Amala Paul In Pink Saree By Nikita Vishakha, Cost Will Surprise You - Sakshi
Sakshi News home page

Amala Paul: అమలాపాల్‌ కట్టిన చీర ధరెంతో తెలుసా?

Published Sun, Jan 9 2022 11:08 AM | Last Updated on Sun, Jan 9 2022 12:47 PM

Amala Paul In Pink Saree By Nikita Vishakha, Cost Will Surprise You - Sakshi

అమలాపాల్‌.. గ్లామర్‌ పాత్రలు చేస్తూనే ఏ చిన్న చాన్స్‌ దొరికినా నటనకు ప్రాధాన్యం ఉన్న భూమికలనూ పోషిస్తూ ఓ స్టయిల్‌ను సెట్‌ చేసుకున్న నటి. సినిమాల్లోనే కాదు.. తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌ను చూపిస్తోంది.. 

డిజైన్‌..
ఫాస్ట్‌ఫుడ్‌కే కాదు ఫాస్ట్‌ డ్రెసింగ్‌కూ అంతే క్రేజ్‌ ఉందిప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రెడీ టు వేర్‌ చీర డిజైన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనిదే ఈ చీర. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్‌కు ముందుగానే కుచ్చులను కుట్టేస్తారు. దీనితో పాటు స్టిచ్డ్‌ బ్లౌజ్, ఒక కాలర్, ఒక బెల్టు కూడా ఉంటుంది.

నికిత విశాఖ..
మార్వాడీ కుటుంబానికి చెందిన నికిత, విశాఖ అనే ఇద్దరు తోడికోడళ్ల గొప్ప పనితనమే ఈ ఫ్యాషన్‌ హౌజ్‌. అత్తింటి వారికి మహారాష్ట్రలో ఓ పెద్ద వస్త్ర పరిశ్రమ ఉంది. దాదాపు దశాబ్దంపాటు అదే వృత్తిలో ఉన్న వారి భర్తలను చూసి.. వస్త్ర ప్రపంచంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇంటరెస్ట్‌కు కాస్త సృజనాత్మకతను జోడించి తమ దుస్తులను తామే డిజైన్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తింపు, మెప్పు వస్తూండడంతో ‘నికిత విశాఖ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించారు.

అనతికాలంలోనే ఆ డిజైన్స్‌కు ఆదరణ పెరిగి ఫేమస్‌ డిజైనర్స్‌గా ఎదిగారు. వీరి డిజైన్స్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా వీరు డిజైన్‌ చేసిన చీరలకు. ట్రెండీ లుక్‌తో ఉండే సంప్రదాయ చీరలను డిజైన్‌ చేయడంలో వీరికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకునే అవకాశం కూడా ఉంది. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. మెయిన్‌బ్రాంచ్‌ ముంబైలో ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

మొదట్లో నా చర్మరంగు గురించి చేసే విమర్శలకు బాధపడేదాన్ని, కానీ, సరిగ్గా లేకపోవడం కూడా సరైనదే అని అర్థమవుతోందిప్పుడు.
– అమలాపాల్‌

చీర డిజైనర్‌ : నికిత విశాఖ
ధర: రూ. 46,000

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement