చాలా మంది విలువైన డిజైనర్ డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కొంతమందేమో చాలా సింపుల్‌గా ఉన్నా చాలు సరిపోతుంది. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు ఈ ఫొటోలోని యువతులు. తూర్పు చైనాలోని హెఫె యూనివర్సిటీకి చెందిన నలుగురు డిజైనర్ డ్రెస్‌ను తలదన్నేలా ఎలాంటి ఖర్చు లేకుండా డ్రెస్ రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎందుకంటే ఈ డ్రెస్‌ను కేవలం చెట్ల ఆకులతో డిజైన్ చేశారంటే నమ్మగలమా!! కానీ ఇది అక్షరాల నిజం.. వారం రోజులుగా చైనీస్ సోషల్ మీడియాలో ఈ ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆరు వేల ఆకులు, కొన్ని దారాలు, విపరీతమైన శ్రమ ఖరీదు చేసి తయారు చేశారు. ఈ డ్రెస్ ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి దీని వెనుక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల కృషి ఉంది.
ఆరు నెలల క్రితం వచ్చిన ఒక ఆలోచన వల్ల ఈ డ్రెస్ రూపుదిద్దుకుంది. యూనివర్సిటీలో ఏటా జరుగబోయే ఒక సదస్సుకు అక్కడి వారందరూ చాలా ఖరీదైన డ్రెస్‌లు వేసుకుని వస్తారు. అయితే అందరి దృష్టిని తమ వైపు ఎలా మరల్చాలి అని ఆలోచిస్తున్న తరుణంలో వీళ్లకు ఈ ఆకుల డ్రెస్ ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా వారి టీచర్ వద్దకి పరిగెత్తుకెళ్లి చెప్పారు. కానీ ఆ టీచర్ కాస్తా ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ వారిని నిరాశకు గురిచేశారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా వాళ్లు ఆ సంగతిని అక్కడే వదిలేయలేదు.
చెట్ల ఆకులను ఫాబ్రిక్‌గా ఎలా ఉపయోగించాలనే విషయంపై విపరీతంగా సమాలోచనలు, పరిశోధనలు జరిపి ఆకులను సేకరించారు. ఆ ఆకులను వేడి నీటిలో ఉడికించి, ఆ తర్వాత ఆల్కలీ, సోడియం కార్బొనేట్ ద్రావణంలో రెండు గంటల పాటు ఉంచి అందులోని నీటిని పూర్తిగా పోయేలా చేశారు. ఆ తర్వాత మరి కొన్ని ప్రయోగాలకు ఆ ఆకులను గురిచేసి, వాటిని దారం సహాయంతో చక్కగా అల్లిక చేసి ఈ అందమైన డ్రెస్‌ను తయారుచేశారు.
ఆకులతో డిజైనర్ డ్రెస్..
Published Sun, Nov 5 2017 12:58 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment