![Sidharth Malhotra Kiara Advani Treasure - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/11/mallhotra.jpg.webp?itok=8EH5VWWR)
Sidharth Malhotra Kiara Advani: బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల లిస్ట్ తీస్తే బోలెడంతమంది ఉంటారు. కానీ వీళ్లందరిలో కియారా-సిద్ధార్థ్ జోడీ సమ్‌థింగ్ డిఫరెంట్. ఎందుకంటే బయట ఎక్కడ కనిపించినా సరే ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఓ ఈవెంట్‌లో భాగంగా తన భార్యపై హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?)
పెళ్లి అనేది గేమ్
తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సిద్ధార్థ్ మల్హోత్రాకు యాంకర్ నుంచి 'పెళ్లి లైఫ్ ఎలా ఉంది?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'పెళ‍్లి అనేది గేమ్ లాంటిది. ఇందులో నేను అనేది ఉండదు. మనం అనేది మాత్రమే ఉంటుంది. ఈ ఆటలో ఇద్దరం కలిసి గెలుస్తాం, ఓడుతాం.. ఇలా అన‍్ని ఎమోషన్స్ ఉంటాయి.' అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
భార్య బంగారం
భార్య కియారా అడ‍్వానీ గురించి అడగ్గా.. 'నా లైఫ్ లో దొరికిన అత్యంత విలువైన సంపద ఆమె(కియారా)' అని సిద్ధార్థ్ మల్హోత్రా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే 'షేర్ షా' సినిమాలో కలిసిన నటించిన వీళ్లిద్దరూ.. షూటింగ్ సమయంలో లవ్ లో పడ్డారు. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో హీరోయిన్ గా నటిస్తోంది. సిద్ధార్థ్ సినిమాలు, వెబ్ సిరీసుల‍్లో నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!)
Comments
Please login to add a commentAdd a comment