క్యూట్ & లవ్లీ
పబ్స్ అంటే రాకింగ్ మ్యూజిక్‌కు ‘షేక్’ అవుతూ ఏదో ప్రపంచంలో తేలిపోవడమే కాదు... సరికొత్త ట్రెండ్స్‌కు... ఫ్యాషన్ పరేడ్స్‌కు ‘హాట్’ స్పాట్‌లు కూడా! అమ్మాయిలు... అబ్బాయిలు సాయంత్రాలు అలా అలా వెళ్లి... జీరో క్యాండిల్ వెలుగుల్లో... ‘డిమ్’గా అప్పుడప్పుడూ ఓ సిప్ చేస్తూ... చిందుల్లో గ‘మ్మత్తు’లు ఆస్వాదించడమే అసలు అజెండా అయినా... లే‘టేస్ట్’ డ్రెస్సింగ్ సెన్స్‌నూ చెప్పకనే చెప్పే వేదికలు కూడా! కాదంటారా..! ఇదిగో ఈ భామలను చూడండి..! పబ్ ‘క్లబ్’లోకి వెళ్లేముందు ఇలా ‘లెన్స్’లో క్యూట్‌గా ఫిక్సయిపోయారు. ఒకరిని మించి ఒకరు... ట్రెండీ డ్రెస్సింగ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో మురిపిస్తున్నారు.సోమాజిగూడ హోటల్ పార్క్‌లోని కిస్మత్ పబ్‌లో లవ్లీ క్లిక్స్ ఇవి.