Fashion designing
-
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్‌ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్‌కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్‌కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్‌తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్‌గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్‌కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్‌గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
తిరుపతి : అదిరే డ్రస్‌లతో అదరగొట్టిన విద్యార్థినులు (ఫోటోలు)
-
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
విజయవాడ : ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
రాశీఖన్నా ధరించిన ఈ డ్రెస్ అన్ని లక్షలా? అంత ఏముందో!
అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ప్రతిభను నమ్ముకోవాలి ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అవడానికి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్‌లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి! – రాశీ ఖన్నా జ్యూలరీ బ్రాండ్: మాయా సాంఘ్వీ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. మాయా సాంఘ్వీ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్‌తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్‌లెట్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. శాంతి బనారస్.. సంప్రదాయ బనారస్‌కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్‌కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్: శాంతి బనారస్ ధర: రూ. 1,40,000 ∙దీపిక కొండి -
వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్
వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కాంట్రాస్ట్ శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శాలువా స్టైల్ చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. డ్రేపింగ్ దుపట్టా చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. రంగు ఒకటే... డిజైన్ వేరు సేమ్ కలర్ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్ చూసుకోవాలి. చీర డిజైన్ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
అమ్మ లిప్‌స్టిక్, అమ్మమ్మ చీరలతో యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా..
జీవితంలో ఇది అవ్వాలి! అది అవ్వాలి! అని కలలు కంటుంటాము. కొంతమంది కలలు మాత్రమే నిజం అవుతాయి. కొంతమంది పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతికేస్తుంటారు. హిమాద్రి పటేల్ మాత్రం ఈ కోవకు చెందిన అమ్మాయి కాదు. ఇక ఇంతేలే అని సరిపెట్టుకోకుండా తను అనుకున్నది సాధించేందుకు అందర్ని ఒప్పించి, కష్టపడి.. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా కంటెంట్ క్రియేటర్, ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన 26 ఏళ్ల హిమాద్రి పటేల్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. మేకప్ అంటే ఎంతో ఆసక్తి. అమ్మ వాడే లిప్‌స్టిక్ రాసుకుని తనని తాను అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతుండేది. ఎప్పుడూ నలుగురిలో ప్రత్యేకంగా ఉండేందుకు తాపత్రయ పడేది. ఇంటర్మీడియట్లో ఉండగానే జాతీయ, అంతర్జాతీయ మేకప్ ట్యుటోరియల్స్ చూసి మెకప్ మెళుకువలు నేర్చుకుంటుండేది. ఇలా నేర్చుకుంటూ తను కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంది. కానీ దానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈలోపు ఇంటర్మీడియట్ పూర్తయింది. తరువాత ఫ్యాషన్‌ను కెరీర్‌గా మలచుకోవాలనుకుంది. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ చేయమని చె΄్పారు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులను నొప్పించలేక కంప్యూటర్ సైన్స్‌లో చేరింది. బీటెక్ చదువుతున్నప్పటికీ మేకప్ మెళకువలు నేర్చుకుంటూనే ఉంది. ఇన్ఫోసిస్‌ను వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా... బీటెక్ చదువుతున్నప్పటికీ మనసు యూట్యూబ్‌పైనే ఉండడంతో మరోసారి తల్లిదండ్రులను యూట్యూబ్ ఛానల్ పెడతానని అడిగింది. అయినా ఒప్పుకోలేదు. అప్పుడు హిమాద్రి అక్క... ‘‘ఛానల్‌ను పెట్టనివ్వండి. ఆమెకు మూడు నెలలు సమయం ఇద్దాం. ఆలోపు తనని తాను నిరూపించుకుంటే ఒకే. లేదంటే మనం చెప్పినట్టు చేస్తుంది’’ అని తల్లిదండ్రులను ఒప్పించింది. దీంతో హిమాద్రి పటేల్ పేరుతోనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఒక లిప్‌స్టిక్, ఐలైనర్‌తో ఛానల్లో వీడియోలు పోస్టుచేయడం ప్రారంభించింది. అందంగా కనిపించేందుకు ఎటువంటి హానీ లేని మేకప్‌ను ఎలా వేసుకోవాలో చెబుతూ వీడియోలు పోస్టుచేసేది. ఎక్కువగా నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు చెబుతుండడంతో తన ఛానల్‌కు మంచి ఆదరణ లభించింది. మరోపక్క బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. క్యాంపస్ సెలక్షన్స్‌లోనూ మంచి ప్రతిభచూపి ఇన్ఫోసిస్, క్యాప్జెమినీలలో ఉద్యోగం సంపాదించింది. అయినా హిమాద్రికి పెద్ద సంతోషంగా అనిపించలేదు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటివరకు చేసే సాంప్రదాయ ఉద్యోగం చేయడం తనకి నచ్చలేదు. తల్లిదండ్రులు ఇన్ఫోసిస్‌లో చేరమని చెప్పారు. కానీ తను యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతానని చెప్పింది. అప్పటికే హిమాద్రి మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు యూట్యూబర్‌గా కొనసాగడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ వివిధ రకాల సరికొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తూ సంపాదిస్తూ, ఎక్కువమంది ఫాలోవర్స్‌తో.. బ్యూటీ, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ అయ్యింది. అమ్మమ్మ చీరలుచూసి... హిమాద్రి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ కట్టుకునే చీరలను జాగ్రత్తగా గమనించేది. నిమిషంలో కుచ్చిళ్లు పెట్టుకుని అందంగా చీరకట్టుకుని సైకిల్ తొక్కేది అమ్మమ్మ. అంతేగాక చీరలకు తనే స్వయంగా డిజైన్లు కుట్టుకోవడం, ఇంట్లో అందరికి స్టోల్స్ అల్లడాన్ని చూసి పెరిగిన హిమాద్రి అలాంటి బట్టలనే మార్కెట్లో విక్రయించాలనుకుని..‘డ్రై బై హిమాద్రి’ పేరిట క్లాత్ బ్రాండ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ద్వారా అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ దుస్తులను విక్రయిస్తోంది. అలనాటి డిజైన్ చీరలు, డ్రెస్‌లను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా హిమాద్రి దూసుకుపోతోంది. గౌరవంగా... డ్రై (ఈఖఐ) అంటే సంస్కృతంలో గౌరవం అని అర్థం. అమ్మాయిలు, మహిళలు ధరించే చీరలు, డ్రెస్‌లు ఏవైనా గౌరవించేలా వారి కట్టుబొట్టు ఉండాలి. అందుకు తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాలను తయారు చేసి విక్రయిస్తోంది హిమాద్రి. వ్యాపార రంగంలో ఎటువంటి అనుభవమూ లేదు. కుటుంబం నుంచి వచ్చిన తొలివ్యాపారి కావడంతో హిమాద్రి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ రకాల చిక్కులను తన అక్క సాయంతో ఎదుర్కొంటూ.. చిన్నచిన్న వేడుకల నుంచి వెడ్డింగ్ డ్రెస్‌ల వరకు అన్ని వస్త్రాలను రూపొందించి డ్రైబ్రాండ్కు గుర్తింపు తెచ్చుకుని యంగ్ ఎంట్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఐదు గంటలకు పడుకునేవాళ్లం అక్కా నేను రాత్రంతా మేలుకుని చేయాల్సిన పనిగురించి పరిశోధించి, వివరంగా తెలుసుకుని పేపర్ వర్క్ పూర్తిచేసేవాళ్లం. లీగల్ విషయాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెల్లవారుజామున ఐదు గంటలకు పడుకునేవాళ్లం. అలా అన్నివిధాలా సన్నద్దమయ్యాక అంటే రెండేళ్ల తరువాత డ్రై బ్రాండ్‌ను గతేడాది అక్టోబర్‌లో తీసుకొచ్చాం. ఆర్థికంగా ఎవరూ సాయం చేయలేదు. యూట్యూబ్, కంటెంట్ బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయంతో దాచుకున్న డబ్బులనే డ్రై బ్రాండ్‌కు పెట్టుబడిగా పెట్టుకున్నాను. ప్రారంభంలో పెద్దగా ఆర్డర్లు ఏమీ రాలేదు. నెల తరువాత ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆర్డర్లతో పెట్టుబడికి కొంత, మిగతాది వర్కర్లకు జీతాలకు ఇచ్చేదాన్ని. అలా చేస్తూ ఇప్పుడు కాస్త లాభాలు ఆర్జిస్తున్నాను. – హిమాద్రి పటేల్ -
అదిరేటి డ్రెస్సు.. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్
-
ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది
డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యునిక్‌గా ఉండాలనే ఆలోచన నేటి యూత్‌ది. వారి అభిరుచికి తగినట్టుగా అందుబాటులోకి వచ్చింది. వన్‌సైడ్ లాంగ్ స్టయిల్. టాప్ లేదా కుర్తీ ఒక వైపు పొడవుగా, మరోవైపు పొట్టిగా ఉండటం ఈ స్టయిల్ ప్రత్యేకత. రెండు రంగులు భిన్నం కావచ్చు. రెండు ఫ్యాబ్రిక్స్ కూడా వేర్వేరువి అయి ఉండవచ్చు. కుర్తా లేదా టాప్ డిజైన్‌లో ప్రత్యేకత కనిపించాలంటే ఓ చిన్న మార్పు తీసుకురావాలి. డిజైనర్స్ చేసిన ఓ చిన్న ఆలోచన యూత్‌ని మరింతగా ఆకట్టుకుంటుంది. వెస్ట్రన్ నుంచి ఇండియన్ వేర్‌లోకి ఈ డిజైన్ కొత్తగా ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ పార్టీలో ప్రత్యేకతను చాటడమే కాదు, స్ట్రీట్ స్టయిల్గానూ మార్కులు కొట్టేస్తోంది ఈ డిజైన్. -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సూత్ర ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి.. ( ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
సక్సెస్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఆనందాన్నిస్తుంది కాబట్టి. ఆనందాలు మళ్లీ మళ్లీ కావాలి... కొత్త కొత్త రూపాల్లో రావాలి... ఇదీ సంగీతారాజేశ్ ఆకాంక్ష. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో నిస్వార్థసేవ. ఫ్యాషన్ ఇండస్ట్రీకి కొత్త నడక. బ్యూటీ ఇండస్ట్రీ అధ్యయనం. మహిళలకు మార్కెట్ పాఠాల బోధన. అన్నింటిలో రాణిస్తున్న... ఆమె ‘సక్సెస్ మంత్ర’ ఏమై ఉంటుంది? ఓ ముప్పై– నలభై ఏళ్ల కిందట... ‘ఇది ఇంపోర్టెడ్ శారీ, మా అన్న సింగపూర్ నుంచి తెచ్చాడు’ అని ఒకరు హోదా ఒలకబోసేవారు. ‘నాది కూడా ఇంపోర్టెడే. ఫలానా నగరంలో స్మగుల్డ్ గూడ్స్ దొరుకుతాయి’ అని మరొకరు... మీకు నేనేమీ తీసిపోను అన్నంత ధీమాగా. అప్పట్లో ఇలా నడిచేవి సగటు మహిళల కబుర్లు. వాళ్లలో ఎవరికీ స్మగుల్డ్ గూడ్స్ కొనడం చట్టరీత్యా నేరమనే విషయం తెలియదు కూడా. సింథటిక్ మోజుతోపాటు ఇలాంటి హోదాల ప్రదర్శనలో మన సంప్రదాయ వస్త్రాలు తెరమరుగయ్యాయి, క్రమంగా వస్త్రాల తయారీదారులు కనుమరుగవడం కూడా మొదలైంది. అలాంటి సమయంలో గ్లోబలైజేషన్ రూపంలో వచ్చింది ఓ పెనుమార్పు. మన చేనేతలకు విదేశాల్లో అందుతున్న గౌరవాలను స్వయంగా చూసిన మన మహిళలే మన సంప్రదాయ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. నిర్లిప్తంగా మిగిలిపోయిన చేనేత, హస్తకళాకారుల వైపు చూసింది భారతీయ ఫ్యాషన్ ఇండస్ట్రీ. అలాంటి సమయంలో పెన్ కలంకారీని పునరుద్ధరించడానికి స్వచ్ఛందంగా సేవ చేశారు సంగీతా రాజేశ్. అంతకంటే ముందు ఆమె పిల్లల చదువు వారి మానసిల్లోసానికి, మే«ధావికాసానికి దోహదం చేయాలి తప్ప బడి అంటే భయపడేలాగ ఉండకూడదని స్పెషల్ కిడ్స్ కోసం ప్రత్యేకమైన కరిక్యులమ్ తయారు చేశారు. పిల్లల్లో మేధావికాసానికి మన తాతమ్మల నుంచి ఇంట్లో ఆడుకున్న బోర్డ్‌గేమ్స్ దోహదం చేస్తాయని ఆచరణ లో చూపించారామె. సోషల్ మీడియా లో లక్షలాది ఫాలోవర్లున్న ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ఇప్పుడు తాజాగా ‘మనిషిని సమాజంలో ఆత్మవిశ్వాసం తో ముందుకు నడిపించే సాధనం అందంగా కనిపించడం కూడా’ అని మరో ప్రయోగానికి తెర తీశారు. ♦ స్పెషల్ పాఠాలు ‘‘నేను మధురైలో పుట్టాను, దిండిగల్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబంలోని అబ్బాయితో పెళ్లయింది. అలా పాతికేళ్ల కిందట హైదరాబాద్‌కి వచ్చాను. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, స్పెషల్ చిల్డ్రన్‌కి స్పీచ్ థెరపీ, వాళ్లకు కాన్సెప్ట్ అర్థమయ్యేటట్లు టీచింగ్ మెటీరియల్, ప్రత్యేకమైన టీచింగ్ మెథడాలజీతో క్లాసులు చెప్పి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పరీక్షలు రాయించి మెయిన్ స్ట్రీమ్‌కి పంపించడం నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్. అందులో బిజీగా ఉన్నప్పుడు కలంకారీ మీద ఆసక్తి కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో నిష్ణాతులు చేసే పెన్ కలంకారీ మీద అధ్యయనం చేశాను. వాళ్ల చేతిలో కళ ఉంది, నా దగ్గర సృజన ఉంది. ఆ రెండింటినీ కలుపుతూ కొత్త ప్యాటర్న్స్ తెచ్చాం. వాటి ఖరీదు ఎక్కువే. కానీ ఒక చీర అమ్మగలిగానంటే దానిని తయారు చేసిన కుటుంబం నెలంతా ఆకలి లేకుండా జీవించగలుగుతుంది. పెన్ కలంకారీని ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాను. వీవర్స్‌కి ప్రయోజనం కల్పించడంలో నా లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత చాలామంది ఇదే పంథాను అనుసరించారు. పెన్ కలంకారీ కళాకారుడికి సూచనలు ఇస్తూ... ♦ పంచడానికే జ్ఞానం! నేను ప్రధానంగా టీచర్ని కావడంతో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను నాలో దాచుకోలేను. జ్ఞానం ఉన్నది పలువురికి పంచడానికే అన్నట్లు ఉంటాను. వినడానికి నా ఎదురుగా ఎవరూ లేకపోతే ఫేస్బుక్లో చెబుతాను. అలా తొమ్మిదేళ్ల కిందటే నేను ఎఫ్బీ వేదికగా కాస్ట్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. నాకు అప్పటికే ఎనిమిది లక్షల ఫాలోవర్లున్నారు. ఆ టైమ్‌లో నాకు అసలైన చాలెంజ్ నా వ్యాపారాన్ని కొనసాగించడం కాదు, నా ఉద్యోగులకు జీతాలివ్వడం. రెండు వారాలు మినహా మిగతా కోవిడ్ సమయమంతా పని చేశాను. అప్పుడు షోరూమ్‌లు, మాల్స్‌లో జనం కనిపించలేదు, కానీ ఆన్లైన్లో చాలా ఎక్కువగా కొనుగోళ్లు చేశారు. ♦ అదే నా సక్సెస్ సూత్ర నేను కోవిడ్ టైమ్‌లో సూరత్, జైపూర్‌కు వెళ్లి అక్కడి నుంచి లైవ్‌లో డిస్ప్లే చేశాను. గంటల్లోనే కొనుగోళ్లు జరిగాయి. స్టాక్ అక్కడి నుంచే నేరుగా డెలివరీ ఇచ్చేశాను. ఒక రవాణా ఖర్చు, ఒక స్టేట్ జీఎస్టీ తగ్గిపోతే ఎంత ఆదానో ఆలోచించండి. విదేశాలకు వెళ్లాల్సిన స్టాక్ ఆగింది, మార్కెట్ చేసి పెట్టమని అడిగిన వాళ్ల స్టాక్‌ను ఆన్లైన్లో అమ్మేశాను. దాంతో స్టాక్ కొనుగోలుకు డబ్బు పెట్టాల్సిన అవసరం రాలేదు. అటు ఉత్పత్తిదారులు, నేను– నా ఉద్యోగులు, వినియోగదారులు... అందరికీ ప్రయోజనమే. అందుకే విన్ విన్ డీల్ ఎప్పుడూ సక్సెస్ అవుతుందని నమ్ముతాను. గృహిణులు కొంతమంది ఇంట్లోనే చిన్న స్థాయిలో దుస్తులు, ఇతర ఇంటికి అవసరమైన వస్తువుల వ్యాపారం చేస్తున్నారు. కానీ అదంతా అవ్యవస్థీకృతంగా ఉంది. అలాంటి హోమ్ సెల్లర్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఔత్సాహిక మహిళలకు బోధన తరగతులలో పాఠాలు చెప్తున్నాను. వ్యాపారం కోసం ఓ సొంత ఫోన్ నంబరు, బ్యాంకు అకౌంట్ నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలలో శిక్షణ, మార్కెట్ మెళకువలతోపాటు డెడ్స్టాక్ను ఎలా డీల్ చేసే సులువు కూడా నేర్పిస్తున్నాను. హోమ్ సెల్లర్స్ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే... స్నేహితులు, బంధువులలో కస్టమర్లను వెతుక్కోవడం. ఆ పొరపాటు వల్ల స్నేహితులు, బంధువులు దూరమవుతారు తప్ప, లాంగ్ టర్మ్ కస్టమర్లను ఏర్పరుచుకోవడం సాధ్యం కాదు. ప్రొఫెషన్నీ, కుటుంబ బంధాలను కలపకూడదు’’ అని తాను నేర్చుకున్న, అనుసరించిన సక్సెస్ సూత్రను వివరించారు సంగీతారాజేశ్. స్పెషల్ చాలెంజ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని బాగా అధ్యయనం చేశాను, కాబట్టే బ్యూటీకి ఉన్న ఆదరణ, మేకోవర్ అవసరాన్ని కూడా తెలుసుకోగలిగాను. ఫ్యాషన్, బ్యూటీ... ఈ రెండూ ఒకదానితో ఒకటి కలగలిసి ఉంటాయి. అందం అనేది మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సాధనం. మరి అలాంటప్పుడు అందాన్ని పెంచుకోవడానికి ఎన్నెన్నో అధునాతన సాధనాలు అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో అందంగా కనిపించడం అనే ఆకాంక్షకు ఎవరైనా ఎందుకు దూరంగా ఉండాలి? నేను వయసులో ఉన్నప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పరుగులు పెట్టాను, రిటైర్మెంట్ లేకుండా ఒకచోట స్థిమితంగా ఉంటూ నిర్వహించుకోవడానికి ఇప్పుడు కొత్త కెరీర్లోకి అడుగుపెట్టాను. ఇందులో కూడా సక్సెస్ అయ్యి, మరో ఐదేళ్లలో కొత్త తరానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుతాను. నేను కెరీర్ రోల్స్ ఎన్ని మార్చినా స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్లో కొనసాగుతూనే ఉంటాను. – సంగీతారాజేశ్, స్పెషల్ ఎడ్యుకేటర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే?
‘చిటియా కలైయా వే.. ఓ బేబీ మెరీ చిటియా కలైయా వే’ అనే ఈ హిందీ (‘రాయ్’ సినిమా) పాట భాషాకతీతంగా ఎంత హిట్టో తెలియని సినీ ప్రేక్షకుల్లేరు. అలాగే ఆ పాట మీద డాన్స్ చేసిన ఆ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిభ గురించి కూడా పరిచయం లేని అభిమానుల్లేరు. ఇక జాక్వెలిన్ స్టైల్ గురించి, ఫ్యాషన్‌లో ఆమెకున్న అభిరుచి, ఆమె ఫ్యాషన్ సెన్స్‌ను తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దామా ! 'నా దృష్టిలో ఫ్యాషన్ అంటే సౌకర్యమే. 1990ల చివర్లో వచ్చిన ట్రెండ్స్ అంటే నాకు భలే ఇష్టం' అని ఫ్యాషన్‌పై తనకున్న మమకారాన్ని తెలిపింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆమె ఎక్కువగా వాడే బ్రాండ్స్‌లలో 'రోజ్ రూమ్' ఒకటి. ఈ 'రోజ్ రూమ్' బ్రాండ్ చీర ధర రూ. 15, 500. ఇక జ్యూయెలరీ విషయానికొస్తే 'అమ్రిస్'ను ఎక్కుగా ప్రిఫర్ చేస్తుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ బ్రాండ్‌లోని నెక్లెస్, కమ్మలు, ఉంగరం ధరలు నాణ్యత, డిజైన్ బట్టి ఉంటాయి. రోజ్ రూమ్: ‘ఓ స్త్రీగా నాలో నేను దేన్ని నమ్ముతాను.. ఎలా ఉండాలనుకుంటాను.. ఏం కోరుకుంటానో అవే నా డిజైన్స్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా దృష్టిలో దేవుడి అద్భుతమైన సృష్టి స్త్రీ. నా బ్రాండ్ ఆమెను మరింత అద్భుతంగా మలస్తుంది’ అంటోంది ‘రోజ్ రూమ్’ లేబుల్ వ్యవస్థాపకురాలు ఇషా. ఇంతకు మించి ఈ బ్రాండ్‌కు వివరణ, వర్ణన ఏం ఉంటుంది! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ధరలూ అందుబాటులోనే. అమ్రిస్: పన్నెండేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. ప్రేరణ రాజ్‌పాల్. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తన అత్తగారికున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూయెలరీ బ్రాండ్‌ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్‌తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ అమ్రిస్ను విస్తరించారు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. -
పరి పూనమ్ చౌదరి.. ఉమన్ ఆఫ్ బునాయ్
తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్ని అవుతాను.. ఇంజినీర్ని అవుతాను... కలెక్టర్ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్ చౌదరి. జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్ అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ కోర్సును నేర్చుకుంది. తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్ చేస్తూనే ఫైన్ ఆర్ట్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్’, లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్ ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్‌కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్‌ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఫ్యాషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్ డిజైనింగ్ ఐడియాలతో ‘బునాయ్’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు. బునాయ్ బ్రాండ్... భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా ఉండే డ్రెస్‌లతో 2016లో బునాయ్ని జైపూర్‌లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్‌గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్‌లను ఆన్ లైన్ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్ టోన్‌కు సరిపడినట్లు డిజైన్ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్ ‘బునాయ్’ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్ మోడల్స్ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్‌లు లభించడం కూడా బునాయ్ బ్రాండ్ పాపులర్ అవడానికి మరో కారణం. ఉమన్ ఆఫ్ బునాయ్ ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్‌ను చేర్చుకుని బునాయ్ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్‌తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్‌కి ‘ఉమన్ ఆఫ్ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్ బ్రాండ్‌వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్ అయింది. ఇన్ స్టాగ్రామ్ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్‌తో పరి ఫ్యాషన్ ఇన్ ఫ్లుయెన్సర్ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డ్స్’లో ఈ–కామర్స్ టెక్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు కూడా ఆమెను వరించింది. -
ది గ్రూమింగ్ స్కూల్ కలలు నెరవేర్చే డిజిటల్ బడి
సాధారణ పల్లెల నుంచి పెద్దపట్టణాల వరకు ఎంతోమంది అమ్మాయిలకు ‘మిస్ ఇండియా’ మిస్ దివా’ కావాలనే లక్ష్యం ఉండవచ్చు. పక్కవారి నుంచి వెక్కిరింపులు కూడా ఎదురు కావచ్చు. ‘అది మనలాంటి వాళ్ల కోసం కాదు’ అంటూ అతిశయోక్తుల సమాచారం వెల్లువెత్తవచ్చు. ఈ గందరగోళాన్ని పక్కకు నెట్టి, స్పష్టత ఇవ్వడానికి, విజయం వైపు దారి చూపడానికి వచ్చిందే.. ది గ్రూమింగ్ స్కూల్. ‘అందంగా కనిపించాలనే ఆసక్తి మీలో ఉందా? ఆత్మవిశ్వాసం ఉందా? మీలోని శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం ఉందా?...‘అయితే ఈ లైఫ్ ఛేంజింగ్ స్కూల్ మీకోసమే’ అంటోంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్(ముంబై). దశాబ్దాలుగా ఎంటర్ టైన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) ఎంతోమంది యువతులు అందాల కిరీటాన్ని అందుకోవడంలో సహాయపడింది. ‘డూ–ఇట్–యువర్సెల్ఫ్’ అని నినదిస్తున్న ‘ఎంఐవో’ ఔత్సాహిక యువతుల కోసం ‘ది గ్రూమింగ్ స్కూల్’ ద్వారా వివిధ రంగాల నిపుణులతో వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. స్కిన్‌కేర్, హెయిర్‌కేర్, స్టైలింగ్, మేకప్, వ్యక్తిత్వ వికాసం, ఫ్యాషన్ స్టైలింగ్, సోషల్ మీడియా... మొదలైన వాటిలో నిపుణులు వీడియో తరగతులు నిర్వహిస్తారు. వారిలో కొందరు... అయేషా సేథ్ (మేకప్ ఆర్టిస్ట్), అలేషియా రౌత్(ర్యాంప్ వాకర్), సంజీవ్‌దత్తా (పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్), భరత్ గుప్తా (ఫ్యాషన్ స్టైలీస్ట్), డా.జార దాదీ (స్కిన్‌కేర్ కోచ్). యువతులను బ్యూటిఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా నిలపడంలో వీరి పాఠాలు ఉపయోగపడతాయి. ఈ జెండర్–న్యూట్రల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత నైపుణ్యం సొంతం అవుతుంది. ‘కల కనడం ఎంత ముఖ్యమో, ఆ కలను సాకారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారి కోసం, నిర్మాణాత్మకమైన పాఠాలతో ఒక బలమైన వేదికను ఏర్పాటు చేశాం’ అంటుంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. కోర్సు పూర్తయిన తరువాత అభ్యర్థులకు సంస్థ నుంచి సర్టిఫికెట్లు అందుతాయి. అంతకంటే ముఖ్యంగా ఆత్మబలం అపారంగా అందుతుంది! -
6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!
ఇరవై ఎనిమిదేళ్ల ఓషియానాకు వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా ఉంది. కానీ ‘‘ఇంట్లో ఎవరూ వ్యాపారస్థులు లేరు, ఏ అనుభవం లేకుండా వ్యాపారం ఎలా చేస్తావు’’ అంటూ తల్లిదండ్రులు ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లారు. అయితే అక్కడితో తన ఆశను వదిలేయకుండా, వాళ్లను ఎలాగో ఒప్పించి ఓ స్టార్టప్ ను ప్రారంభించింది. అనుభవం లేకపోయినా అంకిత భావం ఉండటం వల్ల ప్రారంభంలో ఎదురైన అనేక ఆటుపోట్లను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోయింది. ఫలితం.. ఇప్పుడామె ఆదాయం నెలకు కొన్ని లక్షలు. అలా వ్యాపారం చేయాలన్న ఎంతోమంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తోంది ఓషియానా. ఢిల్లీకి చెందిన ఓషియానా ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ‘ఫ్యాషన్ ఎక్స్పోర్ట్ హౌజ్’లో చేరింది. అక్కడ ఉద్యోగం చేస్తోంది కానీ మనసులో మాత్రం బిజినెస్ చేయాలని బాగా కోరిక. తన కోరికను తల్లిదండ్రుల ముందుంచితే ‘‘ఉద్యోగంలో ఎటువంటి రిస్కూ ఉండదు. వ్యాపారం అయితే లాభనష్టాలతో కూడుకున్నది. ఎక్కువ ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగం చెయ్యి’’ అని ప్రభుత్వ ఉద్యోగస్థులైన తల్లిదండ్రులు ఆమెను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఓషియానా వారి అభిప్రాయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తన మనసులో ఉన్న బిజినెస్ ప్లాన్ గురించి వివరించి ‘‘మీరు నాకు ఆరునెలలు సమయం ఇవ్వండి. నన్ను నేను నిరూపించుకుంటాను. అది జరగని పక్షంలో మీరన్నట్లే చేస్తాను’’ అని చెప్పి ఒప్పించింది. ఫ్రెండ్‌తో కలిసి.. తల్లిదండ్రులు ఒప్పుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా 2019 ఫిబ్రవరిలో తన స్నేహితుడు సౌరభ్ తోకస్తో కలిసి ‘మోడ్రన్ మిత్’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఓషియానా ఉద్యోగం చేసేటప్పుడు దాచుకున్న డబ్బులు, ఇంకా సౌరభ్ తెచ్చిన కొంత మొత్తం కలిపి ఆరు లక్షల రూపాయలతో.. నాలుగు కుట్టు మిషన్లు, నలుగురు కళాకారులతో రెగ్జిన్ , కార్క్, కాటన్ , పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్ వంటి వీగన్ పదార్థాలతో బ్యాగ్‌ల తయారీ మొదలు పెట్టింది. చూడటానికి చాలా మోడర్న్‌గా ఉంటూ మన్నికగా ఉండే ఈ బ్యాగ్‌లకు మంచి ఆదరణ లభించింది. విక్రయాలు బాగా జరిగేవి. అలా వచ్చిన లాభాన్ని మళ్లీ దానిలోనే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చింది. నేడు 15 మంది హస్త కళాకారులు, పది మిషన్లతో మోడ్రన్ మిత్ దూసుకుపోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మిత్ కస్టమర్లకు నాణ్యమైన బ్యాగ్‌లు అందించేందుకు ప్రస్తుతం అందుబాటు లో ఉన్న టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్లను వాడుకుని నెలకు 14 నుంచి 20 లక్షల వరకు ఓషియానా ఆర్జిస్తోంది. డిజైన్ , నాణ్యతే మా ప్రత్యేకత ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో డిజైన్ తోపాటు నాణ్యత చాలా ముఖ్యం. అందుకే నేను ముందు మంచి హస్తకళాకారులను అన్వేషించాను. తరతరాలుగా అదే పనిచేస్తోన్న కుటుంబాలకు చెందిన కళాకారులను ఎంపికచేశాను. నా కంపెనీలో పనిచేస్తోన్న కళాకారుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీళ్లు చేతితోనే అందమైన డిజైన్లు రూపొందిస్తారు. రెగ్జిన్ , కార్క్, కాటన్ లను ఢిల్లీ, కోల్‌కతాల నుంచి సేకరించి అందమైన బ్యాగ్‌లు రూపొందిస్తున్నాము. పైనాపిల్ వ్యర్థాలు, క్యాక్టస్ ఫైబర్‌ను కూడా తయారీలో వాడుతున్నాం. వీటివల్ల పర్యావరణానికి హాని కలగదు. మా దగ్గర 130 రకాల బ్యాగ్‌లు తయారవుతాయి. వీటిలో హ్యాండ్ బ్యాగ్స్, టాట్స్, స్లింగ్ బ్యాగ్స్, మేకప్ పౌచ్‌లు, ట్రావెలింగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార అనుభవం లేని అమ్మాయిగా ప్రారంభంలో నాకు చాలా సమస్యలు ఎదురైనప్పటికీ సౌరభ్ సాయంతో అన్నింటినీ అధిగమించగలిగాను. మా ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా నేరుగా కస్టమర్లకు చేరుస్తూ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తున్నాను. ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే ముందు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాన్ని బాగా పరిశోధించి అర్థం చేసుకోవాలి. తర్వాత తక్కువ పెట్టుబడితో ప్రారంభించి దానిపై పట్టు సాధించాక అంచెలంచెలుగా దానిని పెంచుకోవాలి’’ అని స్టార్టప్ ఔత్సాహికులకు సూచిస్తోంది ఓషియానా. -
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్.. విజయం సాధించండిలా
ఫ్యాషన్.. యువతకు ఇప్పుడు చక్కటి కెరీర్ మార్గంగా నిలుస్తోంది. ఫ్యాషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు ఉంటే.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి! ఇలాంటి నైపుణ్యాలు అందించే వేదిక.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)!! దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. హెయిర్ స్టైల్ అదిరిపోవాలి. డ్రెస్సింగ్ ట్రెండీగా ఉండాలి. ఎదుటివాళ్లు కళ్లు తిప్పుకోకూడదు. చివరకు కాళ్లకు తొడిగే ఫుట్‌వేర్ సైతం వెరైటీగా ఉండాల్సిందే! ఇది నేటి యువత ఫ్యాషన్ ధోరణి!! ఇలాంటి ప్రొడక్ట్స్‌ను మార్కెట్లో తేవాలంటే..అంత తేలిక కాదు. అందుకు ఫ్యాషన్ నిపుణులు అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ అవకాశంగా మారుతోంది. నిఫ్ట్ ప్రత్యేకత భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్). ఈ ఇన్స్టిట్యూట్కు దేశ వ్యాప్తంగా 17క్యాంపస్‌లు ఉన్నాయి. ఫ్యాషన్ రంగానికి సంబంధించి డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. బ్యాచిలర్, మాస్టర్ స్థాయిలో కోర్సులను అందిస్తున్నారు. నిఫ్ట్ క్యాంపస్‌లు అందించే ఈ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశం పొందాలంటే.. నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాచిలర్ స్థాయి డిజైన్ ►బ్యాచిలర్ స్థాయిలో..బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ పేరుతో అందుబాటులో ఉన్న కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్; లెదర్ డిజైన్; యాక్ససరీస్ డిజైన్; టెక్స్టైల్ డిజైన్; నిట్వేర్ డిజైన్; ఫ్యాషన్ కమ్యూనికేషన్. ►వీటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బ్యాచిలర్ స్థాయిలోనే.. ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశానికి ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. పీజీ ప్రోగ్రామ్‌లు ►పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ►మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(కనీసం మూడేళ్లు)ఉత్తీర్ణులు అర్హులు. ►మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: నిఫ్ట్ అందించే బీ.ఎఫ్.టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. ►పీజీ కోర్సులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. మూడంచెల ఎంపిక ప్రక్రియ నిఫ్ట్–అడ్మిషన్ ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. తొలిదశలో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(సీఏటీ);జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ)ను నిర్వహిస్తారు. ఆ తర్వాత దశలో సిట్యుయేషన్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్లు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు. తొలి దశ జీఏటీ ►బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ను నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ►బీడిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►ఎండిజైన్ కోర్సుకు జీఏటీ పేపర్లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ►జీఏటీలోనూ పలు విభాగాల నుంచి నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ.. ప్రత్యేక పరీక్ష బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో బీ.ఎఫ్.టెక్, ఎం.ఎఫ్.టెక్‌లకు సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయి. రెండో దశ.. సీఏటీ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ ప్రక్రియలో రెండో దశ పరీక్ష.. సీఏటీ(క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్). అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. మూడో దశ.. సిట్యుయేషన్ టెస్ట్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా మూడో దశలో నిర్వహించే పరీక్ష.. సిట్యుయేషన్ టెస్ట్. ఇది పూర్తిగా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఉంటుంది. అభ్యర్థులకు నిర్ణీత మెటీరియల్ అందించి ఏదైనా ఆకృతిని రూపొందించమని సూచిస్తారు. లేదా ఏదైనా ఒక సందర్భాన్ని పేర్కొని.. దానికి తగినట్లుగా ఊహా చిత్రం గీయమని అడుగుతారు. చివరగా.. జీడీ, పీఐ నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్లోని తొలి మూడు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లు నిర్వహిస్తారు. జీడీ ద్వారా అభ్యర్థి భావవ్యక్తీకరణ, స్పష్టత, ఆలోచన సామర్థ్యాలను పరిశీలిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది. ఇందులోనూ విజయం సాధిస్తే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. విజయం సాధించండిలా ►నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియలో పేర్కొన్న జీఏటీ, సీఏటీ, సిట్యుయేషన్ టెస్ట్‌లు.. వాటిలో సెక్షన్లు, సంబంధిత సబ్జెక్ట్‌లలో రాణించడానికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ►క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్,అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు,టైమ్ అండ్ డిస్టెన్స్,టైమ్ అండ్ వర్క్ సంబంధించిన అంశాల్లో పట్టు సాధించాలి. ►కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.అభ్యర్థులు బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ►అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన కాన్సెప్ట్‌లు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోవాలి. ►జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ స్టడీస్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు–సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి. ► కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుల అభ్యర్థులకు మాత్రమే నిర్వహించే కేస్ స్టడీ వినూత్నంగా ఉంటుంది. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి.. దానికి పరిష్కారం అడుగుతారు. దీనిలో రాణించాలంటే.. అభ్యర్థులు వాస్తవ అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం పెంచుకోవాలి. ఆసక్తి ప్రధానం ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఆసక్తి ఎంతో ప్రధానం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు,జీవన శైలి,వ్యక్తుల అభిరుచుల్లో మార్పులు గమనిస్తూ.. ప్రొడక్ట్ డిజైన్ చేసే దూరదృష్టి అవసరం. ప్రస్తుతం ఫ్యాషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఢోకా లేదు. –ప్రొ.ఎల్.మదన్ కుమార్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్, నిఫ్ట్, హైదరాబాద్ కోర్సులు–సీట్లు ►జాతీయ స్థాయిలో మొత్తం 17 నిఫ్ట్ క్యాంపస్‌ల్లో అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 686, లెదర్ డిజైన్: 168, యాక్ససరీ డిజైన్: 600, టెక్స్టైల్ డిజైన్: 646, నిట్వేర్ డిజైన్: 296, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 642,బీఎఫ్‌టెక్(అపెరల్ ప్రొడక్షన్): 518, మాస్టర్ ఆఫ్ డిజైన్: 171, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 650, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ: 140. ►నిఫ్ట్ హైదరాబాద్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు..బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్: 37, యాక్ససరీ డిజైన్:37, టెక్స్టైల్ డిజైన్: 37, నిట్వేర్ డిజైన్: 37, ఫ్యాషన్ కమ్యూనికేషన్: 37, బీ.ఎఫ్.టెక్(అపరెల్ ప్రొడక్షన్): 37,మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్: 37. n అన్ని క్యాంపస్‌లలోనూ ఇక్కడ పేర్కొన్న సీట్లతోపాటు ప్రతి కోర్సులో అయిదు సీట్లను అదనంగా.. ఎన్ఆర్ఐ విద్యార్థులు, సార్క్ దేశాల విద్యార్థులు, విదేశీ విద్యార్థుల కోసం కేటాయించారు. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ►యూజీ/పీజీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి మొదటి వారం. ►బ్యాచిలర్ కోర్సులకు రాత పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి మొదటి వారం ►వివరాలకు వెబ్సైట్: https://www.nift.ac.in/ -
Blouse Mehndi: మెహందీని ఇలా కూడా వాడుతున్నారా!
చేతి నిండా ఎర్రగా పండే.. ‘మెహందీ’ అంటే ఇష్టంలేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు మెహంది అనగానే చేతులు, కాళ్లు, కొన్ని సార్లు తెల్లజట్టుకు వేసుకోవటం తెలుసు. అయితే రోజురోజుకు మహిళలు కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతూ ట్రెండీగా మెరిసిపోతున్నారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి ఫ్యాషన్ బ్రాండ్లను వాడుతున్నారు. భిన్నమైన చుడీదార్లు, డిజైన్ శారీలు, బ్లౌజులు వేసుకొని ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా మెహందీ బ్లౌజ్ వేసుకున్న ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను థానోస్ జాట్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే సాధారణంగా ధరించే బ్లౌజ్‌కు బదులుగా శరీరంపై హెన్నా(మెహంది) డిజైన్ వేసుకోవడం. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు.. ‘కొత్తగా ఉంది డిజైన్’.. ‘మెహందీని ఇలా కూడా వాడుతున్నారా?’.. అసలు బ్లౌజ్‌గా మెహందీని వేసుకోవడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanos (@thanos_jatt) -
బొగ్గు గౌను.. మైనం చీర..ఫ్యాషన్ డిజైనర్ సృజన
కాలానుగుణంగా దుస్తులను రూపొందించి, విభిన్న మోడల్స్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్ డిజైనర్లను ఎంతో మందిని చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీ జిల్లా వాసి ఫ్యాషన్ డిజైనర్ గుప్తా పరిచయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ట్‌ను సైన్స్‌ను కలగలిపి వినూత్న డిజైన్లు రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడుసార్లు గుర్తింపు తెచ్చుకుంది. టిష్యూ పేపర్‌తో చేసిన గౌను, మైనంతో చేసిన డ్రెస్, ఫెవికాల్తో చేసిన తెల్లటి దుస్తులు, బొగ్గు, తారుతో చేసిన గౌన్లు్ల, స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన లెహెంగా, వైట్ సిమెంట్‌తో చేసిన డ్రెస్, లిక్విడ్ సోప్‌తో చేసిన చీర.. ఇలా ఆమె రూపొందించిన వినూత్నమైన ఏడురకాల దుస్తులకు ఏడు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రాఖీ డ్రెస్ డిజైన్స్‌లో చేస్తున్న ఆసక్తికర ప్రయోగాలు తెలుసుకున్నా కొద్దీ ఆసక్తికరంగా ఉంటాయి. మోడల్ దుస్తులతో సైన్స్ ప్రాజెక్ట్ రాఖీ గుప్తా కుటుంబంలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. రాఖీ కూడా డాక్టర్ అవుతుంది అని అనుకున్నారు ఆమె తల్లీ తండ్రి. కానీ, చిన్ననాటి నుంచి రాఖీ ప్రవర్తన వేరుగా ఉండేది. తినడానికి ప్లేట్లో రొట్టెలను పెడితే, వాటిని అందంగా అలంకరించేది. స్కూల్లో టీచర్ సైన్స్ ప్రాజెక్ట్ చేయమంటే వార్తాపత్రికల కటింగ్‌తో డ్రెస్ డిజైన్స్ చేసి, పుస్తకంలో అతికించేది. ‘రెడ్ కార్పెట్‌పై నడిచే మోడల్స్ ధరించే దుస్తులంటే నాకు చాలా ఇష్టం. నా మనసు ఆసుపత్రిలో కాకుండా దేవకన్యలు, యువరాణుల దుస్తులలో చిక్కుకుంది. దీంతో నేను ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఎంచుకున్నాను’ అంటుంది రాఖీ. సరైన దారి.. 2009లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. ఆ కోర్సు సమయంలోనే ఫ్యాషన్ షోలు చేశాను. అక్కడ నా డిజైన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం నాన్న చనిపోయారు. సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. డిజైనింగ్ నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. రంగుల ప్రపంచంపై నాకున్న ఇష్టాన్ని పదే పదే చెప్పేది. దీంతో తిరిగి డిజైనింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిజైనింగ్‌లో ఏదో కొత్త పని చేస్తూనే ఉన్నాను. సైన్స్, కళల కలయికకు గుర్తింపు ఫ్యాషన్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇందులో డిజైనర్లందరూ తమ సృజనను చూపుతూనే ఉంటారు. నేను సంప్రదాయ దుస్తులను ముఖ్యంగా పెళ్లి డ్రెస్సులను డిజైన్ చేసేదాన్ని. ఫ్యాషన్ అనేది కేవలం బట్టలకే పరిమితం కాదని, ఏదో కొత్తదనాన్ని చూపాలనుకున్నాను. అప్పుడే సైన్స్ ద్వారా ఏదైనా సృష్టించాలనుకున్నాను. ఆ తర్వాత నా ఆలోచనలపై పరిశోధన చేస్తూనే ఉన్నాను. ప్రజలు ఊహించని విధంగా మైనం, బొగ్గు బేస్ చేసుకొని రెండు డ్రెస్సులను తయారు చేశాను. ఆ రెండింటికీ లిమ్కాబుక్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఎంతో మంది చేత ప్రశంసలు, గౌరవం దక్కాయి. డిజైనింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఇతర వస్తువులనూ ఉపయోగిస్తూ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం, వాటితో డ్రెస్సులను రూపొందించడం నా హాబీ. దీంట్లో భాగంగానే వైట్ సిమెంట్, ఫెవికాల్, సోప్ లిక్విడ్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ చీరలు, డ్రెస్సులు రూపొందించాను. ఏడురకాల ఈ దుస్తులకు ఏడుసార్లు లిమ్కా బుక్రికార్డులో చోటు దక్కించుకున్నాను’’ అని వివరించారు రాఖీ గుప్తా. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, సైన్స్‌ను కళను కలిపి తయారుచేసే డిజైన్లతో రికార్డులు సాధిస్తూ తీరిక లేకుండా ఉండే రాఖీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటుంది. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళుతుంది. వృద్ధాశ్రమంలోని బామ్మలకు నచ్చిన చీరలు ఇచ్చి వస్తుంటుంది. పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుంది. బహుమతులు, భోజనం అందిస్తుంది. వినూత్నంగా ఆలోచించమని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఆమె చేస్తున్న కృషికి గాను మహిళా సాధికారత అవార్డు, విశిష్ట పౌర పురస్కారం లభించాయి. -
చీర కట్టుల్లో సమ్మోహనపరుస్తున్న అందాల అదితీ
అందం, అభినయంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్న నటి అదితీరావు హైదరీ. స్క్రీన్ మీద ఎంచుకునే పాత్రల్లోనే కాదు.. అప్పియరెన్స్ కోసం అనుసరించే ఫ్యాషన్‌లోనూ వినూత్నమైన అభిరుచి ఆమెది! ఆ టేస్ట్‌కు అద్దం పట్టే బ్రాండ్సే ఇవీ.. ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే .. ‘ది సింబల్ ఆఫ్ టైమ్‌లెస్’.. అనేది ఈ సంస్థ క్యాప్షన్. తగ్గట్టుగానే రాజుల కాలం నుంచి నేటి వరకూ ఉన్న ప్రతి డిజైన్‌లో ఆభరణాలు లభిస్తాయిక్కడ. 1897లో ప్రారంభమై, వంద సంవత్సరాలకు పైగా ఎన్నో అద్భుతమైన బంగారు, వెండి, వజ్రాభరణాలను వీరు అందిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్లలో వీరి ఆభరణాల్లోనే మెరిశారు. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ ఎమ్‌బీజే పునీత్ బలానా, సెలబ్రిటీస్ స్టైలిస్ట్, ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. పునీత్ బలానా .. ఇతని కలెక్షన్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కారణం.. పునీత్ బలానా అంటే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. రాజస్థాన్‌లో పుట్టి, సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేసి, ఎన్నో అందమైన ఫ్యాషన్ డిజైన్స్‌ను అందించాడు. ఈ దుస్తులన్నీ ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో, అంతే మోడర్న్‌గానూ ఉంటాయి. అదే ఇతని బ్రాండ్ వాల్యూనూ పెంచింది. పునీత్ బలానా లేబుల్ సృష్టిని బాలీవుడ్ తారలు విద్యా బాలన్, కృతి సనన్, రవీనా టాండన్, అదితిరావ్ హైదరి వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ కోరుకుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్: పునీత్ బలానా ధర: రూ. 45,000 - దీపిక కొండి చదవండి: World's loneliest whale: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
రెండు చీరల కట్టు.. ఆధునికంగా ఆ‘కట్టు’
ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకే మన అమ్మాయిలు ఓటేస్తున్నారు. సంప్రదాయ వేడుకకు, ఇండోవ్రెస్టన్ స్టైల్ పార్టీలకు చీరతోనే సింగారించుకుంటున్నారు. అందుకే, చీరకట్టులోనూ ఎన్నో వినూత్నమార్పులు వచ్చాయి. రెడీమేడ్‌గా వేసుకునే ధోతీ శారీ, ప్యాంట్, పలాజో వంటి శారీస్‌తో పాటు రెండు చీరలతోనూ వినూత్న స్టైల్ తీసుకువస్తున్నారు. పండగలకు, వివాహ వేడుకలకు ఓస్టైల్, వెస్ట్రన్ పార్టీలకూ మరో స్టైల్‌తో ఇలా చీరకట్టులో మెరిసిపోతున్నారు. పెప్లమ్ శారీ కలంకారీ పెప్లమ్ బ్లౌజ్‌తో ప్లెయిన్ శారీ కట్టుకు ఆధునికత జతగా చేరింది. ఏ విధమైన ఇతరత్రా హంగులు లేకుండా చూడగానే వావ్ అనిపించే కళ నేటి కాలపు అమ్మాయిల ఛాయిస్‌గా మారింది. శారీ విత్ దుపట్టా స్టైల్ కంచిపట్టు చీరతో పాటు కంచిపట్టు దుపట్టా కూడా ఎంచుకొని వేడుకలకు ఇలా రెడీ అవ్వచ్చు. రెండు విభిన్నరంగుల కాంబినేషన్‌తో ఈ స్టైల్ తీసుకురావచ్చు. ఎడమ, కుడి భుజాల మీదుగా తీసిన కొంగులు మూలంగా యువరాణీ కళ కనువిందుచేస్తుంది. ప్యాంట్ శారీ ఒకే కలర్, ప్రింట్ కాంబినేషన్లో ప్యాంట్‌కు జత చేసిన పవిట కొంగుతో ఈ డ్రెస్ నవతరం అమ్మాయిలను ఆకర్షిస్తుంది. ఏవిధమైన హంగులు లేకుండా ధరించడానికి సులువుగా ఉండే స్టైల్ ఇది. ఇది ధోతీ శారీకి దగ్గరగా ఉన్నా ప్యాంట్ కావడంతో స్టైల్ భిన్నంగా ఉంటుంది. కాటన్, సిల్క్ ఇతర ప్యాటర్న్లలోనూ ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. రెండు చీరల కట్టు పూర్తి కాంట్రాస్ట్ చందేరీ చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపుకు లెహంగా కుచ్చిళ్లు సెట్ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీయాలి. దీనిని బ్యాలెన్స్ చేసుకోలేం అనుకునేవారు బెల్ట్ లేదా వడ్డాణంతో నడుము దగ్గర సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్‌ను బట్టి, ఈ శారీ అలంకరణ ఆధునికంగానూ, సంప్రదాయంగానూ మార్చుకోవచ్చు. ధోతీ శారీ పండగలకు, పుట్టిన రోజు వేడుకలకు సింపుల్‌గా, గ్రేస్‌గా కనిపించాలంటే ఈ స్టైల్ సరిగ్గా నప్పుతుంది. ధరించడమూ సులువు. పవిట కొంగు ధోతీకి జత చేసి రావడంతో ఇది ధోతీ శారీ డ్రెస్‌గానూ మార్కులు కొట్టేసింది. లంగా ఓణీ స్టైల్లో చీర కట్టు రెండు భిన్నమైన రంగులు తీసుకొని ఒకవైపు ఒక చీర పచ్చ, రెండవ వైపు గులాబీ రంగు చీర కుచ్చిళ్లను సెట్ చేస్తూ లంగాఓణీ మోడల్ వచ్చేలా కట్టుకోవడం. ఈ కట్టు సంప్రదాయ వేడుకలకు సరైన ఎంపిక అవుతుంది. -
షరారా శారీ.. చూపు తిప్పుకోలేరు మరి!
లంగా ఓణీ వేసుకున్న కళ రావాలి.. చీరకట్టుకున్న హుందాతనం కళ్లకు కట్టాలి.. ఇండోవెస్ట్రన్ లుక్ అనిపించాలి.. పూర్తి ట్రెడిషనల్ అని మార్కులు కొట్టేయాలి వీన్నింటికీ ఒకే ఒక సమాధానం షరారా శారీ డ్రెస్. నవతరం అమ్మాయి అయినా సంప్రదాయ వేడుకలకు తగినట్టుగా తయారు కావాలని కోరుకుంటుంది. అందుకు తగిన డ్రెస్‌ను ఎంపిక చేసుకుంటుంది. కానీ, సంప్రదాయ చీరకట్టులో సౌకర్యం ఉండదనుకునేవారికి స్టైల్‌గా సమాధానం చెబుతోంది షరారా శారీ. వందల ఏళ్ల ఘనత షరారాను ఘరారా అని కూడా అంటారు. ఇది పూర్తిగా సంప్రదాయ లక్నో డ్రెస్‌గా కూడా చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ పుట్టినిల్లుగా ఉత్తరప్రదేశ్ నవాబ్‌ల ఇంట 19, 20 శతాబ్దాలలో డెయిలీ డ్రెస్‌గా పేరొందింది. టాప్‌గా షార్ట్ కుర్తీ, బాటమ్‌గా షరారా ప్యాంట్ ధరించి దుపట్టాను తల మీదుగా తీసుకుంటూ భుజాలనిండా కప్పుకుంటారు. నడుము నుంచి మోకాలి వరకు ఫిట్ గా ఉంటూ, మోకాలి నుంచి కింద వరకు వెడల్పుగా, కుచ్చులతోనూ ఉంటుంది. అయితే, ఈ స్టైల్ లోనే చిన్న మార్పు చేసి దుపట్టాను పవిటలా ధరించి లంగా ఓణీ స్టైల్, ఇంకొంచెం ముందుకు వెళ్లి శారీ స్టైల్లో తీసుకువస్తున్నారు. చాలా వరకు ఈ షరారా సూట్స్ సిల్క్ బ్రొకేడ్‌తో డిజైన్ చేసినవి ఉంటాయి. ఈ డ్రెస్ ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా పండగలు, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇలా స్టైలిష్ లుక్ ► మన సంప్రదాయ చీరకట్టు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకోవడానికి షరారా శారీ అమ్మాయిలకు సరైన ఎంపిక అవుతుంది. ► సాయంకాలాలు గెట్ టు గెదర్ వంటి పార్టీలకైతే ప్రిల్స్, ఫ్లోరల్, టాప్ టు బాటమ్ సేమ్ కలర్ షరారా శారీ సెట్ బాగా నప్పుతుంది. వీటికి పెద్దగా ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. ► సంప్రదాయ పండగలు ఎరుపు, పసుపు షరారా డ్రెస్ సరైన ఎంపిక. ► వివాహ వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సంప్రదాయ ఆభరణాల ఎంపిక సరైన అందాన్ని తీసుకువస్తాయి. ► శరీరాకృతి ఫిట్‌గా ఉన్నవారు ఈ తరహా స్టైల్‌ను ఎంపిక చేసుకుంటే వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ► టాప్‌గా షార్ట్ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్, ఎంబ్రాయిడీ బ్లౌజ్ లేదా స్లీవ్‌లెస్ ట్యునిక్ వేసుకుంటే మరో స్టైల్‌తో ఆకట్టుకుంటుంది షరారా సూట్. ► షరారా ప్యాంట్లా కాకుండా కుచ్చులు ఎంత ఎక్కువగా ఉన్నది ఎంచుకుంటే అంత అందంగా, అచ్చు శారీ కట్టుకున్న విధంగా కనిపిస్తారు. ప్యాంట్ స్టైల్ కావడం, దానికి బెల్ట్ జత చేయడంతో సౌకర్యంగానూ ఉంటుంది. -
ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్ (40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..