బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గత కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్ధాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినిమాల కన్నా.. ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా ఆమె మారింది. దీంతో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది.
(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీలు,రెస్టారెంట్‌లు అంటూ ఎంజాయ్ చేశారు. అలా పలుమార్లు కెమెరాల కంట కనిపిస్తూ ట్రెండ్ అయ్యారు. ఇలా వారిద్దరూ వైరల్ అయ్యాక కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత పరిణితి చోప్రా హానీమూన్ ప్లాన్‌ను గ్రాండ్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు.
కానీ ఎవరూ ఊహించిని విధంగా భర్త లేకుండానే మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. కానీ ఆమె ఈ వెకేషన్‌కు తన మరదలతో వెళ్లినట్లు ఆమె ఇలా చెప్పుకొచ్చింది. 'నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్' అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి అంటూనే పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment