ఫ్యాషన్ ఫ్రెండ్స్.. రాజ్‌దీప్ రణావత్
చిట్‌చాట్: ఫ్యాషన్ హబ్‌గా శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు... స్టైలిష్ స్టేటస్‌లో 3వ స్థానం ఇస్తానని ఢిల్లీ డిజైనర్ రాజ్‌దీప్ రణావత్ అంటున్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తన కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్న ఈ యువ డిజైనర్... సిటీలోనే డిజైనింగ్ ఓనమాలు దిద్దడం విశేషం. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో ఆటమ్/వింటర్, ఫెస్టివ్ కలెక్షన్స్‌ను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఫ్యాషన్ టేస్ట్ విషయంలో మెట్రో నగరాల్లో ఢిల్లీకి ఫస్ట్ ప్లేస్ ఇస్తా. తర్వాతి ప్లేస్‌లు వరుసగా ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరుది. హెదరాబాద్ నిఫ్ట్‌లో డిజైనింగ్ ఓన మాలు దిద్దా. అప్పటితో పోలిస్తే ఫ్యాషన్ రంగంలో సిటీ బాగా ఇంప్రూవ్ అయింది. టాప్‌క్లాస్, టాప్ టేస్ట్ ఉన్న ఫ్యాషన్ లవర్స్ పెరుగుతున్నారిక్కడ. ఈ స్పీడ్ చూస్తూంటే మరింత ఫ్యూచర్ కనిపిస్తోంది. కొన్నేళ్లుగా క్రమంతప్పకుండా ఇక్కడే కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నా.
విదేశీ మోడల్స్ ఫ్రెండ్లీ...
నేనే కాదు ఈ మధ్య చాలా మంది డిజైనర్స్ యూకే, రష్యా, అమెరికా... తదితర దేశాలకు చెందిన మోడల్స్‌తో పనిచేస్తున్నారు. దీనికి కారణం మనవారితో పోలిస్తే వీరు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండడమే. వీరు చాలా ఫ్రెండ్లీగా, ఓపెన్ మైండ్‌తో ఉంటారు. బ్యాక్‌స్టేజ్‌లో ప్రాబ్లెమ్స్ ఉండవు.
తాజా కలెక్షన్స్‌పై...
ఈసారి ఫెస్టివ్ వింటర్ ఆటమ్ సీజన్‌కు నేను ప్రయోగాల మీదే కాన్సన్‌ట్రేట్ చేశాను. ట్రెండ్‌ను ఫాలో అవడం కంటే క్రియేట్ చేయడమే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఈ కలెక్షన్‌లో ట్యునిక్స్, కుర్తాస్, అఫ్తాన్స్ ఉన్నాయి. నేచర్ ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ కలెక్షన్ డిజైన్ చేశా. గ్రీన్ విత్ పర్పుల్, ఎల్లో విత్ బ్రౌన్, రెడ్-బ్లాక్... ఇలా కలర్ మిక్సింగ్‌తో ప్రయోగాలు చేశా. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కూడా ఈ సారి
కలెక్షన్‌లో హైలైట్.
- ఎస్.సత్యబాబు