Parineeti Chopra-Raghav Chadha Perform Seva By Washing Dishes - Sakshi
Sakshi News home page

Parineeti Chopra: కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన పరిణీతి

Published Sat, Jul 1 2023 4:34 PM | Last Updated on Sat, Jul 1 2023 4:59 PM

Parineeti Chopra Wash Plates Husband Raghav Chadha - Sakshi

ఆమె బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత నెలలో ఈమెకు నిశ్చితార్థం జరిగింది. త‍్వరలో తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుబోతుంది. అలాంటి ఆమె.. ఇప్పుడు సడన్ గా ఓ చోట ప్రత్యక్షమైంది. కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏం జరిగింది?

ఎవరా బ్యూటీ?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలుసు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేసరి తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'చమ్కీలా' అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో కలిసి 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)

రాఘవ్‌తో పెళ్లి
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో హీరోయిన్ పరిణీతి చోప్రాకు పెళ్లి కుదిరింది. గత కొన్నేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా, బయటపడకుండా చాలా జాగ్రత్తపడ్డారు. గత నెలలో అంటే మే 13న వీళ్లకు నిశ్చితార్థం జరిగింది. దీనికి కొన్ని రోజుల ముందు మాత్రమే.. ఈ జంట గురించి న్యూస్ బయటకొచ్చింది. త్వరలో రాజస్థాన్ లో వీళ్లిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. 

గోల్డెన్ టెంపుల్‌లో
త్వరలో పెళ్లి చేసుకోనున్న పరిణీతి-రాఘవ్.. శనివారం ఉదయం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్(స్వర్ణ దేవాలయం)ని కనిపించారు. దర్శనానంతరం అన్నదాన సత్రంలో ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ఈ ఫొటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవాలయంలో రాఘవ్-పరిణీతి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

(ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement