కియారా వేసుకున్న ఈ డ్రెస్‌ డిజైన్‌ చేయడానికి అన్ని వారాలు పట్టిందా? | Did You Know Kiara Advani Sangeet Lehanga With 98k Crystals | Sakshi
Sakshi News home page

Kiara Advani : కియారా వేసుకున్న ఈ డ్రెస్‌ డిజైన్‌ చేయడానికి అన్ని వారాలు పట్టిందా?

Published Thu, Feb 23 2023 11:28 AM | Last Updated on Thu, Feb 23 2023 11:48 AM

Did You Know Kiara Advani Sangeet Lehanga With 98k Crystals - Sakshi

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్ధార్థ్‌ మల్హొత్ర ఇటీవలె పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లో  కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో  సిద్‌-కియారాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రీసెంట్‌గా పెళ్లి, మెహందీ, సంగీత్‌.. ఇలా ఒక్కో వేడుకకు సంబంధించిన ఫోటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేస్తుంది.

తాజాగా సంగీత్‌ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్‌థింగ్‌ రియల్లీ స్పెషల్‌’ అంటూ  రాసుకొచ్చింది. ఈ క్రమంలో కియారా అవుట్‌ఫిట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. కంప్లీట్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ రంగులో ఉన్న ఈ లెహంగాకు 98,000కు పైగా క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

సుమారు 4,000 గంటలు (దాదాపు 24 వారాలు)కష్టపడి ఈ లెహంగాను తీర్చిదిద్దారు మనీష్‌ మల్హోత్రా అండ్‌ టీం.ప్రస్తుతం కియారా సంగీత్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement