స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు | special story on fashion designers in tollywood industry | Sakshi
Sakshi News home page

స్టార్స్ తళుకులు..ఫ్యాషన్ మెరుపులు

Published Thu, Dec 28 2017 11:09 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

special story on fashion designers in tollywood industry - Sakshi

ఫ్యామిలీ వేడుకల నుంచి ఫ్యాషన్‌ ఈవెంట్ల దాకా.. అవార్డ్‌ ఫంక్షన్ల నుంచి ఆడియో లాంచ్‌ల దాకా.. అన్నింటా తారల తళుకుబెళుకులే. నగరంలో జరిగే పబ్లిక్‌ ఈవెంట్స్‌లో సినిమా తారలు కనపడడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అదే సమయంలో సదరు ఫంక్షన్లలో వీరి స్పెషల్‌ లుక్‌ మాత్రం  తరచుగా టాక్‌ ఆఫ్‌ ది సిటీగా మారుతోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఓ అవార్డ్‌ల వేడుకలో తారల స్పెషల్‌ లుక్‌ మరోసారి సిటీ ఫ్యాషన్‌కు హాట్‌ టాపిక్‌ అయింది. నిన్నా మొన్నటి దాకా అవుటాఫ్‌ సినిమా లుక్‌లో సమంత టాప్‌ ఇన్‌ టౌన్‌ కాగా.. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు యువ తారలు పోటీపడుతున్నారు.

ఒకప్పుడు సినిమా తారలు బయట కనపడడం చాలా అరుదు. అరకొరగా కనపడినా.. హెవీ మేకప్, విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌ వేసిన భారాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టుగా చాలా సింపుల్‌గా కనిపించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది.. సినిమాల్లో కనపడ్డానికన్నా బయట మరింత స్పెషల్‌గా ఉండాలన్నట్టు అందాల తారలు పోటీపడుతున్నారు. బయట కెమెరా కళ్లను తిప్పుకోనివ్వకుండా అద్భుతమైన డ్రెస్సింగ్‌ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు.  

బాలీవుడ్‌ టు టాలీవుడ్‌
గతంతో పోలిస్తే టాలీవుడ్‌లో యువ తారలు ఇప్పుడు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. పబ్లిక్‌ లుక్‌  విషయంలో నవయువ టాలీవుడ్‌కి బాలీవుడ్‌ ఆదర్శంగా మారింది. ముంబయిలో జరిగే పబ్లిక్‌  ఈవెంట్స్‌లో తారలు బాగా పాల్గొంటారు. అంతేకాదు.. ఆ ఈవెంట్స్‌ కోసం స్పెషల్‌ డిజైన్స్‌ను సెలక్ట్‌ చేసుకుంటారు. సదరు ఈవెంట్స్‌లో వారు ధరించిన దుస్తులు, యాక్సెసరీస్‌ వంటివి పత్రికలు, మేగ్‌జైన్స్‌లో ఫ్యాషన్‌ పండితుల సమీక్షకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ తారలు మరింత కేర్‌ఫుల్‌గా తమని తాము తీర్చిదిద్దుకోక తప్పడం లేదు. సాధారణంగా సినిమాల్లో పాత్ర, సన్నివేశం డిమాండ్‌ చేసిన మేరకు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా తమదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఇదీ అని చెప్పుకునేందుకు గాని నచ్చిన పర్సనల్‌ స్టైల్‌ని చూపించేందుకు గాని పెద్దగా ఆస్కారం ఉండదు. దాంతో ఫ్యాషన్‌ విషయంలో తమదైన అభిరుచిని వ్యక్తపరచేందుకు తారలు పబ్లిక్‌ ఈవెంట్స్‌ను ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు.  

పోటాపోటీ.. ఎవరికి వారేసాటి..
టాలీవుడ్‌ హీరోయిన్లలో సమంత పబ్లిక్‌ స్టైల్స్‌లో చాలా కాలం టాప్‌ ప్లేస్‌లో కొనసాగారు. విభిన్న రకాల దుస్తులు, యాక్సెసరీస్‌తో నార్త్‌ ఇండియన్‌ స్టార్స్‌కు దీటుగా వేడుకల్లో కనిపించేవారామె. ‘ఈవెంట్స్‌కి గెస్ట్‌గా వెళ్లినప్పుడు శామ్స్‌ (సమంత) డిఫరెంట్‌ లుక్‌తో కనపడాలనుకుంటుంది. ప్రత్యేక శ్రధ్ధతో లుక్‌ని తీర్చిదిద్దుకుంటుంది. అందుకే సినిమాలను మించి ఈవెంట్స్‌లో ఆమె స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంటుంది’ అన్నారు సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్‌ నీరజ కోన. అయితే పెళ్లికి కాస్త ముందు నుంచే ఆమె బయట ఈవెంట్స్‌లో పాల్గొనడం తగ్గింది. ఈ క్రమంలో ఇప్పుడు పలువురు యువతారలు సమంతనే స్ఫూర్తిగా తీసుకుంటూ ఈవెంట్స్‌కి గ్లామర్‌ అద్దుతున్నారు. వీరి అవుట్‌ లుక్‌ పుణ్యమాని సిటీ డిజైనర్ల సత్తాకు చెప్పుకోదగ్గ పరీక్ష ఎదురవుతోంది. మరో విశేషం ఏమిటంటే.. సిటీలో సినిమా కాస్ట్యూమ్‌ డిజైనర్స్, సినిమా రంగానికి అవతల ఫ్యాషన్‌ రంగంలో పేరొందిన డిజైనర్స్‌ వేర్వేరు కావడంతో.. ఈ ఈవెంట్స్‌ పుణ్యమాని సిటీ డిజైనర్స్‌కు సినిమాస్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం బాగా పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement