‘మెహబూబా’తో ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది నేహా శెట్టి. ఆమె కూడా లవ్‌లో పడింది... ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో!
దీప్తి..
హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గాంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్‌ను బట్టే ఉంటాయి ధరలు.. వేల నుంచి లక్షల్లో. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
చీర డిజైనర్: దీప్తి
ధర: రూ. 38,800
కిషన్‌దాస్ జ్యూయెలర్స్
ఎత్నిక్ అండ్ యాంటిక్ జ్యూయెలరీని రూపొందించడం కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ప్రత్యేకత. సుమారు 145 ఏళ్ల కిందట హరికిషన్‌దాస్, అతని కుమారుడు కిషన్‌దాస్.. నిజాం రాజకుటుంబీకులకు ఆస్థాన ఆభరణాల డిజైనర్స్‌గా పనిచేసేవారట. ఆ వారసత్వాన్నే వారి తర్వాతి తరం వారు అందిపుచ్చుకుని ‘కిషన్‌దాస్ జ్యూయెలర్స్’ పేరుతో బంగారు నగల వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసులు నితిన్, ప్రశాంత్‌లు దీనిని కొనసాగిస్తున్నారు. బంగారం, వెండి, యాంటిక్ రత్నాలు, ముత్యాలు, అరుదైన రాళ్లతో రూపొందించే ఈ ఆభరణాలకు క్రేజే కాదు ధర కూడా ఎక్కువే. ఈ నగలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి.
జ్యూయెలరీ బ్రాండ్: కిషన్‌దాస్ జ్యూయెలర్స్
ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది.
‘చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా’ – నేహా శెట్టి.
-దీపికా కొండి
Comments
Please login to add a commentAdd a comment