saree designs
-
ఛాన్సులిస్తే చాలు.. ఎలాంటి పాత్రకైనా నేను రెడీ: ఆరాధ్య దేవి
టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'శారీ' సినిమాతో ఆరాధ్య దేవి టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. కేరళకు చెందిన 23 ఏళ్ల ఈ బ్యూటీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. మలయాళీ మోడల్. చీరకట్టులో ఉన్న ఈ బ్యూటీ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన ఆర్జీవీ ఫిదా అయ్యాడు. అలా ఆమెకు ఏకంగా తన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట్లో చీరలో మాత్రమే కనిపించే ఆరాధ్య దేవి ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో షేక్ చేస్తుంది. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా రియాక్ట్ అయింది.మొదట్ల ఛాన్సులు వచ్చినప్పటికీ గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని సోషల్‌మీడియా ద్వారా ఆరాధ్యాదేవి చెప్పింది. గ్లామరస్తో పాటు ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది. అలాంటి చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆరాధ్య తెలిపింది. 'కాలం మారుతున్న కొద్దీ మన అభిప్రాయాలు మారుతాయంటూనే.. జీవిత అనుభవాలే మన నిర్ణయాలను మారుస్తాయని చెప్పుకొచ్చింది. గ్లామర్ అనేది చాలా వ్యక్తిగతమైనది. నాకు, అది వృత్తిలో భాగం. నటిగా వైవిధ్యంగా ఉండటం చాలా కీలకం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే. ఉత్తమ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్ పాత్రలు చేయకూడదని గతంలో నిర్ణయించుకున్నాను. కానీ, 22 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నా.' అని ఆరాధ్య పేర్కొంది. -
Hyderabad: మెరి'శారీ'లా..! నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’..
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు. -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్‌స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
డెనిమ్ న్యూ లుక్ డిజైన్..!
ఫ్యాషన్ ప్రపంచంలో అప్ సైక్లింగ్ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజెప్పడానికి డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్ అప్ సైక్లింగ్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది.మనకున్న రకరకాల డిజైన్ వేర్లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్‌ను డెనిమ్ అంటారు. డెనిమ్ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్ రోబ్స్లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్ వేర్ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్‌తో సరికొత్త డిజైన్‌నీ క్రియేట్ చేయవచ్చు.అప్ సైకిల్ డెనిమ్ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్ డిజైనర్. డెనిమ్‌తో ఎన్నో అప్‌సైకిల్ డిజైన్స్ చేసిన డిజైనర్. మోడర్న్ డ్రెస్సులే కాదు శారీస్‌ను కూడా డెనిమ్ టచ్‌తో,ప్యాచ్ వర్క్‌తో వివిధ రకాల మెటీరియల్‌ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్ చేస్తుంది.– నెట్ ఫ్యాబ్రిక్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్పైన ఘుంగ్రూ వర్క్ డిజైన్ చేశారు. – పోల్కా డాట్స్ప్యాచ్ వర్క్‌తో రూపొందించిన శారీ– లినెన్ శారీకి జియోమెట్రిక్ స్టైల్లో కట్ చేసిన డెనిమ్ క్లాతతో ప్యాచ్ వర్క్ చేశారు. – స్కర్ట్ శారీని డెనిమ్‌ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్ స్టైల్ డ్రెస్ ఇది. – డెనిమ్ క్రాప్‌టాప్– కాటన్ ఫ్యాబ్రిక్ – డెనిమ్ జాకెట్‌ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా– లేస్తో లాంగ్ స్లీవ్స్ రూపొందించిన డెనిమ్ జాకెట్– డెనిమ్ ప్యాచ్‌వర్క్‌తో మోడర్న్ టాప్– డెనిమ్ ప్యాంట్ బెల్ స్టైల్‌కి క్రోచెట్ డిజైన్‌ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్.ఇవి చదవండి: పవర్ఫుల్ ప్రఫుల్..! -
‘ఇక్కత్’కు ఇక్కట్లు!
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ) కలిగిన ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నేతన్న నేసే పట్టుచీర డిజైన్‌ను బట్టి గరిష్టంగా రూ.20 వేలు పలుకుతుండగా ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో వస్తున్న చీరలు కేవలం రూ.600కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారులు దెబ్బతింటున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సుమారు 50 వేల చేనేత వృత్తి దారుల జీవనోపాధిపై ప్రింటెడ్ చీరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చేనేత డిజైన్లు కాపీకి గురికాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రాండ్ ఇమేజ్‌పై దెబ్బ పట్టుదారానికి రంగులద్ది డిజైన్లు కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ చీరలకు మహిళల్లో విశేష ఆదరణ ఉంది. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టు చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా ఉంది. అలాంటి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో చీర ధర పడిపోవడం, ఏది అసిలీనో ఏది నకిలీనో గుర్తించలేకపోవడం, ఆన్లైన్లో మోసాలు జరగడం లాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ చీరలు రూ.600 నుంచి రూ.1000 లోపే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. భారీగా పడిపోయిన అమ్మకాలు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 12,000 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతినెలా ఒక జియో ట్యాగ్ కళాకారుడితోపాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు ఉంటారు. అంటే సుమారు 36 వేల మంది నేరుగా వృత్తిలో ఉన్నారు. నెలకు ఒక చేనేత కుటుంబం ఐదు చీరలు తయారు చేస్తుంది. ఇలా తయారైన చీరలతో గతంలో నెలకు రూ. 40 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరలు రాకతో రూ.20 కోట్లకు అంటే సగానికి సగం వ్యాపారం పడిపోయిందని నేతన్నలు చెబుతున్నారు. మూట వ్యాపారం దాకా విస్తరణ పోచంపల్లి ప్రింటెడ్ పట్టు చీరలు ఇప్పుడు గ్రామాల్లో మూట వ్యాపారం దాకా వచ్చాయి. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే లభించే ప్రింటెడ్ చీరలు ఇప్పుడు పల్లెల్లోనూ అమ్ముతున్నారు. ప్రింటెడ్ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టు చీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రింటెడ్ చీరలను అదుపు చేయాలి జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరలను పోలిన ప్రింటెడ్ చీరల తయారీని ప్రభుత్వం అరికట్టాలి. ఇటీవల పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రచనా సాహు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుజరాత్లో ప్రింటెడ్ చీరల తయారీని, షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలను నిరోధించాలి. కల్యాణ లక్ష్మి నగదు సహాయంతోపాటు పోచంపల్లి పట్టు చీరను వధువుకు ఇవ్వాలి. ఇక్కత్ వృత్తిని కాపాడాలి. – తడ్క రమేష్, చేనేత సంఘం నాయకులు, పోచంపల్లి మాల్స్‌పై మరిన్ని దాడులు చేస్తాం పోచంపల్లి పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించి దాడులు చేస్తున్నాం. ప్రతి డిజైన్‌ను కాపీతో ప్రింట్ చేసి చీరలను విక్రయిస్తున్నారు. చేనేత వృత్తిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. త్వరలో మరిన్ని దాడులు చేయబోతున్నాం. – వెంకటేశ్వర్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి -
పంట చేలో పాల కంకి పల్లకిలో పిల్ల ఎంకి నవ్వినంత అందంగా...
చీర గురించి ఎన్ని పాటలు రాసినా రాయాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి. అందమైన చీరకట్టును చూస్తే పంటచేలో పాలకంకి, పల్లకిలో పిల్ల ఎంకీ నవ్వినంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు వినూత్నంగా డిజైన్ చేసిన చీరల ఛాయాచిత్రాలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కేరళ కసువు శారీ (వైట్ కాటన్ శారీ విత్ గోల్డెన్ జరి బార్డర్) రకరకాల వేడుకలకు క్లాసిక్ ఫేవరేట్‌గా పేరు పొందింది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు ఈ చీరకు సంబంధించి పురాతన టెక్నిక్లను మాన్యువల్ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. ప్రతి ప్రింట్ ఒక అందమైన కథ చెబుతుంది. అరటిఆకుల నుంచి ఇంగ్లీజ్ రోజ్, చెంబూర్ ఫ్లవర్ వరకు ప్రకృతిలోని ఎన్నో అందాలు కసువు చీరెలో కనిపించి కనువిందు చేస్తాయి. -
చీరకట్టు.. ఇలా స్టైల్ చేసుకుంటే పార్టీలో హైలైట్ అవ్వాల్సిందే
ఎవర్గ్రీన్ డ్రెస్‌గా ఎప్పటికీ శారీ ముందు వరసలో ఉంటుందని తెలిసిందే. అయితే, చీరకట్టు అందం గురించి రొటీన్ మాటలు కాదు..ఇంకాస్త సృజనను జోడించి స్టైలిష్ లుక్ తీసుకురావాల్సిందే అనుకునేవారిని ఇట్టే ఆకట్టుకుంటోంది శారీ ఓవర్ కోట్. పట్టు చీరల మీదకు ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్స్ ధరించడం తెలిసిందే. కానీ, అవి సంప్రదాయ వేడుకలకే పరిమితం. వెస్ట్రన్ పార్టీలకూ శారీ స్టైల్‌ను పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని హ్యాపీగా ట్రై చేయచ్చు. శారీ మీదకు ఓవర్‌కోట్‌ను ధరించి కాన్ఫిడెంట్ లుక్స్‌తో కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. సేమ్ టు సేమ్ శారీ–ఓవర్ కోట్ ఒకే కలర్ ప్యాటర్న్‌లో ఉంటే ఆ స్టైల్ సూపర్బ్ అనిపించకుండా ఉండదు. ఆభరణాల జిలుగులు అవసరం లేని ఈ ప్యాటర్న్ స్టైల్ పార్టీలో ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ధోతీ శారీ సాధారణంగానే ధోతీ శారీ ఓ ప్రత్యేకమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక దాని మీదకు ఫ్లోరల్ ఓవర్ కోట్ ధరిస్తే ఎక్కడ ఉన్నా మరింత స్పెషల్‌గా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ కోట్స్ సిల్క్ ప్లెయిన్ శారీస్‌కి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఈ స్టైల్ ధోతీ శారీస్‌కు కూడా వర్తిస్తుంది. నీ లెంగ్త్ కోట్స్ మోకాళ్ల దిగువ భాగం వరకు ఉండే ట్రాన్స్పరెంట్ ఓవర్ కోట్స్ లేదా కేప్స్ నేటి యువతరపు మదిని మరింత ఆత్మవిశ్వాసంగా మార్చేస్తుంది. -
Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్!
కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ ప్రస్తుతం కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాజువల్ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో ఒక స్టైల్, డెనిమ్ షర్ట్‌తో మరో స్టైల్.. పెప్లమ్ టాప్‌తో ఒక స్టైల్, లాంగ్ జాకెట్‌తో మరో స్టైల్... ఇలా ఒక చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు. కాలానికి తగిన విధంగా లుక్‌లో మార్పులు తీసుకురావచ్చు. పెళ్లికి వెళ్లాలంటే ఎప్పుడూ ఒకేవిధంగా ఉండనక్కర్లేదు. బెనారస్ లాంగ్ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చలికాలానికి తగినట్టుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. క్యాజువల్ లుక్‌లో కొంచెం భిన్నంగా ఉండటంతోపాటు స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు. ఎక్కువ ఆభరణాలు అవసరం లేకుండా వర్క్వేర్గా అందంగా కనిపిస్తుంది. కాటన్ చీరలు ధరించేవారు ప్లెయిన్ లేదా శారీ కలర్ బ్లౌజ్ ధరించడం చూస్తుంటాం. దీంట్లోనే కొంత భిన్నమైన లుక్‌ను తీసుకురావచ్చు. టర్టిల్ నెక్, లాంగ్ స్లీవ్స్ ఉన్న ప్లెయిన్ కలర్ బ్లౌజ్‌లను ఈ శారీ స్టైల్‌కు వాడొచ్చు. ఈ కాటన్ శారీస్‌కు టర్టిల్ నెక్ ఉన్న స్వెట్ షర్ట్ కూడా ధరించవచ్చు. ప్రయాణాలు, సింపుల్ గెట్ టు గెదర్ వంటి వాటికి ఈ స్టైల్ బాగా నప్పుతుంది. కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరను ఎంచుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీకి సరిపోలే ఓపెన్ ఫ్రంట్ పెప్లమ్ జాకెట్‌ను తీసుకోవాలి. దీంతో పార్టీవేర్ లుక్ ఆకట్టుకుంటుంది. ఒక్క పెప్లమ్ ఓపెన్ టాప్‌తో మీదైన స్టైల్ స్టేట్మెంట్ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు. పెళ్లికి వెళ్లేవారు పట్టు చీర కట్టుకుంటారు. దీనికి బ్లాక్ కలర్ లంగా జాకెట్, సంప్రదాయ ఆభరణాలు ధరించి చూడండి. ఇండో వెస్ట్రన్ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్ జాకెట్‌తో ఉన్న ద్రెసింగ్ రెడీమేడ్ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపించడంతోపాటు కాలానుగుణంగా డ్రెస్ ధరించడంలోనూ మార్కులు కొట్టేస్తారు. పెళ్లికి స్వెటర్ ధరిస్తే బాగుండదు అనుకునేవారు ఇలా పట్టుచీరకు లాంగ్ స్లీవ్స్ ఉన్న వైట్ షర్ట్ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్ బెల్ట్‌తో తయారవ్వచ్చు. సంప్రదాయ ముత్యాల హారాలు ఈ స్టైల్‌కు మరింత వన్నె తెస్తాయి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. -
చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’
PV Sindhu In Saree: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మన తెలుగమ్మాయి పీవీ సింధు పూల రంగు చీర కట్టుకుని కుందనపు బొమ్మలా మెరిసింది. చీరకట్టులతో తెలుగమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. చిరునవ్వు చిందిస్తూ చీరలో మెరిసిపోతున్న సింధును చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు. ఆ ఫొటోలకు ఏడు లక్షల మందికిపైగా లైక్స్ కొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన చీరలో సింధు కనిపించింది. ఎప్పుడూ క్రీడా దుస్తుల్లో కనిపించే సింధు ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో దేవకన్యలా ప్రత్యక్షమైంది. తెలుపు చీరలో గులాబీ, నీలం, పర్పుల్ పూలు త్రెడ్‌వర్క్ చేసి ఉంది. ఈ చీర విలువ దాదాపు కొన్ని వేలల్లో ఉంటుందని ఫ్యాషన్‌ప్రియులు చెబుతున్నారు. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. సింధుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కాగా పీవీ సింధు ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించి సింధు సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సింధు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సింధు ఐస్‌క్రీమ్ తిన్న విషయం తెలిసిందే. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్ View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా చూడని వారు ఎవరూ ఉండరు. సోషల్ మీడియా వేదికను కొందరు కొత్త విషయాలను చెప్పడానికి వాడితే, మరికొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శించే వేదికగా వినియోగిస్తున్నారు. దేశాయ్ తల్లీ కూతుళ్లు మాత్రం.. వాళ్ల సృజనాత్మకతను వీడియోల రూపంలో పోస్టుచేసి ఎంచక్కా వ్యాపారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతో బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తూ పోతున్నారు. అది 2016. ముంబైలో ఉంటోన్న హీతల్ దేశాయ్ (తల్లి), లేఖినీ దేశాయ్ (కూతురు)లు ఇద్దరు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌కు షాపింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ చేనేత వస్త్రాలను చూసిన వాళ్లకు ‘ చేనేత వస్త్రంతో వివిధ రకాల డిజైన్లతో డ్రెస్సులు అమ్మితే ఎలా ఉంటుంది? అనే బిజినెస్ ఐడియా వచ్చింది. అలా ఆలోచన రాగానే వెంటనే ఎగ్జిబిషన్లో సహజసిద్ధ రంగులతో తయారయ్యే అజ్రాఖ్ ప్రింట్ ఉన్న 50 మీటర్ల ఫ్యాబ్రిక్‌ను కొన్నారు. ఇంటికి వచ్చిన తరువాత ఆ వస్త్రాన్ని వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఒక టైలర్‌కు ఇచ్చి వివిధ రకాల సైజుల్లో కుర్తీ్తలను కుట్టించారు. వీటిని ఎలా విక్రయించాలా... అని ఆలోచించినప్పుడు లేఖినికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఫేస్బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసి ఆ కుర్తీల ఫోటోలను అందులో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ఫేస్బుక్ ఫ్రెండ్స్‌కు నచ్చడంతో తమకు కావాలని అడిగారు. అలా రెండేళ్లపాటు సాగిన వ్యాపారం లో మంచి లాభాలు వస్తుండడంతో ‘ద ఇండియన్ ఎథినిక్ కోడాట్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ఏడాదికి పాతిక లక్షల బిజినెస్ నడిచేది. ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు. బిజినెస్ ప్రారంభంలో లేఖిని ఎంబీఏ చదువుతూ మరోపక్క సోషల్ మీడియాలో మార్కెటింగ్‌ను నిర్వహించేది. ఎంబీఏ పూర్తయిన తరువాత కోల్‌కతాలోని ఐటీసీలో లేఖినీకి ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్‌లో కొనసాగాలా? కార్పొరేట్ కెరీర్‌ను ఎంచుకోవాలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఉద్యోగానికే ఓటేసింది. ఆ సమయంలో హీతల్ దేశాయ్.. కంప్యూటర్ నేర్చుకుని వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేసేవారు. వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. లేఖిని ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రస్తుతం ద ఇండియన్ ఎథినిక్ డాట్‌కు మూడు కార్యాలయాలతోపాటు, ఒక స్టూడియో ఉన్నాయి. మొదట్లో కుర్తీలతో ప్రారంభమైన దేశాయ్ వ్యాపారం క్రమంగా చేనేత చీరలను సరికొత్త డిజైన్లతో రూపొందించి, వాటిని వీడియోల రూపంలో మార్కెట్లో వదలడంతో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ చేనేత వస్త్రాల బ్రాండ్లలో ఇండియన్ ఎథినిక్ ఒకటిగా నిలవడం విశేషం. లేఖినీ దేశాయ్ మాట్లాడుతూ...‘‘నా చిన్నప్పటినుంచి నాకు మా చెల్లికి ఏ డ్రెస్ అయినా అమ్మ మార్కెట్లో మెటిరియల్ కొని మాకు నప్పే విధంగా వివిధ రకాల డిజైన్లలో కుట్టేది. చిన్నప్పటి నుంచి అలా పెరిగిన నేను.. అమ్మ కుట్టే డ్రస్సులు మాకే కాదు అందరికి నచ్చుతాయి. వీటిని ఎవరైనా కొంటారు అనిపించేది. అలా అమ్మ కుట్టినవి కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి స్పందన వచ్చేది. ఈ రోజు పెట్టిన ఫోటోలు, వీడియోలలో ఉన్న చీరలు డ్రెస్‌లు మరుసటి రోజుకు అమ్ముడయ్యేవి. వేరే బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు మోడల్స్‌తో మోడలింగ్ చేయిస్తుంటారు. కానీ మేము అలాకాదు. మానాన్న గారి ప్రోత్సహంతో మేము డిజైన్ చేసిన బట్టలను వేసుకుని డ్యాన్స్ వేస్తూ మార్కెటింగ్ చేసేవారం. దీనికోసం గతేడాది ఒక స్టూడియో తీసుకున్నాం. దాన్లో నా ఫ్రెండ్స్ కొంతమందితో రూపొందించినlవస్త్రాలు కుట్టి పదినుంచి పదిహేను నిమిషాల వీడియోను షూట్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కస్టమర్ల నుంచి లైక్‌లతోపాటు వేలాది ఆర్డర్లు వచ్చేవి. దీంతో ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందనిపించింది. ఇక అప్పటి నుంచి అలా కొనసాగిస్తున్నాము’’ అంటూ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పింది లేఖిని. -
శత చిత్ర పద్మం
శత చిత్ర పద్మం అంటే... వంద చిత్రాల్లో నటించారని కాదు. శత వసంతాలు పూర్తి చేసుకున్నారామె. ఊరికే వందేళ్లు నిండితే కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్ ఉండేది కాదేమో! ఆమెలో ఒక చిత్రకారిణి ఉన్నారు. ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అంతకు మించి జీవితానికి సుపథం వేయగలిగిన గొప్ప తాత్వికవేత్త ఉన్నారు. చీర మీద చెట్టు పద్మావతి నాయర్ (పద్మమ్) 1920లో కేరళ రాష్ట్రం, త్రిశూర్‌లో పుట్టారు. ఈ నెలతో వందేళ్లు నిండాయి. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తారు. టీ తాగడం, న్యూస్ పేపర్ చదవడం పూర్తయిన తర్వాత తన స్నానపానాదులు, ఉపాహారం ముగించుకుని పదిన్నరకు ఉద్యోగానికి వెళ్లినంత కచ్చితంగా రోజూ తన డెస్క్‌కు చేరుతారు. ఒంటి గంట వరకు తన ప్రపంచంలో మునిగిపోతారామె. ఆమె ప్రపంచంలో చిలుకలుంటాయి, చెట్టు కొమ్మ మీద వాలిన జంట పక్షులుంటాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకుని విహరిస్తున్న కొంగలుంటాయి. పురి విప్పిన నెమళ్లుంటాయి. రేకులు విచ్చుకున్న పువ్వులుంటాయి. ఇవన్నీ చీర మీద రంగుల బొమ్మలుగా ఉండవచ్చు, వాల్ హ్యాంగింగ్స్గానూ ఉండవచ్చు. రోజూ పెయింటింగ్ కోసం మూడు గంటల సమయాన్ని కేటాయిస్తారామె. వందేళ్ల వయసులో చేతి వేళ్లు పట్టు దొరకడం కష్టమే. బ్రష్‌ను కదలకుండా పట్టుకుని డిజైన్‌కు తగినట్లు స్ట్రోక్స్ ఇవ్వడం చాలా నైపుణ్యంతో కూడిన పని. అదే మాట అన్నప్పుడు ఆమె నవ్వుతూ ‘‘నేను పెయింటింగ్స్ మొదలు పెట్టిందే అరవై దాటిన తర్వాత. అప్పటి నుంచి రోజూ వేస్తూనే ఉన్నాను. అలా వేస్తూ ఉండడమే వేళ్లకు శక్తి. అయితే టస్సర్ మీద పెయింటింగ్ చేయడం కొంచెం కష్టమే’’ అన్నారు. పెయింటింగ్ చేసిన చీరకు ఆమె పదకొండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు. పద్మమ్ బామ్మ వేసిన పెయింటింగ్ దుపట్టా మూడు వేలు. ‘‘నేనింత వరకు నా ఖర్చులకు పిల్లల దగ్గర చేయి చాచలేదు. నేను మనుమలు, మనుమరాళ్ల పుట్టిన రోజులకు నా డబ్బుతోనే బహుమతులిస్తాను కూడా’’ అంటారామె ఒకింత గర్వంగా. ఎవరికి వారే ఆధారం పద్మావతి నాయర్ బాల్యం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని వడకంచెర్రిలోనే గడిచింది. పదిమందిలో తొమ్మిదో సంతానం. ఫోర్డ్ మోటార్స్ ఉద్యోగి కేకే నాయర్‌ను పెళ్లి చేసుకుని 1945లో ముంబయికి వెళ్లారామె. వారికి ఐదుగురు పిల్లలు. ఆ పిల్లలందరి దుస్తులూ తానే మెషీన్ మీద కుట్టేవారు. ఆడపిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ కూడా చేసేవారు. పిల్లల బాధ్యతలు పూర్తయ్యేటప్పటికి అరవై దాటాయి. అప్పటి వరకు హాబీగా చేసిన పెయింటింగ్ కోసం పూర్తి సమయం కేటాయించారామె. తన సొంత సంపాదన మొదలు పెట్టింది కూడా అప్పుడే. మూడు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతోంది ఆమె పెయింటింగ్ కుటీర పరిశ్రమ. వందేళ్ల వయసులో కూడా డబ్బు సంపాదిస్తున్నాను. అవును, ఎందుకు సంపాదించకూడదు? అని ప్రశ్నిస్తారు పద్మమ్. ఆడపిల్లలనే కాదు ఎవరూ మరొకరి మీద ఆధారపడకూడదు. తమ మీద తాము ఆధారపడి జీవించాలి... అని ఆమె పేరెంటింగ్ ఫిలాసఫీ చెప్పారు. పద్మమ్కి ఏడుగురు మనుమలు– మనుమరాళ్లు, నలుగురు ముని మనుమళ్లు–మనుమరాళ్లు. ఆమెకు రోజూ ఒంటి గంట వరకు పెయింటింగ్స్‌తో గడిచిపోతుంది. మధ్యాహ్నం కొంత విశ్రాంతి. సాయత్రం కొంత సేపు టీవీ చూసిన తర్వాత మనుమలు– మనుమరాళ్ల నుంచి వచ్చిన వాట్సప్ మెసేజ్‌లు చూసుకోవడం, వాటికి బదులివ్వడం ఆమె వ్యాపకం. పిల్లల సెలవు రోజుల్లో వాళ్లకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాల్లో విస్తరించిన బంధువులందరినీ సోషల్ మీడియా వేదికగా పలకరిస్తుంది. స్నేహితులకు ఈ మెయిల్స్ చేస్తుంది. జీవితంలో ఏమున్నాయి? ఏమి లేవు? అని బేరీజు వేసుకుంటూ ఉంటే సంతోషాల కంటే కష్టనష్టాల తక్కెడ బరువెక్కుతుంది. ‘నా జీవితంలో నేనున్నాను’ అనుకుంటే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే ఆయుష్షును పెంచే ఔషధం. ఆనందంగా జీవించడానికి సాధనం. – మంజీర -
‘గొల్లభామ’కు ఖండాంతర ఖ్యాతి
సిద్దిపేటజోన్: సిద్దిపేట బ్రాండ్‌గా పేరుగాంచిన గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు బిందు చందుళ్ల మాట్లాడుతూ తెలంగాణ కళలను కాపాడుకునే బాధ్యతలో భాగంగా తమవంతు కృషి చేస్తున్నామన్నారు. అమెరికాలో గొల్లభామ చీరల ప్రదర్శన దృశ్యాలు -
ఈ డిజైన్లన్నీ నాటివే!
ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలోని కల్యాణ మంటపానికి పడమటి వైపున ఉన్న లతా మంటపంలోని 40 స్తంభాల్లో ఒక్కొదానికి నాలుగు వైపులా నాలుగు రకాల డిజైన్లతో తీర్చిదిద్దారు. ఇలా మొత్తం 160 డిజైన్ల ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిజైన్లన్నీ ముద్దిరెడ్డిపల్లి, ధర్మవరం, కాంచీపురం తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు నేసిన పట్టు చీరలపై కనిపిస్తున్నాయి. - లేపాక్షి (హిందూపురం)