి అనువైన జ్యువెలరీ హ్యాండ్ కఫ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి డైమండ్ హ్యాండ్ కఫ్స్ వరకు ఉన్నాయి.
ఫ్లోరల్ కఫ్స్
టీనేజర్స్, పిల్లలు ముచ్చట పడి ధరించేందుకు వీలుగా ఫ్లోర్ హ్యాండ్ కఫ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు లేస్, క్రోచెట్ అల్లికల హ్యాండ్ కఫ్స్‌ను కూడా తమ ప్రాధాన్యతలను బట్టి ఎంచుకోవచ్చు.
ట్రావెల్ కఫ్స్
ప్రయాణాలలో ఫోన్‌తో పాటు కొంత డబ్బు కూడా అదీ ఎలాంటి బ్యాగ్ అవసరం లేకుండా వెంట తీసుకెళ్లాలంటే ఈ ట్రావెల్ హ్యాండ్ కఫ్స్ మంచి ఉపయుక్తంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment