Parineeti Chopra, Raghav Chadha Engagement Photos Goes Viral - Sakshi

Parineeti Chopra: నిశ్చితార్థం చేసుకున్న లవ్‌ బర్డ్స్‌.. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు గెస్ట్‌గా..

May 14 2023 7:37 AM | Updated on May 14 2023 11:33 AM

Parineeti Chopra, Raghav Chadha Engagement Photos Goes Viral - Sakshi

నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లో పోస్ట్‌ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్‌ కలర్‌ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్‌ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆప్‌ నేత, ఎంపీ రాఘవ్‌ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు కపుర్తలా హౌస్‌ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లో పోస్ట్‌ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్‌ కలర్‌ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్‌ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్‌కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కాంగ్రెస్‌ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్‌ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! 

వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఎంతగానో వైరల్‌ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది.

చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్‌ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement