
ఈ వెబ్ సిరీస్‌లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్‌రాజ్ రావు, జిస్సు సేన్‌గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జ్యోతికను తీసేయాలనుకున్నా..
ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

జ్యోతిక, షబానా అజ్మీ
నా తప్పే..
తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్‌ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది.
చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే?