
ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఇరువురు అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఆ తదనంతరం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో జెలెన్ స్కీ ధరించిన దుస్తులు హాట్‌టాపిక్‌గా మారాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిని వైట్‌హౌస్‌లో కలిసేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించాలి కదా అంటూ ప్రశ్నలు లేవెనెత్తడం జరిగింది. ఇది అమెరికన్లను అవమానించడమే అంటూ వ్యాఖ్యలు రాగా వాటికి జెలెన్‌స్కీ తనదైన శైలిలో ధీటుగా సమాధానాలిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన ధరించిన దుస్తులు ప్రత్యేకత, డిజైనర్ వంటి వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.
జెలెన్‌స్కీ నల్ల కార్గోప్యాంటు, బూట్లతోపాటు ఉక్రెనియన్ జెండాలో ఉండే త్రిశూలం వంటి చిహ్నలతో కూడిన డ్రెస్‌ని ధరించారు. పైన ధరించిన షర్ట్‌కి మూడు బటన్లు అల్లిన లాంగ్ స్లీవ్ పోలో చొక్కాను ధరించారు. ఆయన వైట్‌హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలకిరిస్తూ..జెలెన్‌స్కీ దుస్తులపై వ్యాఖ్యానించాడు.
ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రియల్ అమెరికాస్ వాయిస్ అనే కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ జెలన్‌స్కీని మీరు సూటు ఎందుకు ధరించలేదు అంటూ ప్రశ్నించాడు. ఈ దేశ కార్యాలయంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు కదా..మరీ ఇలా సూట్ లేకుండా ఎలా వచ్చారంటూ ప్రశ్నలు గుప్పించాడు. అయితే అందుకు జెలెన్‌స్కీ త్వరలో మీకంటే మంచి సూట్ కచ్చితంగా ధరిస్తాను. స్వేచ్ఛను కోరుకుంటున్న తన దేశానికి ప్రతికగా ఈ వస్త్రధారణ అని ధీటుగా బదులిచ్చాడు జెలెన్‌స్కీ. మరీ ఈ దుస్తులని ఇంతలా అర్థవంతంగా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా..!.
ఎల్విరా గసనోవా
ఉక్రేనియన్ డిజైనర్ ఎల్విరా గసనోవా ఈ దుస్తులను రూపొందించింది. ఆమె డామిర్లి బ్రాండ్ పురుషుల దుస్తుల కలెక్షన్ నుంచి పోలో చొక్కా, ప్యాంటుని ధరించారు జెలెన్‌స్కీ.
ఎల్విరా జెలెన్‌స్కీ కోసం ఈ పత్యేక వెర్షన్‌ను డిజైన్ చేసింది. దీన్ని డిజైనర్ 1991లో ఉక్రెయిన్ స్వీకరించిన కోట్ ఆఫ్ ఆర్మ్స్ త్రిశూలం ఉన్న షీల్డ్ ఆధారంగా రూపొందించింది
ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం పోరాటం సాగిస్తున్నా తమ ధైర్యానికి గుర్తుగా జెలెన్‌స్కీ సూట్‌ని కాకుండా ఉక్రెయిన్ బ్రాండ్ డామిర్లి పోలో చొక్కాను ఎంచుకున్నారు. ఇది ఆధునిక యోధుని యూనిఫాం. స్వేచ్ఛ కోసం నిలబడే దేశం అజేయమైన ఆత్మకు చిహ్నం. ఫ్యాషన్ సౌందర్యాన్ని అధిగమించి, ధిక్కరణ, విజయంపై విశ్వాసానికి శక్తిమంతమైన చిహ్నంగానూ, స్వరంగానూ ఉంటుంది ఈ వస్త్రధారణ అని ఎల్విరా సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇక డిజైనర్ ఎల్విరా 2013లో డొనెట్స్క్‌లో తన బ్రాండ్‌ని స్థాపించారు. ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కీ తరచుగా ఈ బ్రాండ్ బట్టలనే ధరిస్తుంటారు. దీన్ని ఆమె ఇద్దరు సభ్యులతో ప్రారంభించింది.
తాను డిజైన్ చేయగలనా అని భయపడింది, కానీ క్రియేటివిటీగా తీర్చిదిద్దడంపై ఆసక్తి పెరిగి తనకు తెలియకుండానే వస్త్రాలు డిజైన్ చేయగలిగానంటోంది. నిజానికి ఆమె దంత వైద్యురాలు అవ్వాలనుకుంది. అయితే అనుకోకుండా డోనెట్స్క్ ఫ్యాషన్ డేలో పాల్గొంది. అక్కడ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారాలని ఫిక్స్ అయ్యి ఈ రంగంలోకి వచ్చింది. ఆమె తొలి ఫ్యాషన్ షో నవంబర్ 01, 2013న జరిగింది. అలా ఆమె ఫ్యాషన్ డిజైనర్ ప్రస్థానం జరిగింది.
Q: "Why don't you wear a suit?"
Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025
(చదవండి: అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!)
Comments
Please login to add a commentAdd a comment