నజ్రియా నాజిమ్.. తెలుగు తెర ఆమె కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసింది. ఆ ఎదురు చూపులకు చక్కటి ఫలితమే ‘అంటే సుందరానికి’. ఆ సినిమాలో ‘లీల’గా నజ్రియా నటనను మెచ్చుకుని టాలీవుడ్‌లోకి ఆమెను ఘనంగా స్వాగతించారు. మరి తన స్టయిల్ సిగ్నేచర్‌గా ఏ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ఆమె గ్రాండ్‌గా ధరిస్తుందో చూద్దాం...
బ్రాండ్ వాల్యూ
తొరానీ
ఈ బ్రాండ్ స్థాపకుడు కరణ్ తొరానీ. స్ఫూర్తి అతని నానమ్మ. స్వస్థలం భోపాల్‌లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల ఆసక్తిని రేకెత్తించింది. నానమ్మ ఎప్పుడూ కట్టుకునే చందేరీ కాటన్ చీరలు.. ఆ నేత.. అతన్ని డ్రెస్ డిజైన్ వైపు మళ్లించాయి.
దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత తన బ్రాండ్ ‘తొరానీ’కి రూపమిచ్చాడు.
నజ్రియా చీర:
బ్రాండ్: తొరానీ
ధర: రూ. 64,000
ఆమ్రపాలి
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది.
అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లో లభ్యం.
నజ్రియా జ్యూయెలరీ:
ముత్యాల కమ్మలు
బ్రాండ్: అమ్రపాలి జ్యూయెలర్స్
ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది.
కథ, అందులో నా పాత్ర నచ్చితే చాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తా. అలా మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీ. – నజ్రియా నాజిమ్
-దీపిక కొండి
చదవండి: Fashion Jewellery: చెవులకు పెయింటింగ్! ధర రూ.300 నుంచి..
Comments
Please login to add a commentAdd a comment