పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్‌ | Like Alia Bhatt Parineeti Chopra Opts Simple Makeup And Mehandi | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: పెళ్లిలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తోన్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు

Published Mon, Sep 25 2023 4:12 PM | Last Updated on Mon, Sep 25 2023 7:20 PM

Like Alia Bhatt Parineeti Chopra Opts Simple Makeup And Mehandi - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.  

దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్‌ అవుట్‌ఫిట్‌లో రాఘవ్‌ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్‌ కలర్‌ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్‌ కలర్స్‌, న్యూడ్‌ మేకప్‌ ట్రెండ్‌ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్‌ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వర​కు.. సింపుల్‌గా, పేస్టల్‌ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

ఒకప్పుడు పెళ్లంటే రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ వంటి సాంప్రదాయ కలర్స్‌ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్‌ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. హెవీ అండ్‌ కాస్ట్‌లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్‌ అండ్‌ క్లాసిక్‌ అనే ట్రెండ్‌ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్‌ మేకప్‌ విత్‌ పేస్టల్‌ కలర్స్‌ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్‌ సెట్‌ చేశారు మన బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు.

ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్‌లోనూ చాలా సింపుల్‌ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్‌ పేస్టల్‌ లెహంగా, చాలా సింపుల్‌ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement