
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో పలుమార్లు కెమెరాలకు చిక్కారు.
వీరి రిలేషన్‌షిప్‌పై ఎన్నిసార్లు అడిగినా స్పందించని ఈ లవ్‌బర్డ్స్ ఎంగేజ్‌మెంట్ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ వీడియో ప్రోమో ఒకటి బయటకు వచ్చింది.
ఇందులో పరిణీతి తల్లి రాఘవ్ గురించి చెబుతూ.. అతను చాలా మంచివాడని, తండ్రి తర్వాత పరిణీతిని రాఘవ్ చాలా బాగా చూసుకోగలడన్న నమ్మకం తమకు సంపూర్తిగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పరిణీతి ఎమోషనల్ కాగా, రాఘవ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment