Saree Collections
-
మనసుదోచే సొగశారీ..
స్కిన్‌టైట్ జీన్సులు, ట్యునీక్సూ, కుర్తీస్, నీలెంగ్త్ స్కర్టులు, పొట్టి నిక్కర్లూ.. లాంటి మోడ్రన్ ట్యూన్స్‌తో ఓ వైపు మమేకమైన నగర మహిళలు మరోవైపు ఇంకా పాత రాగంలో ‘శారీ’గమ పాడేస్తోందంటే.. చీర కట్టు మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆధునిక కట్టుబాట్లు ఎలా ఉన్నా అప్పుడప్పుడూ సొగసిరి చీరకట్టి అన్న రీతిలో నగర మహిళలు తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 21న శారీ దినోత్సవం నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరో‘చీర కట్టుకుంటే ఆ డిగ్నిటియే వేరు. నెలకోసారన్నా.. వార్డ్‌రోబ్‌లో నుంచి శారీ తీయాల్సిందే’ అంటోంది ఓ పీఆర్ కంపెనీలో పనిచేసే వాణి. సిటీలో విభిన్న వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలు, యువతులు వృత్తి, బాధ్యతల కారణంగా రోజువారీ వినియోగం అంత సులభం కాకపోవడంతో ‘చీరకట్టు’ వీరికి మరింత అపురూపంగా మారిపోయింది. దీంతో సెలవు దినాల్లో, కుటుంబ వేడుకల్లో ఇలా వీలైనన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఎంచుకునే వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భం వస్తే చీరకట్టాలి అనే రోజుల నుంచి చీరకట్టు కోసం సందర్భాన్ని సృష్టించుకునేంత ఆసక్తి నగరమహిళల్లో పెరిగిపోతోంది.కట్టు తప్పుతోంది.. రోజుల తరబడి టాప్లూ, ట్రౌజర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒక్కసారిగా చీర కట్టుకోవాలంటే ఇబ్బందే కదా. అందుకే చీరకట్టడంలో నేర్పరితనం ఉన్నవారి సేవల మీద నగర మహిళలు ఆధారపడుతున్నారు. ‘ఫంక్షన్స్‌కి శారీ కాకుండా డ్రెస్సులతో వెళితే గిల్టీ ఫీలింగ్ వస్తోంది. అలాగని చీరకట్టాలని ప్రయత్నిస్తే సరిగా కుదరడం లేదు. అందుకే నేను అవసరమైనప్పుడల్లా చీరకట్టే వారిని పిలిపించుకుంటాను’ అని జూబ్లీహిల్స్‌లో నివసించే ఉమ చెబుతున్నారు. ఈ ‘కట్టు’ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి నిపుణులకు రూ.500 వరకూ చెల్లించడానికి పెద్దగా ఇబ్బంది పడడంలేదంటున్నారు ఆధునిక మహిళలు. ‘ఇటీవల చీర కట్టుకోవాలని ఆసక్తి బాగా పెరిగింది. అయితే మోడ్రన్ డ్రెస్సుల్లా నిమిషాల మీద వేసుకుని వెళ్లిపోడానికి కుదిరేది కాదు కదా. అందుకే అమ్మాయిలు మాత్రమే కాదు పెద్ద వయసు మహిళలు కూడా చీర కట్టుకోవడానికి మా సహకారం కోరుతున్నారు. అవసరమైన వారికి మేం ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నాం’ అని చెబుతున్నారు శారీ డ్రేపర్‌గా రాణిస్తున్న సునీల.విభిన్న శైలిలో...చీరకట్టు విభిన్నరకాల శైలులు నగరంలో రాజ్యం ఏలుతున్నాయి. ‘జయప్రద స్టైల్, నూపుర్ స్టైల్, తానిదార్ స్టైల్.. ఇలా దాదాపు 35 రకాల శారీడ్రేపింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వారిలో అత్యధికులు నూపుర్స్టైల్ అడుగుతారు’ అని చెప్పారు శారీడ్రేపింగ్కు పేరొందిన సికింద్రాబాద్ వాసి జానీనులియా. నగరం విభిన్న సంస్కృతుల నిలయం కావడం, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి నివసిస్తుండడం, ఈ కుటుంబాల మధ్య రాకపోకలు పెరగడంతో.. ఇతర ప్రాంతాల కట్టు బొట్టూ నేర్చుకోవాల్సి రావడం తప్పడం లేదు. ఆ క్రమంలోనే మార్వాడి, గుజరాతీ, బెంగాలీ.. తదితర చీరకట్టు శైలిని స్థానిక మహిళలు అనుసరిస్తుండడం సాధారణంగా మారింది. విభిన్న శైలులను అనుసరించాలనుకునేవారికి స్టైల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకూ రుసుముతో సేవలు అందించేవారు సైతం పుట్టుకొచ్చేశారు. బ్యూటీ విత్ డిగ్నిటీ..‘రెగ్యులర్ డ్రెస్సులంటే మొహం మొత్తేస్తోంది. మా కంపెనీలో ఏ చిన్న వేడుకైనా అందరూ చీరలు కట్టుకునే వస్తాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ డే వంటివి క్రియేట్ చేసుకుని మరీ చీరలు కడుతున్నాం’ అంటోంది సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ. మోడ్రన్ డ్రెస్సుల దగ్గర ఆచితూచి ఖర్చుపెట్టే అమ్మాయిలు చీర విషయానికి వచ్చేసరికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని నగరానికి చెందిన డిజైనర్ అవని చెబుతున్నారు. హఫ్ శారికే డిమాండ్..ఎన్ని రకాలు వచ్చినా నగరంలో అత్యధికుల్ని ఆకర్షిస్తున్నది మాత్రం హాఫ్‘శారీ’.. అంటే లంగా వోణి కాదు. లంగా వోణి లాంటి చీర అని అర్థం. అచ్చం హాఫ్శారీలా కనబడే శారీలు నగర మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వయసు తక్కువలా అనిపించేలా ఉండే వీటి పట్ల నగర మహిళలు ఆదరణ చూపుతున్నారని కలర్జ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు శ్రావణీరెడ్డి చెప్పారు. అలాగే ధోతీ స్టైల్, గోచీ స్టైల్, లెహంగా స్టైల్.. ఇలా అనేక రకాల స్టైల్స్ నగరంలో సందడి చేస్తున్నాయి. ప్రొఫెషనల్ స్టెప్స్.. స్టైల్ టిప్స్విభిన్న రంగాల్లో ఉంటున్నవారు అందుకు తగ్గట్టుగా ఉండేందుకు చీరకట్టు కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైనర్లు సూచిస్తున్నారు. చీర మీద కొంగును సింగిల్స్టెప్ వేసే స్టైల్‌ని టీచర్ వృత్తిలో ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇదే స్టైల్లో పల్లు కొసని కుడి చేత్తో పట్టుకోవడం వల్ల డిజైన్ కొట్టొచి్చనట్టు కనబడుతుంది. హుందాగా కనిపించాలనుకున్నవారు డబుల్స్టెప్ను అనుసరించవచ్చు. ఇక అత్యధికులకు నప్పేది త్రీస్టెప్స్. పనులకు ఎలాంటి అడ్డంకీ రాకూడదనుకునే ఉద్యోగినులు, గృహిణులు.. అందరికీ ఇది ఓకె. కాస్త స్పైసీగా కనపడాలనుకుంటే మాత్రం ఫోర్స్టెప్స్, ఫైవ్స్టెప్స్.. ఇలా ఎంచుకోవాలి. పట్టు చీరలకు తప్పనిసరిగా ఆరు స్టెప్స్ ఉండాల్సిందే. అప్పుడే దానికి ఆకర్షణ. స్కూల్ డేస్ నుంచే కడుతున్నా.. శారీ కట్టడం స్కూల్ డేస్ నుంచే అలవాటు. అందుకే చీరకట్టు నాకు చాలా కంఫర్ట్బుల్ అనిపిస్తుంది. ఒక యాంకర్‌గా రకరకాల ప్రోగ్రామ్స్ కోసం రకరకాలుగా రెడీ అవుతుంటాను. అన్ని రకాల స్టైల్స్ ధరించడం అవసరం కూడా. అయితే నా మనసు ఎప్పటికీ చీరమీదే ఉంటుంది. రకరకాల బ్లౌజ్‌లు, జ్యువెలరీస్ జత చేసి వెరైటీ స్టైల్స్‌లో డ్రేప్ చేసుకోవచ్చు.. – మంజూష, యాంకర్ -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
జూబ్లీహిల్స్ : వస్త్ర దుకాణంలో మోడళ్ల సందడి (ఫొటోలు)
-
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్‌కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్‌లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్‌లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్‌కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్‌మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
Fashion: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
నజ్రియా నాజిమ్.. తెలుగు తెర ఆమె కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసింది. ఆ ఎదురు చూపులకు చక్కటి ఫలితమే ‘అంటే సుందరానికి’. ఆ సినిమాలో ‘లీల’గా నజ్రియా నటనను మెచ్చుకుని టాలీవుడ్లోకి ఆమెను ఘనంగా స్వాగతించారు. మరి తన స్టయిల్ సిగ్నేచర్‌గా ఏ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ఆమె గ్రాండ్‌గా ధరిస్తుందో చూద్దాం... బ్రాండ్ వాల్యూ తొరానీ ఈ బ్రాండ్ స్థాపకుడు కరణ్ తొరానీ. స్ఫూర్తి అతని నానమ్మ. స్వస్థలం భోపాల్‌లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల ఆసక్తిని రేకెత్తించింది. నానమ్మ ఎప్పుడూ కట్టుకునే చందేరీ కాటన్ చీరలు.. ఆ నేత.. అతన్ని డ్రెస్ డిజైన్ వైపు మళ్లించాయి. దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత తన బ్రాండ్ ‘తొరానీ’కి రూపమిచ్చాడు. నజ్రియా చీర: బ్రాండ్: తొరానీ ధర: రూ. 64,000 ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. నజ్రియా జ్యూయెలరీ: ముత్యాల కమ్మలు బ్రాండ్: అమ్రపాలి జ్యూయెలర్స్ ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. కథ, అందులో నా పాత్ర నచ్చితే చాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తా. అలా మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీ. – నజ్రియా నాజిమ్ -దీపిక కొండి చదవండి: Fashion Jewellery: చెవులకు పెయింటింగ్! ధర రూ.300 నుంచి.. -
ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు: డీజే టిల్లు హీరోయిన్
‘మెహబూబా’తో ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది నేహా శెట్టి. ఆమె కూడా లవ్‌లో పడింది... ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో! దీప్తి.. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్‌ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గాంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్‌గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్‌లో ఓ ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించింది. డిజైన్‌ను బట్టే ఉంటాయి ధరలు.. వేల నుంచి లక్షల్లో. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర డిజైనర్: దీప్తి ధర: రూ. 38,800 కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ఎత్నిక్ అండ్ యాంటిక్ జ్యూయెలరీని రూపొందించడం కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ప్రత్యేకత. సుమారు 145 ఏళ్ల కిందట హరికిషన్‌దాస్, అతని కుమారుడు కిషన్‌దాస్.. నిజాం రాజకుటుంబీకులకు ఆస్థాన ఆభరణాల డిజైనర్స్గా పనిచేసేవారట. ఆ వారసత్వాన్నే వారి తర్వాతి తరం వారు అందిపుచ్చుకుని ‘కిషన్‌దాస్ జ్యూయెలర్స్’ పేరుతో బంగారు నగల వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసులు నితిన్, ప్రశాంత్‌లు దీనిని కొనసాగిస్తున్నారు. బంగారం, వెండి, యాంటిక్ రత్నాలు, ముత్యాలు, అరుదైన రాళ్లతో రూపొందించే ఈ ఆభరణాలకు క్రేజే కాదు ధర కూడా ఎక్కువే. ఈ నగలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. జ్యూయెలరీ బ్రాండ్: కిషన్‌దాస్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. ‘చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్‌లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్‌లో ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా’ – నేహా శెట్టి. -దీపికా కొండి -
అమలాపాల్ చీర ఖరీదు అన్ని వేలంటే నమ్ముతారా?
అమలాపాల్.. గ్లామర్ పాత్రలు చేస్తూనే ఏ చిన్న చాన్స్ దొరికినా నటనకు ప్రాధాన్యం ఉన్న భూమికలనూ పోషిస్తూ ఓ స్టయిల్‌ను సెట్ చేసుకున్న నటి. సినిమాల్లోనే కాదు.. తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌ను చూపిస్తోంది.. డిజైన్.. ఫాస్ట్ఫుడ్కే కాదు ఫాస్ట్ డ్రెసింగ్కూ అంతే క్రేజ్ ఉందిప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రెడీ టు వేర్ చీర డిజైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనిదే ఈ చీర. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్‌కు ముందుగానే కుచ్చులను కుట్టేస్తారు. దీనితో పాటు స్టిచ్డ్ బ్లౌజ్, ఒక కాలర్, ఒక బెల్టు కూడా ఉంటుంది. నికిత విశాఖ.. మార్వాడీ కుటుంబానికి చెందిన నికిత, విశాఖ అనే ఇద్దరు తోడికోడళ్ల గొప్ప పనితనమే ఈ ఫ్యాషన్ హౌజ్. అత్తింటి వారికి మహారాష్ట్రలో ఓ పెద్ద వస్త్ర పరిశ్రమ ఉంది. దాదాపు దశాబ్దంపాటు అదే వృత్తిలో ఉన్న వారి భర్తలను చూసి.. వస్త్ర ప్రపంచంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇంటరెస్ట్కు కాస్త సృజనాత్మకతను జోడించి తమ దుస్తులను తామే డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తింపు, మెప్పు వస్తూండడంతో ‘నికిత విశాఖ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ డిజైన్స్‌కు ఆదరణ పెరిగి ఫేమస్ డిజైనర్స్గా ఎదిగారు. వీరి డిజైన్స్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వీరు డిజైన్ చేసిన చీరలకు. ట్రెండీ లుక్‌తో ఉండే సంప్రదాయ చీరలను డిజైన్ చేయడంలో వీరికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. మెయిన్బ్రాంచ్ ముంబైలో ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. మొదట్లో నా చర్మరంగు గురించి చేసే విమర్శలకు బాధపడేదాన్ని, కానీ, సరిగ్గా లేకపోవడం కూడా సరైనదే అని అర్థమవుతోందిప్పుడు. – అమలాపాల్ చీర డిజైనర్ : నికిత విశాఖ ధర: రూ. 46,000 -
శారీ...సింగారీ
నల్లంచు తెల్ల చీరైనా.. చెంగావి రంగు చీరైనా.. అతివలు చుట్టుకుంటేనే వాటికి అందం. తరతరాలుగా విలువ తరగనివి చీరలే. మగువల మేను చుట్టుకుని మెరిసిపోయే కోకల రూపకల్పన మహాద్భుతంగా ఉంటుంది. రోజురోజుకూ ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చీరల్లో సరికొత్త చేర్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్. సిటీలోని షాపింగ్ మాల్స్ విభిన్నమైన శారీ కలెక్షన్స్‌తో నిండిపోయాయి. అలనాటి పట్టు చీరలకు ఆధునిక హంగులు జోడించి మగువలకు కలర్ఫుల్గా అందిస్తున్నాయి. ఒకటేమిటి... కాంచీపురం, కుబేర, ఆవిష్కార, అరుంధతి తదితర హెవీ, లైట్ వెయిట్ పట్టు చీరలు వినూత్నమైన డిజైన్లు అద్దుకుని ముచ్చటగొలుపుతున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే పెళ్లి వేడుకలో తమ ఆహార్యం స్పెషల్ అట్రాక్షన్‌గానే కాదు, ఓ మెమరబుల్‌గా మిగిలిపోవాలని పెళ్లికూతుళ్లు కోరుకుంటున్నారు. వారితోపాటు ఆ వేడుకకు హాజరయ్యే అతివలు కూడా అదిరిపోయే అప్పీరెన్స్ ఉండాలనుకుంటున్నారు. అందుకే ధరకు వెనకాడకుండా నచ్చిన చీరలు కొనుగోలు చేస్తున్నారు. పాతతరం చీరలకు ఆధునికత జోడించిన వెరైటీలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. లైట్ వెయిట్ పసిడి పట్టుకు ఇప్పుడు క్రేజ్ బాగా ఉంది. 90 శాతం వెండి, పది శాతం బంగారం మిక్స్ చేసి ఈ శారీలను డిఫరెంట్ డిజైన్లలో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వీటిని ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అధిక బరువు ఉన్నవి మధ్యతరగతివారు అడుగుతున్నారు. కాలేజీ అమ్మాయిల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరినీ దృష్టిలో ఉంచుకుని వీటిని సిద్ధం చేస్తున్నారు... అని షాపింగ్ మాల్ నిర్వాహకులు చెబుతున్నారు. మెరిసి... మురిపించి సికింద్రాబాద్ సీఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో శుక్రవారం జరిగిన ‘వివాహ్ కలెక్షన్స్ 2015’ లాంచింగ్‌లో... ముద్దుగుమ్మలు పట్టు చీరలు కట్టి... ఒంటి నిండా ఆభరణాలు ధరించి సంప్రదాయ సిరులు ఒలికించారు. మిస్ ఇండియా ఎర్త్ అలంకృత సహాయ్, నటి రామ్శ్రీ, ఆయేషా రావత్, మోడల్స్ కలర్‌ఫుల్ శారీల్లో ‘పట్టు’కే వన్నె తెచ్చారు. -వీఎస్