Designer Clothes
-
సమంత డిజైనర్ చీర.. ధర ఎంతో తెలుసా?
హీరోయిన్ సమంత ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంది. ఈ బ్యూటీ.. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసమే అక్కడికి వెళ్లిందని రూమర్స్ వచ్చాయి. మరి ఇందులో నిజమెంత ఉందనేది పక్కనబెడితే ప్రస్తుతం అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయిపోయింది. అయితే మిగతా విషయాల గురించి పక్కనబెడితే సామ్ ధరించిన స్పెషల్ చీర ధర.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సమంత హిట్ కొట్టి చాలారోజులు అయిపోయింది. అప్పుడెప్పుడో 2019లో 'ఓ బేబీ' మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత నుంచి పలు సినిమాలు చేస్తున్నా ఏవీ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ 'ఖుషి'పై పెట్టుకుంది. సెప్టెంబరు 1న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సమంత.. దీని ప్రమోషన్స్‌కి రాకపోవచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) తాజాగా న్యూయార్క్ లో దిగిన ఫొటోల్ని సమంత.. తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ డిజైనర్ శారీ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించినట్లు తెలుస్తోంది. దీని ధర ఏకంగా రూ.1,38,000 అని సమాచారం. ఈ కాస్ట్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే సమంత వేసుకున్న ఆ బ్లాక్ శారీ.. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది. బోర్డర్ అంతా డిజైన్ ఉంది. అలాంటి ఈ చీర దాదాపు లక్షన్నర ఖరీదు కావడం నెటిజన్స్ రియాక్షన్‌కి కారణమైంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
అందుకే కాటన్ ఫ్యాబ్రిక్‌కు డిమాండ్ ఎక్కువ, వాటినుంచి కాపాడుకోవచ్చు
సహజ రంగులు అద్దుకున్న ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీగా అమరిపోతుంది. ఆ దుస్తుల్లో ఎక్కడ ఉన్నా హుందాతనం కనిపిస్తుంది. అందుకే స్లో ఫ్యాషన్‌గా పేరున్న దుస్తులు ఇప్పుడు ఫాస్ట్‌గా యువతను ఆకట్టుకుంటున్నాయి. టై అండ్ డై తోనూ అట్రాక్ట్ చేస్తున్నాయి.హైదరాబాద్‌లోని తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సెల్లో సహజ రంగులతో దారాలను, ఫ్యాబ్రిక్‌ను ఎంత కలర్ఫుల్గా మార్చేయవచ్చో కళ్లకు కడుతున్నారు. పోచంపల్లి, ఇకత్, పటోల వంటి.. మన చేనేతల్లో రంగుల వాడకం తెలిసిందే. అయితే ఈ రంగులు అన్నీమొక్కల బెరడు, పండ్లతొక్కలు, ఆకులు, పువ్వులు, వేర్లు.. మొదలైనవాటితో తయారు చేసి, ఆ ప్రింట్లను దుస్తుల మీదకు తీసుకురావడం పెద్ద ప్రక్రియే. కానీ, వీటివల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటాం. పైగా కాటన్ ఫ్యాబ్రిక్, సహజ రంగుల వల్ల సూర్యుని నుంచి హానికరమైన అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు. డై చేసిన ఈ సహజ రంగులు ఎంతకాలమైనా మన్నికగా ఉండటంతో ఈ కాటన్ వస్త్రాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. మన దేశీయ కళను మరింత విస్తృతంగా కళ్లకు కడుతుంది. సహజరంగు దారాలు కాటన్, పట్టుదారాలను ముందుగా రంగులో ఉడికించి, తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి, మగ్గం మీద నేయడానికి వాడుతారు. ఈ రంగు దారాలతో చీరలు, ఫ్యాబ్రిక్‌ను తయారుచేస్తారు. సేంద్రీయ రంగులతో తయారైన ఫ్యాబ్రిక్ రంగులు, ప్రింట్స్ కాలక్రమేణా వెలిసిపోతాయి అనుకుంటారు. కానీ, సరైన జాగ్రత్తలతో వేసిన సహజ రంగులు చాలాకాలం పాటు ఉంటాయి. ఫ్యాబ్రిక్ మన్నికను మించి కూడా రంగులు తమ సహజ గుణాన్ని చూపగలవు. ప్రక్రియలో నేర్పు అవసరం టై అండ్ డై, యార్న్ డై టెక్నిక్స్‌కు నేచరల్, సింథటిక్ రెండింటికీ వాడచ్చు. మనకు ఎన్ని రంగులు కావాలో ముందు డిసైడ్ చేసుకోవాలి. డైయింగ్ పద్ధతి పూర్తయ్యాకే మనకు కావాల్సిన డిజైన్ వస్తుంది కాబట్టి, టై చేసే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. దానిమ్మ, బంతిపువ్వు, బీట్రూట్, ఆలివ్స్.. ఇలా అన్నింటినుంచి లేత, ముదురు రంగులను సహజంగా తయారు చేసుకోవచ్చు. – డా. లక్ష్మీ పూజ శంకు అసిస్టెంట్ ప్రొఫెసర్, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ►ముందు నీళ్లను బాగా మరిగించి, అందులో ఎంపిక చేసుకున్న పువ్వు లేదా బెరడు వంటివి వేసి ఉడికించాలి. పదార్థంలో ఉన్న రంగు అంతా నీళ్లలోకి వచ్చేశాక, వడకట్టుకొని, ఆ నీటిని మళ్లీ మరిగించాలి ∙ ►మిషనరీ లేదా మగ్గంపై తయారైన కొత్త క్లాత్‌లో స్టార్చ్, దుమ్ము ఉంటుంది. ఎంపిక చేసుకున్న క్లాత్‌ని ముందుగానే బాగా ఉతికి, ఆరేసి ఉంచాలి. ► డిజైన్‌ను బట్టి క్లాత్‌ను మడిచి, గట్టిగా ముడివేసి, ఉడుకుతున్న రంగులో ముంచి, అరగంట ఉంచి, తీసి, తర్వాత నీడలో ఆరబెట్టాలి. ►యార్న్ అయినా అదేవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, రంగు తయారీలో సమయం, పీహెచ్ లెవల్స్ ని పెంచడంలో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. ► వీటిని అనుసరిస్తే రంగుల్లో రకరకాల షేడ్స్ తీసుకురావచ్చు ∙నేచరల్ కలర్స్ అంత ఫాస్ట్ కలర్స్ మరేమీ ఉండవు. ► ప్రాచీన సౌందర్యం, ఆ హుందాతనం మనల్ని ఎలాగైతే ఆకట్టుకుంటుందో అంత బాగా ఈ సహజ రంగుల అందం కట్టిపడేస్తుంది. – నిర్మలారెడ్డి -
కియారా వేసుకున్న ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్గా పెళ్లి, మెహందీ, సంగీత్.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేస్తుంది. తాజాగా సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కంప్లీట్ గోల్డ్ అండ్ సిల్వర్ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్ మల్హోత్రా అండ్ టీం.ప్రస్తుతం కియారా సంగీత్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అమలాపాల్ చీర ఖరీదు అన్ని వేలంటే నమ్ముతారా?
అమలాపాల్.. గ్లామర్ పాత్రలు చేస్తూనే ఏ చిన్న చాన్స్ దొరికినా నటనకు ప్రాధాన్యం ఉన్న భూమికలనూ పోషిస్తూ ఓ స్టయిల్‌ను సెట్ చేసుకున్న నటి. సినిమాల్లోనే కాదు.. తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌ను చూపిస్తోంది.. డిజైన్.. ఫాస్ట్ఫుడ్కే కాదు ఫాస్ట్ డ్రెసింగ్కూ అంతే క్రేజ్ ఉందిప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే రెడీ టు వేర్ చీర డిజైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోవలోనిదే ఈ చీర. ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్‌కు ముందుగానే కుచ్చులను కుట్టేస్తారు. దీనితో పాటు స్టిచ్డ్ బ్లౌజ్, ఒక కాలర్, ఒక బెల్టు కూడా ఉంటుంది. నికిత విశాఖ.. మార్వాడీ కుటుంబానికి చెందిన నికిత, విశాఖ అనే ఇద్దరు తోడికోడళ్ల గొప్ప పనితనమే ఈ ఫ్యాషన్ హౌజ్. అత్తింటి వారికి మహారాష్ట్రలో ఓ పెద్ద వస్త్ర పరిశ్రమ ఉంది. దాదాపు దశాబ్దంపాటు అదే వృత్తిలో ఉన్న వారి భర్తలను చూసి.. వస్త్ర ప్రపంచంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఇంటరెస్ట్కు కాస్త సృజనాత్మకతను జోడించి తమ దుస్తులను తామే డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. గుర్తింపు, మెప్పు వస్తూండడంతో ‘నికిత విశాఖ’ పేరుతో ఓ బొటిక్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ డిజైన్స్‌కు ఆదరణ పెరిగి ఫేమస్ డిజైనర్స్గా ఎదిగారు. వీరి డిజైన్స్‌కు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వీరు డిజైన్ చేసిన చీరలకు. ట్రెండీ లుక్‌తో ఉండే సంప్రదాయ చీరలను డిజైన్ చేయడంలో వీరికి పెట్టింది పేరు. ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. మెయిన్బ్రాంచ్ ముంబైలో ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. మొదట్లో నా చర్మరంగు గురించి చేసే విమర్శలకు బాధపడేదాన్ని, కానీ, సరిగ్గా లేకపోవడం కూడా సరైనదే అని అర్థమవుతోందిప్పుడు. – అమలాపాల్ చీర డిజైనర్ : నికిత విశాఖ ధర: రూ. 46,000 -
ఒక్క క్లిక్‌తో పెళ్లి కుమార్తెలా మెరవవచ్చు..
ఇంటి నుంచే ఆన్లైన్ షాపింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంట్లో ఉండే నేరుగా షాపును సందర్శించవచ్చు. అందులో తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ డ్రెస్‌లో తాము ఎలా ఉంటామో చూసుకోవచ్చు. అదే వర్చువల్ రియాలిటీ. మన దేశీయ ప్రసిద్ధ డిజైనర్ మనీష్ మల్హోత్రా భారతదేశంలో మొదటి వర్చువల్ డిజైనర్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించాడు. కరోనా తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా వర్చువల్ రియాలిటీని చెప్పుకోవచ్చు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పెళ్లి డ్రెస్సులను ధరించాలని, బాలీవుడ్ తరహా పెళ్లి నృత్యాలు చేయాలని చాలామంది అనుకుంటారు. అలా ఆలోచిస్తే.. ఈ దుకాణాన్ని మీరు ఒక్క క్లిక్‌తో తెరవచ్చు. ఆకట్టుకునే పంజాబీ పాట ‘మహే డి తప్పే’ కి దాని (వర్చువల్) తలుపులు తెరుస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక గది నుండి మరొక గదికి వెళ్ళినప్పుడు సంగీతం మారుతుంటుంది. ఈ వర్చువల్ స్టోర్‌లో పర్యటించి మీరు ఆ స్టోర్‌లో పెళ్లి కూతురులా మెరిసిపోవచ్చు. షేర్వానీల వరసలు.. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తూ వెళుతుంటే .. మిమ్మల్ని లేలేత రంగుల డిజైనర్ లెహెంగాలు, షెర్వానీల వరుసల నుండి పోల్కీ ఆభరణాలతో మెరిసే ప్రదర్శనకు తీసుకెళుతుంది. మీ కంప్యూటర్ తెరపై కనిపించే ప్రతి డ్రెస్‌పై క్లిక్ చేయవచ్చు, ఫాబ్రిక్, ఎంబ్రాయిడరీ, ధరల గురించి చాలా వివరంగా తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని మల్హోత్రా డిజైన్ స్టోర్‌కి ఇది వర్చువల్ అవతార్. దిగ్గజ కుతుబ్ మినార్‌కు ఎదురుగా ఉంది. ‘ఇది భారతదేశంలో నా మొదటి వర్చువల్ స్టోర్. 2019 లో ఈ స్టోర్‌ను రీ డిజైనింగ్ చేశాం. దీని విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. దేశంలో డిజైనర్ విభాగంలో అతిపెద్ద స్టోర్ ఇది‘ అని మల్హోత్రా చెప్పారు. లాక్డౌన్ నేర్పిన వేగం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు ఈ వర్చువల్ ప్రక్రియను వేగవంతం చేసింది అంటాడు మల్హోత్ర. ‘ఈ వర్చువల్ స్టోర్ అంతటా ఉన్నట్టే. ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని రోజులు, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మేం ఈ ప్రదేశంలో లేకపోయినా మా డిజైన్లు కస్టమర్లను చేరుకుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా మేం వినియోగదారుల నుంచి మంచి బలమైన నమ్మకాన్ని పొందగలం‘ అని తన వర్చువల్ విధానం గురించి తెలియజేస్తారు మల్హోత్రా. లాక్డౌన్ సమయంలో వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న మల్హోత్రా తనను నేరుగా కలవడానికి, వారి దుస్తులను చూడాలనుకునే వధువులకు ఉపయోగంగా ఉండే మాధ్యమాన్ని వెతికారు. అప్పుడే ఈ డిజిటల్ వైపు మొగ్గుచూపారు. వర్చువల్ ఉపయోగాలను వివరిస్తూ ‘నేను ఆర్డర్ల కోసం, నా కొత్త డిజైన్స్ పరిచయం చేయడానికి వేరే వేరే ప్రాంతాలు తిరగనక్కరలేదు. ఇది వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనుభవాన్ని అందిస్తుంది. దీని నుంచి మిడిల్ ఈస్ట్, కెనడా, అమెరికా వంటి దేశాలలో మా ఉనికిని బలోపేతం చేయాలని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మొత్తంమీద కరోనా వైరస్ కొత్త కొత్త వాటిని పరిచయం చేసింది. అందరి దృష్టి డిజిటల్ వైపు మరింత సారించేలా చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ షోలు వర్చువల్ వైపుగా మళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్టోర్స్ కూడా చేరాయి. -
ఆకులతో డిజైనర్ డ్రెస్..
చాలా మంది విలువైన డిజైనర్ డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కొంతమందేమో చాలా సింపుల్‌గా ఉన్నా చాలు సరిపోతుంది. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు ఈ ఫొటోలోని యువతులు. తూర్పు చైనాలోని హెఫె యూనివర్సిటీకి చెందిన నలుగురు డిజైనర్ డ్రెస్‌ను తలదన్నేలా ఎలాంటి ఖర్చు లేకుండా డ్రెస్ రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎందుకంటే ఈ డ్రెస్‌ను కేవలం చెట్ల ఆకులతో డిజైన్ చేశారంటే నమ్మగలమా!! కానీ ఇది అక్షరాల నిజం.. వారం రోజులుగా చైనీస్ సోషల్ మీడియాలో ఈ ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆరు వేల ఆకులు, కొన్ని దారాలు, విపరీతమైన శ్రమ ఖరీదు చేసి తయారు చేశారు. ఈ డ్రెస్ ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి దీని వెనుక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల కృషి ఉంది. ఆరు నెలల క్రితం వచ్చిన ఒక ఆలోచన వల్ల ఈ డ్రెస్ రూపుదిద్దుకుంది. యూనివర్సిటీలో ఏటా జరుగబోయే ఒక సదస్సుకు అక్కడి వారందరూ చాలా ఖరీదైన డ్రెస్‌లు వేసుకుని వస్తారు. అయితే అందరి దృష్టిని తమ వైపు ఎలా మరల్చాలి అని ఆలోచిస్తున్న తరుణంలో వీళ్లకు ఈ ఆకుల డ్రెస్ ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా వారి టీచర్ వద్దకి పరిగెత్తుకెళ్లి చెప్పారు. కానీ ఆ టీచర్ కాస్తా ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ వారిని నిరాశకు గురిచేశారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా వాళ్లు ఆ సంగతిని అక్కడే వదిలేయలేదు. చెట్ల ఆకులను ఫాబ్రిక్గా ఎలా ఉపయోగించాలనే విషయంపై విపరీతంగా సమాలోచనలు, పరిశోధనలు జరిపి ఆకులను సేకరించారు. ఆ ఆకులను వేడి నీటిలో ఉడికించి, ఆ తర్వాత ఆల్కలీ, సోడియం కార్బొనేట్ ద్రావణంలో రెండు గంటల పాటు ఉంచి అందులోని నీటిని పూర్తిగా పోయేలా చేశారు. ఆ తర్వాత మరి కొన్ని ప్రయోగాలకు ఆ ఆకులను గురిచేసి, వాటిని దారం సహాయంతో చక్కగా అల్లిక చేసి ఈ అందమైన డ్రెస్‌ను తయారుచేశారు. -
స్టైలు స్టైలురా..
ర్యాంప్‌పై అందాలభామలు హొయలు పోయినట్టు.. కళ్లద్దాలు పెట్టుకుని, డిజైనర్ దుస్తులు ధరించి ఈ శునకరాజం ఎంత ఠీవిగా నడుస్తోందో చూశారా.. రెండు కాళ్లపై నడవడమే దీని స్పెషాలిటీ. ఈ శునకం పేరు షియోను. తన యజమాని ఫాంగ్(62)తో కలసి రోజు నడుచుకుంటూ మార్కెట్‌కు వెళుతుంది. చైనాలోని షాంఘై సిటీలో డిసెంబర్ 19న షియోను మార్కెట్‌కు వెళుతుండగా తీసిన చిత్రమిది. మూడేళ్ల క్రితం రోడ్డు పక్కన దొరికిన కుక్కపిల్లకు షియోను అని పేరుపెట్టి పెంచుకుంటున్నాడు ఫాంగ్. రెండు కాళ్లపై నడిచేలా తర్ఫీదునివ్వడంతో మనుషుల్లాగే నడిచేస్తోంది.. -
వేడుకలో... వెలుగు
వేడుక ఏదైనా నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు అతివలు.అందుకే డిజైనర్ దుస్తులు, అలంకరణ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.కొనుగోలులో ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటారు. తెలిసినవారిని సలహాలు అడుగుతుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా సరైన మేకప్ లేకపోతే వేడుకలో కళావిహీనంగా కనిపిస్తారు. అయితే ‘వేసవిలో మేకప్ చాలా కష్టం, ఎక్కువసేపు భరించలేం’ అనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ముస్తాబైతే ఏ వేడుకలోనైనా వెలిగిపోవచ్చు. మేకప్‌కి ముందుగా: ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల పాలు తీసుకొని, వేళ్లతో అద్దుకుంటూ ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. జిడ్డు చర్మం గలవారు పాలలో సెనగపిండి కలిపి మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. పొడిచర్మం గలవారు క్లెన్సింగ్ మిల్క్‌తో మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోతాయి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మేకప్ ఇలా... ప్రైమర్: దీంట్లో ఫేస్, ఐ ప్రైమర్ విడివిడిగా ఉంటుంది. వీటిని ముఖానికి, కళ్ల కింద రాసుకోవాలి. ఫౌండేషన్: ఎస్.పి.ఎఫ్ లేని ఫౌండేషన్‌ను బ్రష్‌తో వేసుకోవాలి (వేసవి కదా అని ఎస్.పి.ఎఫ్ మేకప్‌కి ముందుగా వాడితే మేకప్ తెల్లటి ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఫొటో ఫ్లాష్‌కి ముఖం మరింత తెల్లగా అనిపించడమే కాకుండా, ఫొటోలలో కూడా మేకప్ ప్యాచ్‌లుగా పడే అవకాశం ఉంది). కన్సీలర్: దీనిని కంటి కింది భాగంలో ఐ బ్రష్‌తో వేయాలి. కన్సీలర్కి ముందుగా ఎస్.పి.ఎఫ్ లోషన్ వాడకూడదు. బ్లష్: ఫౌండేషన్ ముఖమంతా సరిగ్గా బ్రష్‌తో వేశాక.. చెంపలు గులాబీల్లా మెరిసిపోవడానికి బ్లష్‌ను ఉపయోగించాలి. అలాగని బ్లష్ మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. బ్రోంజర్: ఫొటోలలో మంచి లుక్‌తో ముఖారవిందం కనిపించాలంటే చీక్ బోన్స్ దగ్గర అంటే బుగ్గల పైభాగంలో, చుట్టూ ‘మ్యాట్ బ్రోంజర్’ వాడాలి. దీనివల్ల మేకప్ పగలు కూడా సహజమైన చర్మకాంతిలో కనిపిస్తుంది. ఇల్యుమినేటర్: చీక్ బోన్స్, ముక్కు, కళ్ల కింద, నుదురు, కణతలు... ఇలా ముఖంలో హైలైట్‌గా కనిపించే భాగాలపై లిక్విడ్ ఇల్యుమినేటర్ బ్రష్‌తో చేసుకోవాలి. కనుబొమలు: ఐ బ్రో పెన్సిల్ లేదా జెల్‌తో కనుబొమలను తీరుగా తీర్చిదిద్దుకోవాలి. ఐ షాడో: కనురెప్పల పైన లేత రంగులను షాడో బ్రష్‌తో తీర్చిదిద్దాలి. కనురెప్పలను ఒంపుగా వచ్చేలా ఐ లైనర్, మస్కారాలను ఉపయోగించాలి. పౌడర్: మేకప్ పూర్తయ్యాక టచప్ కోసం పౌడర్ని అద్దాలి. పెదవులు: లిప్ స్టెయిన్, లిప్ లైనర్, లిప్‌స్టిక్‌లతో పెదవులను అలంకరించాలి. చెక్: మేకప్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ, అదనంగా ఉన్న పౌడర్, ఫౌండేషన్‌ని బ్రష్‌తో తీసేయాలి. కళ్లు, పెదవుల మేకప్ తీరుగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. ఇలా వేసుకున్న మేకప్ 2 నుంచి 5 గంటల సేపు ఉంటుంది. మేకప్ కొన్ని గంటల పాటు డల్ కాకుండా ముఖం తాజాగా ఉండాలంటే మ్యాక్ స్ప్రే ఉపయోగించాలి.మేకప్ పూర్తయ్యాక ఆభరణాలను, కేశాలను, దుస్తులను నచ్చిన రీతిలో అలంకరించుకోవాలి. ఈ తరహా మేకప్ పెళ్లికూతురితో పాటు పెళ్లికి వెళ్లే అతివలకూ ఉపయోగ కరంగా ఉంటుంది. నోట్: గాడీ మేకప్ వల్ల వేసవి ఉక్కపోతలో చీకాకు కలగవచ్చు. అందుకని లైట్ మేకప్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి. సన్‌స్క్రీన్ లోషన్ వాడేవారు... మేకప్ చేసుకునే ముందు అంటే గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్ వాడాలనుకునేవారు ఫౌండేషన్ క్రీమ్‌తో కలిపి 3-4 చుక్కలు మాత్రమే లోషన్‌ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కి ముందు రెండు చుక్కల సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవచ్చు. వెంట తప్పనిసరి... మేకప్ చేసుకొని బయటకు వెళ్లేవారు ఫౌండేషన్‌ని కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. వెళ్లిన చోట అవసరమైనప్పుడు కొద్దిగా టచప్ చేసుకోవచ్చు. ముఖంపై చమట, జిడ్డు చేరినప్పుడు క్లాత్‌ను ఉపయోగించకుండా టిష్యూ పేపర్‌తో అద్ది, తీసేయాలి. తరచూ మేకప్ వేసుకునేవారు... పెరుగు, సెనగపిండి కలిపి ముఖానికి మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకొని తర్వాత ఫ్రూట్ లేదా ముల్తానీ మిట్టితో ప్యాక్ వేసుకోవాలి. కలబంద (అలోవెరా) రసాన్ని ముఖానికి రాసి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకొని, గుడ్డులోని తెల్లసొనతో ప్యాక్ వేసుకోవాలి. మేకప్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, మొటిమలు తగ్గుతాయి. పసుపు, పాలు లేదా పసుపు, పెరుగు కలిపి ఏదైనా ఒక ప్యాక్‌ని ముఖానికి వేసుకోవాలి. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
నవ్వులు, స్నేహితులే.. ఆనందానికి అర్థాలు!
‘‘ఆనందం అనేది బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులో లేదు. ఖరీదైన కార్లు, డిజైనర్ క్లాత్స్‌లో లేదు.. ఆనందం అనేది కుటుంబం, స్నేహితులు, ప్రకృతి సౌందర్యంలోనే ఉంది...’’ అని అభిప్రాయపడ్డారు అధ్యయనకర్తలు. ఈ అభిప్రాయం సర్వేను చేసినవారిది కాదు. సర్వేలో పాల్గొన్నవారిది. ప్రస్తుత సమాజంలో మనస్పూర్తిగా నవ్వగలగడం తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తున్నట్లుగా చాలామంది చెబుతున్నారని ఈ సర్వేలో పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 22 శాతం మంది మనసారా... హాయిగా నవ్వుకోవడం తమకు ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. 21 శాతంమంది స్నేహితులతో గడిపే సమయం తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనదని తెలిపారు. ఇంతే శాతం మంది కడుపారా ఇష్టమైన తిండిని తినడం హ్యాపీగా ఉండేలా చేస్తోందంటూ ఆహారంపై ఆసక్తిని ప్రదర్శించారు. ఇష్టమైన వారి సాంగత్యంలో గడపడమే తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తోందని 19 శాతం మంది తెలిపారు. వీరంతా కూడా ఇష్టమైనవారిని ‘హగ్’ చేసుకోవడం అంటే ఇష్టమని, అదే తమకు ఆనందమని చెప్పడం విశేషం. సూర్యోదయాలను గమనించడం, సూర్యాస్తమయాల్లో ఏకాంతంగా గడపడం, మంచి పుస్తకాలు చదవడం, పాతఫోటోలను చూస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, పచ్చటి పంటపొలాల మీదుగా వచ్చే వాసనను ఆస్వాదించడం, క్లీన్‌గా ఉన్న బెడ్‌పై తనివితీరా నిద్రపోవడం, సముద్రపు ఒడ్డున ఇష్టమైన వారితో కలిసి నడవడం.. తమకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అంశాలని అనేకమంది తెలిపారు. ఇంకొందరు తమ ఆనందానికి కీ శృంగారంలో ఉందన్నారు. ఒకవైపు ప్రపంచం అంతా కమర్షియల్‌గా, మెటీరియలిస్టిక్‌గా మారిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాటి మనిషిని పట్టించుకొనే ఓపిక , బంధాలకూ, బంధుత్వాలకు విలువనిచ్చే పరిస్థితి లేదని, ప్రపంచం యాంత్రికంగా మారిపోయిందనే నిర్వేదం కూడా వ్యక్తమవుతోంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇలా స్నేహితులతో గడపడం, గుండెలనిండుగా నవ్వుకోవడాలే తమకు ఆనందాన్ని ఇస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించడం ఒక ఎత్తయితే, తమకు ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి చెప్పమంటే.. డబ్బు అనే పదానికి చాలామంది అల్ప ప్రాధాన్యతను ఇవ్వడం నిజంగా విశేషమే!