
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
They're cooking. And it's criminally good 👀 💸
Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025
Comments
Please login to add a commentAdd a comment