
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు తమ ప్రేమను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట.
తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో పరిణీతి-రాఘవ్‌ల నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్స్ వాయిదా వేసుకున్న పరిణీతి పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. ఈనెల 10న వీరి ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టని పరిణీతి-రాఘవల్‌లు రీసెంట్‌గా ముంబైలోని ఓ రెస్టారెంట్ డిన్నర్ డేట్‌కి వెళ్లి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ ఈవెంట్‌కి కూడా జంటగా కలిసొచ్చారు.దీంతో రాఘవ్- పరిణీతి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment