
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్‌బీర్‌కపూర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. గురువారం(ఏప్రిల్14)న రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలను ఆలియా భట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీరిద్దరు ఎంత క్యూట్‌గా ఉన్నారో..ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో కొత్తజంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment