ఎవర్‌గ్రీన్ డ్రెస్‌గా ఎప్పటికీ శారీ ముందు వరసలో ఉంటుందని తెలిసిందే. అయితే, చీరకట్టు అందం గురించి రొటీన్ మాటలు కాదు..ఇంకాస్త సృజనను జోడించి స్టైలిష్ లుక్ తీసుకురావాల్సిందే అనుకునేవారిని ఇట్టే ఆకట్టుకుంటోంది శారీ ఓవర్ కోట్. పట్టు చీరల మీదకు ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్స్ ధరించడం తెలిసిందే.
కానీ, అవి సంప్రదాయ వేడుకలకే పరిమితం. వెస్ట్రన్ పార్టీలకూ శారీ స్టైల్‌ను పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని హ్యాపీగా ట్రై చేయచ్చు. శారీ మీదకు ఓవర్‌కోట్‌ను ధరించి కాన్ఫిడెంట్ లుక్స్‌తో కలర్‌ఫుల్‌గా వెలిగిపోవచ్చు.
సేమ్ టు సేమ్
శారీ–ఓవర్ కోట్ ఒకే కలర్ ప్యాటర్న్‌లో ఉంటే ఆ స్టైల్ సూపర్బ్ అనిపించకుండా ఉండదు. ఆభరణాల జిలుగులు అవసరం లేని ఈ ప్యాటర్న్ స్టైల్ పార్టీలో ప్రత్యేకంగా వెలిగిపోతుంది.
ధోతీ శారీ
సాధారణంగానే ధోతీ శారీ ఓ ప్రత్యేకమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక దాని మీదకు ఫ్లోరల్ ఓవర్ కోట్ ధరిస్తే ఎక్కడ ఉన్నా మరింత స్పెషల్‌గా కనిపిస్తారు.
ఎంబ్రాయిడరీ కోట్స్
సిల్క్ ప్లెయిన్ శారీస్‌కి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఈ స్టైల్ ధోతీ శారీస్‌కు కూడా వర్తిస్తుంది.
నీ లెంగ్త్ కోట్స్
మోకాళ్ల దిగువ భాగం వరకు ఉండే ట్రాన్స్‌పరెంట్ ఓవర్ కోట్స్ లేదా కేప్స్ నేటి యువతరపు మదిని మరింత ఆత్మవిశ్వాసంగా మార్చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment