సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.
అన్ని రకాల ఫ్యాబ్రిక్..
కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్‌లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.
ఖఫ్తాన్ శారీ..
ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్‌లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్‌లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.
ఆభరణాల అమరిక..
హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.
సౌకర్యంగా..
భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.
ఎంబ్రాయిడరీ..
పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్‌కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment