వైబోగం | Ocean newest fashion bow tie | Sakshi
Sakshi News home page

వైబోగం

Published Mon, Feb 2 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

Ocean newest fashion bow tie

చక్కగా సూటూ బూటూ వేసి డిగ్నిఫైడ్ లుక్‌తో పార్టీకి వెళ్లారు. అక్కడ మీ లుక్‌కు తగ్గట్టే స్టైల్‌గా బిహేవ్ చేస్తూ సూప్ సేవిద్దామనుకున్నారు. సూప్‌ని తీయడానికి వంగితే మీ కన్నా ముందు మీ టై సూప్‌ని టేస్ట్ చేసేసింది. అప్పుడెలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్  కన్నా.. ఆల్టర్నేటివ్ ఎంచుకోవడం మిన్న అని నమ్మే స్టైల్ హంటర్స్ నెక్ టై స్థానంలో ‘బో’టైకు చోటు కల్పిస్తున్నారు. దీంతో పొడవాటి ‘టై’ కాస్తా ఇప్పుడు చిట్టి పొట్టి ‘బో’ విజృంభణతో విలవిల్లాడిపోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. సీన్‌కానరీ కాలం నాటి బో టై సరికొత్త ఫ్యాషన్ ఓషన్ సృష్టిస్తోంది.
 ..:: ఎస్.సత్యబాబు
 
మెడ దగ్గర చొక్కా కాలర్‌ను అంటుకుని.. పడుకున్న 8 అంకెలా ఉండే ‘బో-టై’ సూటూ, బూటుకు సరిజోడు. సులువుగా ధరించే వీలుండటం, లెంగ్తీ టై తరహాలో అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది కలిగించకపోవడం, పిల్లలు పట్టుకుని లాగడానికి గాని, ఎక్కడైనా చిక్కుకుపోవడానికి గాని అవకాశం లేకుండా.. సింపుల్, క్యూట్‌గా ఉండడం.. వంటి ప్రత్యేకతలతో నెక్ టై ప్రాభవానికి తాజాగా గండికొట్టేసింది.
    
శతాబ్దాల క్రితం నాటి ఫ్యాషన్

బో టై.. అనే పురుషుల యాక్సెసరీకి మూలాలు 17వ శతాబ్దం నాటివి. బటన్స్ లేని చొక్కాల కాలంలో కింగ్ లూయిస్‌కి మద్దతుగా ఫ్రాన్స్‌కు ప్రయాణం చేసిన క్రోషియన్ సోల్జర్స్.. చల్లగాలి, వాన చినుకుల నుంచి రక్షించుకోవడానికి తమ చొక్కాని కలిపేందుకు ఒక క్లాత్ పీస్‌ను బో టై తరహాలో మెడ చుట్టూ కట్టేవారట. దీన్ని చూసి ఎంతో ముచ్చటపడిన కింగ్ లూయిస్ ప్యాలెస్ ఆవరణలో పనిచేసే తన ఉన్నత స్థాయి సిబ్బంది మొత్తం బో టై ధరించాలని ఆదేశాలు ఇచ్చాడు. కాలక్రమంలో వీటి ఫ్యాబ్రిక్‌లు వైట్ కాటన్ నుంచి సిల్క్ దాకా ఎదిగినట్టే హోదాకి ఐశ్వర్యానికి చిహ్నంగా విలసిల్లాయి.
 
సినిమాలే ‘సీన్’ పెంచాయి..


జేమ్స్‌బాండ్ సినిమాల ద్వారా సీన్‌కానరీ, హంఫ్రే బొగార్ట్ వంటి హాలీవుడ్ యాక్టర్ల టైమ్‌లో ఓ వెలుగు వెలిగింది బో. హంఫ్రె బొగార్ట్, ఫ్రెడ్ ఎస్టైర్, ఫ్రాంక్ సినట్రా, చార్లీ చాప్లిన్, పీ-వీ హెర్మన్ తదితర హాలీవుడ్ నటులుతో పాటుగా ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, విన్‌స్టన్ చర్చిల్ వంటి ప్రముఖుల కారణంగా మరింతగా ఇవి ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత... ఫ్యాషన్ వెల్లువలో ఈ నెక్‌వేర్ దశాబ్దాలుగా తెరమరుగైంది. అయితే మన దేశంలో సరిగ్గా ఇటీవలే వీటి కదలికలు తిరిగి మొదలయ్యాయి. ముంబై, ఢిల్లీ, న్యూయార్క్‌లలో జరిగే మెన్స్ ఫ్యాషన్ వీక్‌లకు సిటీ నుంచి అటెండవుతున్నవారికి బో టై కలె క్షన్స్ ఇన్‌స్పిరేషన్ అందించాయి. స్టైలిష్ యాక్టర్లు ఫరాఖాన్ అక్తర్, రణ్‌వీర్‌సింగ్, జానీడెప్, రాహుల్‌ఖన్నా వంటి వారంతా బో టై లవర్స్‌గా పేరొందారు.    
 
‘బో’లెడన్ని వెరైటీలు...

సంప్రదాయ నెక్ టై కష్టాలకు విరుగుడుగా మారడంతో సిటీలో సూటూ బూటూ వాలాలంతా ‘బో-టైకే ఓటేస్తున్నారు. దీంతో డిజైనర్లు తమ సృజనకు పదనుపెట్టి వెరైటీలను సృష్టిస్తున్నారు. సూట్స్ వినియోగించేవారు స్టిచ్చింగ్ టైమ్‌లోనే ‘బో’ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు.
 
పాతదే కొత్తగా...


ఇప్పుడు బో టై పూర్తిగా రీ-డిజైన్డ్ అయింది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాలకు, ఫార్మల్ వేర్‌కు జతగా మాత్రమే పరిమితమైనా.. ఇప్పుడివి క్యాజువల్, సెమి ఫార్మల్ వేర్‌కు సైతం వినియోగిస్తున్నారు. షర్ట్స్, జీన్స్‌తో కలిపి ధరించడం ప్రింట్స్, కలర్స్‌తో ప్రయోగాలు సాగుతున్నాయి. షార్ట్ సూట్స్‌కూ జత చేస్తున్నారు. బ్లేజర్‌కు బదులుగా లెదర్ జాకెట్స్ దీనికి కలిపి వాడుతున్నారు. జస్టిన్ టింబర్‌లేక్, ఫారెల్ విలియమ్స్ వంటి పాప్ సింగర్లు తమ మ్యూజిక్ వీడియోల్లో ఈ బో టై యాక్సెసరీని వైవిధ్యంగా వినియోగిస్తూ యూత్‌కి సరికొత్త టిప్స్ అందిస్తున్నారు. ‘ధరించే విధానంలో స్వల్ప మార్పులతోనే దీన్ని క్యాజువల్‌గా, ఫార్మల్‌గానూ చూపొచ్చు. బోని దేనికి జత చేస్తున్నారనేది ప్రధానమైన విషయం’ అంటున్నారు సిటీ డిజైనర్ సాహిల్ గులాటి. జ్యువెలరీ పీస్‌లా ఉండే ఈ క్లాత్ యాక్సెసరీని ఇప్పుడు కాస్త స్టైల్ సెన్స్ ఉన్న ఎవరైనా ఏ విధానంలోనైనా ధరించవచ్చు. అయితే తొలి దశలో ధరించడంలో ఇబ్బంది ఉండొచ్చు. షూ లేస్ కట్టుకుంటున్న తరహాలోనే ఉండే దీనిని వినియోగించే విధానం తెలిపే ‘హౌ టు టై ఎ బో టై’ వంటి వీడియోలు సైతం ప్రస్తుతం యూ ట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ఇక మార్కెట్లో బ్రాండెడ్ బో-టైలు రూ.500 నుంచి రూ.2,000 ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇ-బే వంటి షాపింగ్ వెబ్‌సైట్స్‌లో వీటి విక్రయాలు జోరందుకున్నాయి. వీటికే ప్రత్యేకించిన బోటైస్ డాట్‌కామ్ వంటి వెబ్‌సైట్‌లూ ఉన్నాయి.
 
డిన్నర్ జాకెట్‌కు సరిజోడు
 
ఇప్పుడు ‘బో టై’ లేటెస్ట్ ఫ్యాషన్ కావడంతో నా డిజైనర్‌తో ముందుగానే డిస్కస్ చేసి నా డ్రెస్సింగ్‌లో దాన్ని కూడా చేరుస్తున్నాను. దీన్ని ఫార్మల్ వేర్‌తో పాటు, ముఖ్యంగా డిన్నర్ జాకెట్‌కు తోడుగా ధరిస్తుంటాను. ప్రస్తుతం నా దగ్గర 6 రకాల డిఫరెంట్ కలర్స్, ఫ్యాబ్రిక్స్‌తో రూపొందినవి  ఉన్నాయి. ‘బో-టై’ని స్ట్రిక్ట్‌గా ఈవెనింగ్ టైమ్‌లోనే యూజ్ చేయడం అనేది వెస్ట్‌లో అలవాటు. అయితే సిటీలో ఇప్పుడు అకేషన్స్‌తో సంబంధం లేకుండా క్రేజీగా యూజ్ చేస్తున్నారు.
 - అశిష్‌గుప్తా, వ్యాపారి
 
 సిటీ డిజైనర్ సాహిల్ గులాటి అందించే మరికొన్ని సూచనలివి...
 
‘బో’ వినియోగించే వారు కాన్ఫిడెన్స్‌తో క్యారీ చేయకపోతే దీని బ్యూటీ రివర్స్ అవుతుంది.  

షర్ట్+బో, వెయిస్ట్ కోట్+షర్ట్+బో కాంబినేషన్ కూడా బాగుంటుంది.

రెడ్, టెక్చర్డ్ బ్లాక్, బ్లూ కలర్స్, ఫ్లోరల్ ప్రింట్స్.. ‘బో’ ఫ్యాషన్‌ను మెరిపిస్తాయి.

ఈ ‘బో’ధరించేటప్పుడు షర్ట్ కాలర్స్ చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి.
 
శాటిన్, లైక్రా, సిల్క్.. ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన ‘బో’టైలు.. ఆకర్షణీయంగా అనిపిస్తాయి.

కాక్‌టైల్ పార్టీస్, బిజినెస్ మీటింగ్స్.. వంటి సందర్భాలకు ఇవి అతికినట్టు సరిపోతాయి.

బ్లాక్-వైట్ సూట్‌తో బ్లాక్ బో టై కలిపితే క్లాసీ లుక్ ఇస్తుంది. వైట్ జాకెట్, బ్లాక్ ల్యాపెల్స్, బ్లాక్ ట్రౌజర్స్, బ్లాక్ బో టై. కరెక్ట్ సేఫ్ కాంబినేషన్.

చారల చొక్కాలు, బో టై అనేవి మంచి కాంబినేషన్. రెడ్ లేదా వైట్ చెక్స్ ఉన్న షర్ట్ ధరిస్తే రెడ్ లేదా బ్లాక్ బో టై ధరించాలి. మల్టీ కలర్డ్ షర్ట్ ధరిస్తే.. ప్రింటెడ్ బో టై ధరించకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement