Shabana Azmi
-
Jyotika: టాలెంటెడ్ నటి.. తననే తీసేయాలనుకున్నారా? (ఫోటోలు)
-
జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
ఈ వెబ్ సిరీస్‌లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్రాజ్ రావు, జిస్సు సేన్‌గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.జ్యోతికను తీసేయాలనుకున్నా..ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జ్యోతిక, షబానా అజ్మీనా తప్పే..తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్‌ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
జ్యోతిక ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. They're cooking. And it's criminally good 👀 💸 Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025 -
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
ఆందోళనకరంగా దేశంలో పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న పరిణామాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. చరిత్రను తెరమరుగుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠ్యాంశాల నుంచి కొన్ని అధ్యాయాలను తొలగిస్తున్నారు. దీనిని ప్రజలు చూస్తూ ఉండిపోతున్నారు. ఇది విచారించవలసిన విషయం. భారత రాజ్యాంగం అనేది ఎంతో ముఖ్యమైనది.. ప్రధానమైనది. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారతదేశం సెక్యులరిజం, బహుళత్వం అనే పునాదులపై నిలుస్తోంది..’అని పద్మభూషణ్, సీనియర్ నటి షబానా అజ్మీ అన్నారు.శుక్రవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభ ప్లీనరీ ‘ఏ లైఫ్ ఇన్ సినిమా’కార్యక్రమంలో షబానా అజ్మీతో ఫెస్టివల్ డైరెక్టర్ అమితా దేశాయ్ చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు షబానా జవాబిచ్చారు. హింసను ప్రోత్సహించే విధంగా కేరళ స్టోరీ, కశీ్మ ర్ ఫైల్స్ వంటి బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి కదా.. వాటిపై మీ స్పందన ఏమిటని ఒక కాలేజీ విద్యార్థని వేసిన ప్రశ్నకు షబానా పైవిధంగా స్పందించారు.‘మనదేశంలో లెఫ్ట్, రైట్ శక్తుల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. ఈ రెండింటి సిద్ధాంతాలు పూర్తిగా భిన్నం. నిజమైన ప్రజాస్వామ్యంలో అన్నింటినీ అనుమతించాలి. ఉద్రిక్తతలు రెచ్చ గొట్టని సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. నేడు కేవలం పదిమంది ఒక సినిమాకు అభ్యంతరం చెబుతున్నారు. అభ్యంతరం మంచిదే కాని అది హింసకు దారితీయడం ఆమోదయోగ్యం కాదు..’అని షబానా వివరించారు. కమ్యూనిస్టుల మధ్య నా బాల్యం గడిచింది ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ప్రగతిశీల రచయితగా నా తండ్రి ఖైఫీ అజ్మీ ఇక్కడ అజ్ఞాతంలో గడిపారు. కమ్యూనిస్టుపార్టీ నాయకుల మధ్యలోనే నా బాల్యం గడిచింది. చిన్నప్పుడు ప్రతి వేసవిలో హైదరాబాద్‌కు వచ్చేదాన్ని. నగర సంస్కృతి, ప్రగతిశీల సాహిత్యం, చుట్టంతా మేధావులతో నిండిన వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. నా తొలి సినిమా ‘అంకుర్’షూటింగ్ సందర్భంగా ఇక్కడే ఓ గ్రామ (నేటి ఎల్లారెడ్డిగూడ) వాతావరణంలోకి తొలిసారిగా అడుగుపెట్టా.అక్కడి నుంచి స్టీఫెన్ స్పీల్బర్గ్ చిత్రంలోనటించే వరకు నా నట జీవితం కొనసాగింది..’అని షబానా వివరించారు. ముంబయి మురికివాడల్లోని పేదలకు రాజకీయవేత్త శరద్‌పవార్ సహకారంతో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేశానన్నారు. తన తండ్రి ఖైఫీ అజ్మీ ప్రారంభించిన ‘మిజ్వా’ద్వారా ఇప్పటికీ కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా షబానా సినీ జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ 3 నిమిషాల లఘు చిత్రాన్ని నిర్వాహకులు ప్రదర్శించారు. -
#Shyam Benegal శారదకు దక్కని అంకుర్.. షబానాను వరించింది!
ఓల్డ్ అల్వాల్ పోరడు– బి. నరసింగ రావు, దర్శకులుశ్యామ్ బెనగళ్ (Shyam Benegal) కూ నాకూ 12 ఏళ్ల వయసు తేడా ఉంది. ఆయనకు 90 అయితే నాకు 78. మా ఓల్డ్ అల్వాల్‌లో వాళ్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. గతంలో శ్యామ్ అన్నయ్య మధు అందులో ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కనిపించడం లేదు. శ్యామ్ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ల నాన్నకు ఫొటో స్టుడియో ఉండేది. అందులో మేము చిన్నప్పుడు ఫొటోలు దిగేవారం. శ్యామ్ చాలా యాక్టివ్. నిజాం కాలేజీలో (Nizam College) మేగజీన్ ఎడిటర్‌గా ఉండేవాడు. ఫిల్మ్ సొసైటీ నడిపాడు. సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయ్యి వెంటనే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకునేవాడు ఆటలకు. గురుదత్ ఆయనకు కజిన్. బాంబే వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలంటే చార్జీలకు కూడా డబ్బులు లేవు. అప్పుడు మా మిత్రుల్లో అమ్రేష్ అనే అతని అన్న రైల్వేలో ఉండేవాడు. అతను పాస్ ఇస్తే వెళ్లాడు. గురుదత్ ఇంట్లోనే ఉండి సినిమాలు తెలుసుకున్నాడు. ‘అంకుర్’ (Ankur) కథలో హీరోకు మా మిత్రబృందంలోని ఒక వ్యక్తి జీవితమే ఇన్స్పిరేషన్. ‘నీ కథే తీస్తున్నానురా’ అని ఆ మిత్రుడికి చెప్పి మరీ ఆ సినిమా తీశాడు. ఆఫ్కోర్స్... సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడు. తన నిర్మాణ సంస్థకు ‘సహ్యాద్రి ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం శంకరమంచి కథలను దూరదర్శన్ కోసం తీస్తున్నప్పుడు నన్ను కలిశాడు. వాటి నిర్మాణంలో నా మాటసాయం ఉంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆఖరుసారి మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడలేదు. చాలా క్వాలిటీతో ఎక్కువ పని చేసిన దర్శకుడు శ్యామ్. శారదకు మిస్సయిన ‘అంకుర్’ శ్యామ్ బెనగళ్ తన మొదటి సినిమా ‘అంకుర్’లో హీరోయిన్గా వహీదా రెహమాన్‌ను (Waheeda Rehman) అనుకున్నాడు. ఆమె మొదట చేస్తానని తర్వాత నో చెప్పింది. అప్పుడు శారదకు ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుందని ఆమెను సంప్రదించాడు. ఆమెకు కథ నచ్చినా, దక్కనీ భాషలో డైలాగులు చెప్పగలనో లేదో అనే సందేహంతో చేయలేదు. అపర్ణసేన్ కూడా వెనుకా ముందు ఆడటంతో చివరకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన షబానా ఆజ్మీని ఎంచుకున్నాడు. షబానాకు ఒకరకంగా హైదరాబాద్‌తో బంధం ఉన్నట్టే కదా. ఆమె తల్లి షౌకత్ హైదరాబాదీ. షబానా, స్మిత, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి... వీరంతా బెనగళ్ సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించారు.సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్యామ్ బెనగళ్ నివాసం ప్రస్తుత స్థితి -
ప్రముఖ నటి షబానా అజ్మీ ఇంట్లో తారల దీపావళి సందడి (ఫోటోలు)
-
ఆయన్ని ఎప్పటికీ ఆ పని చేయనివ్వను..!
షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా. (పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం). ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా. డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా! -
అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్లో నటించింది. నటుడు ధర్మేంద్రతో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన భర్త అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు వెల్లడించారు.షాబానా అజ్మీ మాట్లాడుతూ..' నాకు ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించా. అయితే ఇందులో లిప్‌లాక్ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ చెప్పాడు. నా భర్త అనుమతి తీసుకొని చెబుతా అని అన్నా. ఇదే విషయంపై నా భర్తను అనుమతి అడిగా. ఆయన చాలా చిన్న విషయం.. దీనికి నా అనుమతి ఎందుకు' అని అన్నారు. ఈ చిత్రంలో నా రోల్ ఎప్పటికీ గుర్తుంటుందని షాబానా తెలిపారు.అయితే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు కరణ్ జోహార్. అయితే సీక్వెల్లో మరికొందరు కొత్తవాళ్లు ఉంటారని కరణ్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. -
బాలీవుడ్ నటీ షబానా అజ్మీ ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!
అంతర్జాతీయ గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి, భారత పార్లమెంటు సభ్యురాలు షబానా అజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటిగా ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులు అందుకుంది. పైగా యూఎస్ గుడ్‌విల్ అంబాసిడర్ కూడా. ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా తన ఫుడ్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ ఒక చోటే బ్రేక్ తీసుకుని మరీ ఇష్టంగా తిన్న తన ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను పూణే నుంచి తిరుగు పయనంలో ఓ ప్రముఖ ఫుడ్ కోర్టు వద్ద ఆగమని, అక్కడ తాను తనకెంతో ఇష్టమైన వడపావ్ ఆస్వాదించనట్లు చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ మహారాష్ట్ర వంటకాలు కూడా చాలా బాగుంటాయని తెలిపారు. ఆమె నటించిన 'కైఫీ ఔర్ మెయిన్' తారాగణంతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చారు షబానా అజ్మీ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో షబానా సినీ స్వర్ణోత్సవం
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్లో గోల్డెన్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు. ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్‌లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. -
ఆమె కంటే నేనేం తక్కువ? నిలదీసిన హీరోయిన్
ఫలానా హీరోతో పని చేయాలని దర్శకనిర్మాతలు కలలు కన్నట్లే ఫలానా ఫిలిం మేకర్స్‌తో పని చేస్తే బాగుండని హీరో హీరోయిన్లు కూడా అనుకుంటారు. అదే విధంగా దర్శకనిర్మాత మీరా నాయర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తహతహలాడింది సీనియర్ కథానాయిక షబానా అజ్మీ. కానీ ఆమె కోరిక నెరవేరనేలేదు.రేఖ, షబానా అజ్మీమీరా డైరెక్ట్ చేసిన 'ద రెలక్టెంట్ ఫండమెంటలిస్ట్'(2012) అనే సినిమాలో కేవలం చిన్న పాత్ర వరించింది. ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తుందనుకుంటే ఏదో చిన్న పాత్ర ఆఫర్ చేసిందని బాధపడింది. దర్శకురాలికి తన మీద నమ్మకమే లేదని విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాలను మీరా నాయర్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. దర్శకనిర్మాత మీరా నాయర్ఆమె మాట్లాడుతూ.. 'ముంబై జుహులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వాష్‌రూమ్‌కు వెళ్తుంటే షబానా నా వెంటే వచ్చింది. నా కంటే రేఖ గొప్పగా చేసిందేముంది? అంటూ రెస్ట్ రూమ్‌లోనే గొడవపెట్టుకుంది. ఎందుకు నాకు పెద్ద రోల్ ఇవ్వవని నిలదీసింది. నిజంగానే ద రెలక్టెంట్.. సినిమాలో షబానాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది.. మరో ప్రాజెక్ట్‌కు తప్పకుండా కలిసి పని చేద్దామని నచ్చజెప్తేగానీ ఊరుకోలేదు' అని మీరా నాయర్ పేర్కొంది. కాగా మీరా.. రేఖతో కలిసి కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ (1996) అనే సినిమా చేసింది. 2012 తర్వాత ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన ఆమె అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో షబానాతో సినిమా చేస్తానన్న హామీ కూడా అటకెక్కింది.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న జంట నిండు నూరేళ్లు కలిసి కాపురం చేయడం గగనమైపోయింది. చాలామంది రెండు మూడేళ్లకే మాకొద్దీ భాగస్వామి అని విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరేమో లేటు వయసులోనూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్లో 40 ఏళ్లుగా ఏ చీకూచింతా లేకుండా అన్యోన్యంగా కలిసి కొనసాగుతున్నారు అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ- గేయ రచయిత జావెద్ అక్తర్.సీక్రెట్ అదే!తాజాగా నటి షబానా తమ వైవాహిక బంధం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేమిద్దరం ఎవరి పనిలో వాళ్లం బిజీగా ఉంటాం. దీనివల్ల మేము తరచుగా కలుసుకోలేము. అందుకే మా వైవాహిక బంధం సక్సెస్ఫుల్ సాగుతుందని జావెద్ అంటుంటాడు. ఆయన తండ్రి, మా నాన్న ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవులు, కమ్యూనిస్టులే! మా పేరెంట్స్ లాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో ఒకే విధంగా ఉంటాయి.మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్సంతోషకరమైన విషయం ఏంటంటే.. మా బంధం అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా ధృడంగా తయారైంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు.. షబానా నా బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి వల్ల ఆ బంధమైతే మారలేదనేవాడు!' అని చెప్పుకొచ్చింది. కాగా జావెద్ అక్తర్ గతంలో హనీ ఇరానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జోయా, ఫర్హాన్ అని ఇద్దరు పిల్లలు సంతానం. హనీతో విడిపోయిన అనంతరం జావెద్ 1984లో షబానాను పెళ్లాడాడు.చదవండి: భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్ హిట్ హారర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే? -
ఆరోజు జరిగినదానికి సినిమాలే మానేద్దామనుకున్నా, రోడ్డుపై ఏడుస్తూ..
రెండు రోజుల క్రితం రిలీజైన బాలీవుడ్ సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిలో ఓ సీన్ సెన్సేషనల్ అవుతోంది. 87 ఏళ్ల వయసున్న స్టార్ నటుడు ధర్మేంద్ర, 72 ఏళ్ల వయసున్న నటి షబానా అజ్మీ లిప్‌లాక్ సీన్లో నటించారు. ఇది సినీప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. అయితే నటనపరంగా అదేమీ తప్పు కాదని వెనకేసుకొస్తున్నారీ సీనియర్ స్టార్స్. తాజాగా షబానా అజ్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చప్పట్లే అని చెప్పి తీరా సమయానికి 'పర్వరీశ్ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది.. కమల్ మాస్టర్ కొరియోగ్రాఫర్.. రిహార్సల్స్ చేద్దామని నేను, అవసరం లేదని ఆయన.. నువ్వు జస్ట్ చప్పట్లు కొడితే సరిపోతుందన్నాడు. బెరుకుగానే సరేనన్నాను. తీరా సెట్లోకి వెళ్లాక రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని డ్యాన్స్ చేయమన్నారు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే అప్పటికే నీతూ సింగ్ రెండుసార్లు ప్రాక్టీస్ చేసి వచ్చింది. నేనేమో చేయలేదాయే! ఏ స్టెప్పుకు ఏ కాలు ముందు వేయాలి? ఏ కాలు వెనక్కు వేయాలి? అనేది అర్థమవక అయోమయానికి లోనయ్యాను. అందరిముందు ఎగతాళి మరీ కఠినమైన స్టెప్పులు కాకుండా సులువైన స్టెప్పులు చెప్పమని అడిగాను. అందుకా కొరియోగ్రాఫర్.. సరే, లైట్స్ ఆఫ్ చేయండి.. ఇప్పుడు నాకు షబానా గారే స్టెప్స్ నేర్పిస్తారు అని వెటకారం చేశాడు. అక్కడ సెట్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందరి ముందు నన్ను ఎగతాళి చేశాడు. చాలా బాధేసింది. సెట్లో నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయాను. కాస్ట్యూమ్ కూడా మార్చుకోకుండానే బయటకు వెళ్లి నా కారు కోసం వెతికాను. కారు కనిపించకపోవడంతో జుహూలో ఉన్న నా ఇంటికి నడిరోడ్డుపై ఏడ్చుకుంటూ కాలినడకన వెళ్లిపోయాను. సినిమాలు మానేద్దామనుకున్నా ఇక మీదట ఏ హిందీ సినిమాలోనూ నటించకూడదనుకున్నాను. ఇంతటి అవమానాన్ని భరించడం నా వల్ల కాదు. ఈ అవమానాలు నేను పడలేను అని బాధపడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఆ తర్వాత డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్ జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ సారీ చెప్పాడు. అయినా సరే ఇప్పటికీ డ్యాన్స్ చేయాలంటే నాకు అదే సంఘటన గుర్తొచ్చి ఎంతో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్, భయం ఏకకాలంలో వస్తాయి' అని చెప్పుకొచ్చింది షబానా. కాగా పర్వరీశ్ చిత్రం 1977లో విడుదలైంది. ఇందులో షబానా అజ్మీతో పాటు అమితాబ్ బచ్చన్, నీతూ సింగ్, షమ్మీ కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: పెళ్లయిన 18 ఏళ్లకు బాలీవుడ్ నటుడు విడాకులు తొమ్మిదో నెల గర్భంతో లహరి.. మరికొద్దిరోజుల్లో డెలివరీ -
87 ఏళ్ల వయసులో లిప్‌లాక్ సీన్.. అవసరమే అంటున్న నటుడు
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఏమని చెప్పగలం? అన్నింటిలోనూ ఒక అడుగు ముందే ఉంటాడు ధర్మేంద్ర. ఆరు దశాబ్ధాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలు చేశాడు. ఇప్పటికీ వెండితెరపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఈయన తాజాగా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో నటించాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 28న విడుదలైంది. ఈ మూవీలో ధర్మేంద్ర, అలనాటి నటి షబానా అజ్మీ.. లిప్‌లాక్ సీన్లో నటించారు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. 87 ఏళ్ల వయసులో ముద్దు సన్నివేశంలో నటించడమేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయారు. కొందరైతే ముసలాడికి దసరా పండగలా ఉంది.. అస్సలు బాగోలేదు అని విమర్శించారు. తాజాగా ఈ సన్నివేశంపై ధర్మేంద్ర స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను, షబానా కిస్ సీన్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసినట్లున్నాం. చాలామంది ఈ సీన్ చూసి చప్పట్లు కూడా కొట్టినట్లున్నారు. మా నుంచి జనాలిది అస్సలు ఊహించి ఉండరు కదా! అందుకే దీనికింతలా రెస్పాన్స్ వస్తోంది. నేను ఇంతకుముందు చివరిసారిగా లైఫ్ ఇన్ ఎ మెట్రో అనే సినిమాలో నఫీసా అలీతో ముద్దు సన్నివేశంలో నటించాను. అప్పుడు కూడా జనాలు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో మా ముద్దు సన్నివేశం గురించి డైరెక్టర్ కరణ్ జోహార్ మాకు ముందే చెప్పాడు. అప్పుడు నేనేమీ అంత సర్ప్రైజ్ అవలేదు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే నేను చేస్తానని చెప్పాను. అయినా రొమాన్స్‌కు వయసుతో పనేంటి? వయసు అనేది కేవలం నెంబర్స్ మాత్రమే సూచిస్తాయి. ఏ వయసు వాళ్లైనా ఇద్దరి మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు. ఈ సీన్లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బందిగా ఫీలవలేదు' అని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర. చదవండి: ప్రేమకో దండం.. బ్రేకప్ చెప్పిన రీతూ వర్మ ఆ సినిమాకు రూ.250 కోట్లా? దాన్నెవరు చూస్తారు?: కంగనా -
వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్, స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షబానా అజ్మీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు ముందుకు వస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగినా వీరికి పట్టదు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు. అలాగే, వీరంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ.. దీన్ని నాగరికత, సెక్యులర్ అని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్ ఏజెంట్స్ అంటూ విమర్శించారు. అదే సమయంలో వీరిని అవార్డ్ వాప్సీ గ్యాంగ్ అని కూడా అన్నారు. शबाना आजमी, नसीरुद्दीन शाह जैसे लोग टुकड़े-टुकड़े गैंग के स्लीपर सेल के एजेंट है जो सिर्फ भाजपा शासित राज्यों में हुई घटनाओं पर ही हल्ला मचाते हैं, जबकि कांग्रेस शासित राजस्थान और झारखंड जैसे राज्यों में हो रही घटनाओं पर मौन रहते हैं। अब ऐसे लोगों की कलई खुल चुकी हैं। pic.twitter.com/fPpaTLKbzx — Dr Narottam Mishra (@drnarottammisra) September 2, 2022 -
Shabana Azmi Birthday: పెద్దగా కోరికలేవీ లేవు..కానీ ఇంకా కావాలి!!
-
Shabana Azmi birthday special: వన్ అండ్ ఓన్లీ మాస్టర్ పీస్
సాక్షి, హైదరాబాద్: వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. ముందుతరం నటీ నటులకు ఆమె ఒక నిఘంటువు. ఒక చిన్న ముఖ కవళిక, అంతకుమించిన విషాదపు విరుపు, కంటినుంచి జారీ జారని నీటి చుక్క.. ఒకపంటి మెరుపు ఇవి చాలు నటనకు అని చాటిచెప్పిన గొప్ప నటి షబానా అజ్మీ. ఏకకాలంలో 12 చిత్రాలలో పని చేసిన ఘనత ఆమె సొంతం. మన హైదరాబాదీ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ షూటింగ్ సమయంలో గంటల తరబడి వేచి చూడటం అంటే తనకు ఎపుడూ ఇబ్బంది కాలేదనీ ఎందుకంటే నిర్మాతలకు మనం ఒక ఎసెట్‌గా ఉండాలి తప్ప, భారంగా ఉండకూడదనేది తల్లి ఫౌకత్నుంచినేర్చుకున్న గొప్పపాఠం అంటారామె. తానొక గొప్పనటిగా చెప్పుకోను, సరైన సమయంలో సరైన అవకాశాలు దొరకడం తన అదృష్టం. ఈ ఘనత అంతా తనకు లభించిన చక్కటి శిక్షణ, స్క్రిప్ట్, గొప్ప దర్శకులకే దక్కుతుందన్నారు. సినిమా అనేది సంయుక్త కృషి అసలు సినిమా కథకు మించి ఏ యాక్టర్ ఎదగలేడంటూ స్క్రిప్ట్‌కు పెద్ద పీట వేశారామె. అలాగే సద్విమర్శలను జాగ్రత్తగా గమనించడంతోపాటు తనన పనిని తాను నిజాయితీగా అంచనా వేసుకుంటానంటారు షబానా. సాధించినదానికి పొంగిపోకుండా ఉండాలని ఎప్పటికే భావిస్తున్నాను ఎందుకుంటే నటన అంటే ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడమే అంటారు. యువతకు స్వేచ్ఛ నివ్వాలని, వారి అభిపప్రాయాలను గౌరవించాలంటారు. తమ తల్లిదండ్రులు తనకు, తనసోదరుడు బాబా (సినిమాటోగ్రాఫర్, బాబా అజ్మీ) అలాగే పెరిగామని, అడగకుండా ఎపుడూ ఎలాంటి సలహా ఇవ్వలేదని ఇపుడు తానూ అదేఆచరిస్తున్నానన్నారు. యువత నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని తానునమ్ముతానన్నారు. సైకాలజీని అవపోసన పట్టిన షబానా పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఈజీ అయింది. బార్బరా స్ట్రీసాండ్ ఏ స్టార్ ఈజ్ బోర్న్లో చెప్పినట్లుగా నాకు పెద్దగా కోరికలు లేవు....కానీ ఇంకా చాలా కావాలి. పాడతా.. అన్నీ కావాలి..భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను సాగిస్తున్న షబానా అజ్మీ తొలి వెబ్ సిరీస్ ‘ది ఎంపైర్’ ఓటీటీలో సందడి చేస్తోంది. -
వాస్తవిక నటి.. షబానా ఆజ్మీ @ 72
పది డైలాగులు అవసరమైన చోట ఒక ముఖ కవళిక. పెద్దగా అరవాల్సిన చోట ఒక లోగొంతుక. భోరున విలపించాల్సిన చోట కంటి నుంచి జారని నీటి చుక్క. పగలబడి నవ్వాల్సిన చోట పంటి మెరుపు... ఇవి నటన అని చూపించిన నటి షబానా ఆజ్మీ. ఆమె వల్ల స్త్రీ పాత్రలు తెరపై వాస్తవికంగా కనిపించాయి. ఆమె వల్ల కథలు నిజంగా నమ్మించాయి. ఆమె కొంతమంది నటీనటులకు నటగ్రంథం అయ్యింది. ఆమెను భారతీయ వెండితెర సదా గౌరవంగా చూస్తుంది. మన హైదరాబాద్ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతోంది. చూడండి ఎలా హైదరాబాద్‌తో ఆమె జీవితం ముడిపడిందో. 1950 సెప్టెంబర్ 18న ఇక్కడే పుట్టిందామె. తల్లి షౌకత్ ఆజ్మీది హైదరాబాద్ కనుక కాన్పుకు పుట్టింటికి రావడంతో ఇక్కడే నాలుగు నెలలు ఊపిరి పీల్చింది. ఆ తర్వాత ముంబై చేరుకుంది. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ఆమెకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి కె.ఏ.అబ్బాస్ ‘ఫాస్లా’, రెండు కాంతిలాల్ రాథోడ్ ‘పరిణయ్’. కాని రెంటి కంటే ముందు తొలిసినిమాగా ‘అంకుర్’ విడుదలైంది. శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఆ కథే ఆమె తొలి కథ అయ్యింది. అందులోని గ్రామీణురాలు లక్ష్మి ఆమె తొలి పాత్ర అయ్యింది. దక్కనీ ఉర్దూ ఆమె తొలి సంభాషణ అయ్యింది. తొలి జాతీయ అవార్డు కూడా ఆ సినిమాతోనే వచ్చింది. హైదరాబాద్ గాలి హైదరాబాద్ అమ్మాయికి గొప్ప ప్రారంభం ఇచ్చింది. తండ్రి కైఫీ ఆజ్మీ కమ్యూనిస్టు కవి. షౌకత్ ఆజ్మీ ‘ఇప్టా’ సభ్యురాలు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకూ షబానా ఆజ్మీ ముంబైలో రెడ్‌ఫ్లాగ్ హౌస్‌లో ఉండేది. అంటే 8 కమ్యూనిస్టు కుటుంబాలు ఉండే చిన్న భవనం అన్నమాట. దానికి ఒకటే టాయ్‌లెట్. ఒకటే బాత్రూమ్. కాని వాళ్లంతా కలిసి మెలిసి జీవించేవారు. కైఫీ ఆమెకు ఆ వయసులో ఒక నల్లటి బొమ్మ తెచ్చి ఇచ్చాడు. షబానా ఆ బొమ్మను చూసి ‘నా ఫ్రెండ్స్ అందరి దగ్గర తెల్లటి బొమ్మలున్నాయి’ అనంటే ఆయన ‘నలుపు కూడా అందమైనదే. నీకు ఆ సంగతి తెలియాలి’ అని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆమె పెరిగింది. ఇంటికి ఎప్పుడూ వచ్చేపోయే కవులు... పార్టీ సభ్యులు. షబానాకు పేరు పెట్టక ఇంట్లో ‘మున్నీ’ అని పిలుస్తుంటే ఇంటికి వచ్చిన కవి అలీ సర్దార్ జాఫ్రీ ‘ఇంకా పేరు పెట్టకుండా ఏమిటయ్యా’ అని తనే షబానా అని పేరు పెట్టాడు. ఆమె తోటి స్నేహితురాళ్లు ఫ్యాంటసీ బొమ్మల పుస్తకాలు చదువుతుంటే షబానాకు రష్యా నుంచి వచ్చే పుస్తకాలు చదవడానికి దొరికేవి. తండ్రి వల్ల సాహిత్యం తల్లి పృధ్వీ థియేటర్లో పని చేయడం వల్ల నటన ఆమెకు తెలిశాయి. పృథ్వీ థియేటర్లో నాటకం వేస్తే గ్రూప్‌లో ఒకరిగా స్టేజ్ ఎక్కేసేది. స్కూల్లో కూడా స్టేజ్ వదిలేది కాదు. కాలేజీలో చేరితే అక్కడ కేవలం ఇంగ్లిష్ థియేటరే నడుస్తూ ఉంటే తన సీనియర్ అయిన నటుడు ఫరూక్ షేక్‌తో కలిసి హిందీ డ్రామా ప్రారంభించింది. అన్ని పోటీల్లో ప్రైజులు కొట్టేది. షబానాకు తాను నటించగలనని తెలుసు. కాని నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్న సందర్భం వేరు. షబానా ఆజ్మీ ఒకసారి జయ భాదురి నటించిన ‘సుమన్’ అనే సినిమా చూసింది. అందులో జయ భాదురి నటన కొత్తగా అనిపించింది. ‘ఈమెలాగా నేనూ నటిని కావాలి’ అనుకుని తండ్రితో చెప్పి, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానంటే ‘నువ్వు ఏ రంగమైనా ఎంచుకో. కాని అందులో బెస్ట్‌గా నిలువు’ అని ఆయన అన్నాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షబానా నటిగా తొలిరోజుల్లోనే అందరి దృష్టిలో పడింది. పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంకుర్’ కూడా అలాగే వచ్చింది. నగరమే తప్ప పల్లెటూరు చూసి ఎరగని షబానా ‘అంకుర్’ కోసం చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. మడమల మీదుగా చీర కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్న పల్లెటూళ్లలో అలా ఉండే స్త్రీలను గమనించింది. అంతవరకూ ఆమెకు మునికాళ్ల మీద కూచోవడం రాదు. ‘లక్ష్మి’ పాత్ర వంట చేయాలన్నా పనులు చేయాలన్నా మునికాళ్ల మీద కూచోవాలి. అందుకని శ్యాం బెనగళ్ ఆమెను ‘నువ్వు మునిగాళ్ల మీద కూచుని భోం చేయ్’ అని డైనింగ్ టేబుల్ మీద కూచోనిచ్చేవాడు కాదు. ‘అంకుర్’ సినిమాలో షబానా తన నడక, మాట తీరు, ముఖ కవళికలు వీటన్నింటితో లక్ష్మి పాత్రను గొప్పగా తెర మీద ప్రతిష్టించింది. ఆ సినిమా వేసిన అంకురం అతి త్వరగానే మహా వృక్షమైంది. ఒక కాలం అది. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ... వీళ్లు భారతీయ పారలల్ సినిమాకు ఊతంగా నిలబడ్డారు. వీరే పునాది, వీరే గోడలు, వీరే పైకప్పు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీల మధ్య పోటీ ఉండేది. కాని ఎవరికి వారు తమ పాత్రలలో చెలరేగి ఎవరు గొప్పో చెప్పడం కష్టం చేసి పెట్టేవారు. శేఖర్ కపూర్ ‘మాసూమ్’ లో భర్త అక్రమ సంతానాన్ని అంగీకరించేందుకు మథన పడే భార్యగా షబానా గొప్ప నటన ప్రదర్శించింది. మహేశ్ భట్ ‘అర్థ్’లో మరొక స్త్రీ ఆకర్షణలో పడిన భర్త గురించి ఆమె పడిన సంఘర్షణ ప్రేక్షకులను కదిలించింది. శ్యామ్ బెనగళ్ ‘మండీ’, మృణాల్‌సేన్ ‘ఖండర్’, గౌతమ్‌ఘోష్ ‘పార్’... దర్శకులు ఆమె వల్ల ఆమె దర్శకుల వల్ల భారతీయ సినిమాను ఉత్కృష్ట ప్రమాణాలకు చేర్చారు. దీపా మెహతా ‘ఫైర్’, శాయి పరాంజపె ‘స్పర్శ్’, సత్యజిత్ రే ‘షత్రంజ్ కే ఖిలాడీ’, తపన్ సిన్హా ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ ఆమెను తలిస్తే తలువబడే సినిమాలు. తెలుగు దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్ రాగా’లో క్లాసికల్ సింగర్‌గా నటించిందామె. మూస తల్లి పాత్రలు, మూస వదిన, అత్త పాత్రలు ఆమె ఏనాడూ చేయలేదు. ఆమెకు పాత్ర రాసి పెట్టి ఉండాలి. పాత్రకు ఆమె రాసి పెట్టి ఉండాలి. ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ఫకీరా’ వంటి కమర్షియల్ సినిమాలు చేసినా ఆమె అందుకు పుట్టలేదు. ఆ తర్వాత ఆ దారి పట్టలేదు. షబానా ఆజ్మీ గీతకర్త జావేద్ అఖ్తర్‌ను వివాహం చేసుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంది. తండ్రి పేరు మీద ఆయన స్వగ్రామంలో స్త్రీల కోసం ఉపాధి కల్పనా కేంద్రాలను తెరిచింది. ఆమెకు ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. షబానా వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. దాని మెరుపులు మరిన్ని కొనసాగాలి. -
ఏడేళ్ల ప్రేమకు బ్రేక్ పడింది..
తుఝ్సే నారాజ్ నహీ జిందగీ.. హైరాన్ హూ మై, హో హైరాన్ హూ మై తెరే మాసూమ్ సవాలోంసే పరేషాన్ హూ మై, హో పరేషాన్ హూ..(జీవితమా నీ మీద అలకలేదు కాని ఆశ్చర్యమేస్తోంది.. నీ అమాయకమైన ప్రశ్నలతో ఆందోళన కలుగుతోంది) అనే పాట ‘మాసూమ్’ అనే సినిమాలోనిది. నటి షబానా ఆజ్మీ.. దర్శకుడు శేఖర్ కపూర్. ఈ వారం విఫల ప్రేమ గాథ ఆ ఇద్దరిదే. బ్రేకప్ తర్వాత ఆ ఇద్దరి పరిస్థితి ఆ గీతాలాపనే. షబానా ఆజ్మీ.. కైఫీ ఆజ్మీ, షౌకత్‌ల కూతురు అని తెలిసిందే. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా), ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌కు సారథ్యం వహించడంతోపాటు సినిమా రంగంతోనూ అనుబంధం ఉన్నవారే. షబానాకు నటన వారసత్వంగా అబ్బినా, అవకాశాలను మాత్రం ప్రతిభతోనే అందిపుచ్చుకుంది. అలా 1974లో శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో ‘అంకుర్’తో సినిమాల్లోకి వచ్చింది. అదే యేడు ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లోనూ నటించింది. అందులో ఒక హీరో.. శేఖర్ కపూర్. అతను.. చిత్రరంగ ప్రవేశం చేసే ముందు వరకు శేఖర్ కపూర్ లండన్‌లో చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నాడు. సాహిత్యంలోనూ మంచి పట్టున్నవాడు. వృత్తి కన్నా ప్రవృత్తిని బాగా ప్రేమించేవాడు. పేరుకే అంకౌట్స్ కాని చిత్తమంతా బాంబే సినిమా మీదే ఉంది. శేఖర్ కపూర్ మనసు అతని మేనమామ దేవానంద్‌కు తెలుసు. మామ నుంచి పిలుపు వచ్చేలోపే బాంబేలో వాలిపోయాడు శేఖర్ కపూర్. మోడలింగ్ మొదలుపెట్టాడు. సినిమాల్లో అవకాశాల పోరాటమూ చేస్తున్నాడు. అప్పుడే దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’ సినిమా ప్రారంభించాడు. అందులోని మూడు జంటల్లో షబానా, శేఖర్ కపూర్‌ను ఒక జతగా ఖాయం చేశాడు. మూవీ సెట్స్‌లో ఆ ఇద్దరి మధ్యా ఇష్క్ మొదలైంది. షబానా చురుకుదనం అతణ్ణి ఆకర్షించింది. అతని పరిజ్ఞానం, ఆధునిక ఆలోచనా శైలి ఆమెకు నచ్చాయి. ఆ ఇష్టం..స్నేహంగా మారి ప్రేమగా బలపడి .. ఇద్దరూ కలిసి ఉండేంతగా స్థిరపడింది. ఆ సహజీవనం మీడియాకు కావల్సినన్ని గాసిప్స్నిచ్చింది. ప్యాకప్.. బ్రేకప్.. కాలం గడుస్తోంది. శేఖర్, షబానా లవ్ లైఫ్ హ్యాపీగా సాగుతోంది కాని శేఖర్ యాక్టింగ్ గ్రాఫే ముందుకు సాగట్లేదు. అతను హీరోగా నటించిన ఆరు సినిమాలూ కమర్షియల్ ఫ్లాప్. ఇటు షబానాకు నటిగా మంచి గుర్తింపు వచ్చేసింది. కథానాయికగా డిమాండ్ కూడా పెరిగింది. ఏం జరిగిందో తెలియదు ఆ ఇద్దరి ఏడేళ్ల ప్రేమ, సాహచర్యానికి బ్రేక్ పడింది. ఒకే చూరు కింద ఉంటున్న ఆ జంట వేరుపడింది. అయినా చెలిమిని కొనసాగించారు. శేఖర్ కపూర్ నటన నుంచి దర్శకత్వం వైపు రూటు మార్చుకున్నాడు. ‘మాసూమ్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అందులో హీరోయిన్గా షబానానే తీసుకున్నాడు. అలా వాళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతోనే ఉంది.. ఎవరి జీవితాల్లో వాళ్లు సెటిల్ అయినా! దిల్ చాహ్తా హై ప్రేమ వైఫల్య విషాదాన్ని మరిచిపోవడానికి సినిమాలతో బిజీ అయిపోయింది షబానా. ఆ టైమ్‌లోనే జావేద్ అఖ్తర్ ఉర్దూ కవిత్వంలో మరింత పట్టు సాధించడం కోసం షబానా వాళ్ల నాన్న కైఫీ ఆజ్మీ దగ్గరకు వస్తూండేవాడు. తన తండ్రితో జావేద్ చేసే సాహిత్య, ఫిలాసఫీ చర్చల్లో ఆమే పాల్గొనేది. ఆమె ఆత్మవిశ్వాసం, అవగాహన, స్పష్టమైన అభిప్రాయ ధోరణి విపరీతంగా నచ్చేశాయి జావెద్‌కు. తన పట్ల అతను ఆసక్తి చూపిస్తున్నాడని షబానాకు అర్థమైనా పట్టించుకోలేదు. కారణం.. అప్పటికే జావేద్ వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రీ కావడమే. కాని జావేద్‌కు అవేవీ అడ్డం కాలేదు షబానా మీద ప్రేమను ప్రకటించడానికి. ప్రకటించి షబానాను ఒప్పించడానికి. ఈ ప్రేమా బాలీవుడ్లో గుప్పుమంది. ఆ నాటికే జావేద్‌కు సలీమ్‌తో జంట రచయితగా మంచి పేరు వచ్చింది. షోలే లాంటి హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హనీకి తెలిసి... జావేద్ అఖ్తర్ తొలి ప్రేమ హనీ ఇరానీ. ఆమె కూడా నటే. సీతా ఔర్ గీతా సమయంలో ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లల (జోయా, ఫర్హాన్)తో బిజీ అయిపోయింది హనీ. జావేద్ రహస్య ప్రేమ ఆమె దాకా చేరింది. పెద్దగా వాదులాడలేదు హనీ. పిల్లలు డిస్టర్బ్ అవుతారని. వాళ్లకు తండ్రి మీద అయిష్టత ఏర్పడకూడదని. ఈ వ్యవహారం ఇటు షబానా ఇంట్లోనూ తెలిసింది. కైఫీ ఆజ్మీ అభ్యంతరపెట్టాడు. ఇంకో ఆడబిడ్డ కాపురం కూల్చిన నింద తన కూతురు మీద పడొద్దని. నిజానికి జావేద్ జీవితంలోకి షబానా ప్రవేశించే వరకు జావేద్, హనీలది కలతలు లేని కాపురమే. లేమిలో జావేద్‌కు నైతిక అండగా నిలిచింది హనీ. ఆ విషయాలన్నీ కైఫీకి తెలుసు. అందుకే కూతురిని వారించాడు. తన వల్ల జావేద్ విడాకులు తీసుకోవట్లేదని తండ్రిని ఒప్పించింది షబానా. విడాకులతో హనీకి అల్విదా చెప్పి నిఖాతో షబానాకు తోడయ్యాడు జావేద్. ‘జావేద్, షబానాల పట్ల నా పిల్లల మనసుల్లో వ్యతిరేకత నాటడం నాకు ఇష్టంలేదు. పిల్లలకు జావేద్ దూరం కావద్దని కోరుకున్నానంతే. షబానాను శత్రువుగా చూడలేదు. ఫ్రెండ్‌గానూ దగ్గర కాలేదు. నా పిల్లలకు మాత్రం ఆమె అత్యంత ఆప్తురాలు. వాళ్లు నన్నెలా ప్రేమిస్తారో, గౌరవిస్తారో షబానానూ అంతే ప్రేమిస్తారు. గౌరవిస్తారు’ అని చెప్తుంది హనీ ఇరానీ. ∙ఎస్సార్ -
రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై సీనియర్ నటి షబనా ఆజ్మీ ఘాటుగా స్పందించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న కంగనాపై షబనా తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధానంగా బాలీవుడ్‌కు తానే స్త్రీవాదాన్ని, జాతీయవాదాన్ని నేర్పించానన్న కంగనా వ్యాఖ్యలపై షబనా స్పందించారు. కంగనా తన సొంత పురాణాన్ని విశ్వసించడం మొదలు పెట్టిందనీ, తన మాయలో తాను బతుకుతోందని విమర్శించారు. ఇకనైనా వీటికి స్వస్తి చెప్పి తన పని తాను చేసుకుంటే మంచిదని కంగనాకు సూచించారు. అంతేకాదు రోజూ వార్తల హెడ్ లైన్స్ లో లేకపోతే ఆమెకు భయం.. అందుకే ఎపుడూ వార్తల్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, దారుణమైన ప్రకటనలు చేస్తుందంటూ కంగనాపై మండిపడ్డారు. ఆమె చాలా బాగా నటిస్తుంది...నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదంటూ కంగనాకు షబనా ఆజ్మీ హితవు పలకడం విశేషం. ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డ్రగ్ మాఫియా’, టెర్రరిస్టుల నుంచి బాలీవుడ్‌ను రక్షించాలన్న కంగనా వ్యాఖ్యలను షబానా తిప్పికొట్టారు. చిత్ర పరిశ్రమకు తన కుండే సమస్యలున్నాయని, కానీ మొత్తం పరిశ్రమను ఒకే గాటన కట్టడం అన్యాయమన్నారు. సామాజికంగా నిబద్ధతతో మాట్లాడేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని షబనా పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్ళించే క్రమంలోనే ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో యాంటి నేషనల్ అంటూ షబనా ఆజ్మీపై విమర్శలు గుప్పించిన కంగనా ఆమె భర్త జావేద్ అక్తర్ పై కూడా ఆరోపణలు చేసింది. కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం, మాదక ద్రవ్యాలవినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని నిరూపించలేని రోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటానని కంగనా గతంలో ప్రకటించారు. అయితే తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని వైద్యుల బృందం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద దుమారమే రేగుతోంది. -
వైరల్ ఫొటో: మా తుజే సలాం!
ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు మరేదీ సాటిరాదు. నవమోసాలు మోసి, తన ప్రాణాలు పణంగా పెట్టి కన్న బిడ్డల కోసం తల్లి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. తన రక్తాన్ని పాలలా మార్చి పాపాయిల ఆకలి తీర్చే మాతృమూర్తి, వాళ్లను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. అయితే పిల్లల కేరింతలు, ఆటపాటలు చూసి మురిసిపోయే భాగ్యం మాత్రం కొందరు తల్లులకే దక్కుతుంది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించే వీలు దొరుకుతుంది. ముఖ్యంగా సగటు భారతీయ స్త్రీలకు కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండవు. పేదరికంలో మగ్గే మహిళలు గర్బం దాల్చింది మొదలు బిడ్డల్ని కనేంత వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: వయసులో చిన్నది.. ఔదార్యంలో గొప్పది) డెలివరీకి ముందు, ఆ తర్వాత కూడా తమ పనులు తాము చక్కదిద్దుకోవడంతో పాటుగా బిడ్డల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. కాస్తైనా విశ్రాంతి దొరికే పరిస్థితి ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోను బాలీవుడ్ ప్రముఖ నటి ట్విటర్లో షేర్ చేశారు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న ఓ మహిళ ఓవైపు నెత్తిపై ఇటుకలు మోస్తూనే, మరోవైపు వస్త్రాన్ని ఉయ్యాలగా మార్చి తన బిడ్డను వీపున గట్టుకున్న ఆ ఫొటోకు..‘మా తుజే సలాం’ అంటూ క్యాప్షన్ జతచేసి తల్లి ప్రేమకు నీరజనాలు అర్పించారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ఫొటో ఇప్పటికే 10 వేలకు పైగా లైకులు సాధించి, రీట్వీట్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తల్లిప్రేమను గుర్తు చేసుకుంటూ, షబానా అజ్మీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. Ma tujhe salaam 🙏 pic.twitter.com/xzyY4Rz1k8 — Azmi Shabana (@AzmiShabana) September 23, 2020 -
యాక్సిడెంట్ తర్వాత తొలి ఫొటో..
ముంబై : అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ జనవరి 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు వారాలపాటు కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందిన షబానా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన షబానా తన తాజా ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులకు, ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే హాస్పిటల్లో తనకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్న నీతా అంబానీ, కోకిలాబెన్ అంబానీలతోపాటు వైద్యులకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై షబానా ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం జనవరి 18న ప్రమాదానికి గురైంది. డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే షబానాను నవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆస్పత్రికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువరు బాలీవుడ్ ప్రముఖలు హాస్పిటల్లో షబానాను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. Thank you all for your prayers and wishes for my https://t.co/A21IxD7Usd back home now Thank you #Tina Ambani and Kokilaben Ambani hospital for the sterling care provided by the doctors team and the nursing staff. Im indebted and grateful🙏 pic.twitter.com/6a1PWsGKnn — Azmi Shabana (@AzmiShabana) February 1, 2020 -
నటిపై అభ్యంతకర వ్యాఖ్యలు.. టీచర్ సస్పెన్షన్
నోయిడా: బాలీవుడ్ నటి షబానా అజ్మీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..దాద్రిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సదరు మహిళ(50) ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. షబానా అజ్మీ కారు ప్రమాద సంఘటన నేపథ్యంలో ఉపాధ్యాయురాలు.. అజ్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపేలా వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారి బాల్ ముకుంద్ మాట్లాడుతూ.. ‘సదరు ఉపాధ్యాయురాలి చర్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులపట్ల చెడు ప్రభావం చూపేవిధంగా ఉందని అన్నారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశామని తెలిపారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 18న మహారాష్టలోని రాయ్‌గడ్ ముంబై-పుణే హైవే రోడ్డుపై షబానా ఆజ్మీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఫేస్బుక్ పోస్టుకు అజ్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఉపాధ్యాయురాలు కామెంట్ పెట్టింది. -
షబానా అజ్మీ డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి షబానా అజ్మీ కారు డ్రైవర్ అమ్లేష్ యోగేంద్ర కామత్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిదంటూ ట్రక్ డ్రైవర్ రాజేష్ పాండురంగ విఠల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం తన ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో వేగంగా ఢీకొట్టినట్లు అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో షబానా అజ్మీకి తీవ్ర గాయాలు) కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ముందుగా ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ చిన్న గాయాలతో బయటపడ్డారు. మరోవైపు షబానా అజ్మీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. -
షబానాకు బాలీవుడ్ ప్రముఖల పరామర్శ
సాక్షి, ముంబై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. శనివారం రాత్రి సమయంలో గాయపడ్డ ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెను జావెద్ అక్తర్, ఫరాన్ అక్తర్, ప్రముఖ నటి టబు, అనిల్ కపూర్, సునీత కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇదివరకే ట్వీట్ చేశారు. (రోడ్డు ప్రమాదంలో షబానాకు గాయాలు) -
రోడ్డు ప్రమాదంలో షబానాకు గాయాలు
ముంబై: అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ (69) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, ఆమె భర్త, గీత రచయిత జావేద్ అఖ్తర్ (75) ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే షబానాను నవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆస్పత్రికి మార్చారు. ఆర్యోగ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను టాగ్ చేస్తూ.. ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవే దారుణంగా ఉందని, మరమ్మతు చేయాలని సూచించారు. -
‘అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచొద్దు’
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయమై పునర్ ఆలోచించాలని బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షాతో పాటు దేశంలోని వందకు పైగా ముస్లిం ప్రముఖులు కోరారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచితే ముస్లిం కమ్యూనిటీకి హాని కలుగుతుందని అభిప్రాయపడుతూ మంగళవారం వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు విషయమై మరోసారి ఆలోచించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇందులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాయర్లు, పత్రికా విలేకరులు, సామాజిక కార్యకర్తలు, నటులు, వ్యాపారవేత్తలు, సంగీతకారులతో పాటు విద్యార్థులు ఉన్నారు. అయోధ్య వివాదాన్ని సజీవంగా ఉంచడం ద్వారా భారత ముస్లిం సామాజిక వర్గానికి హాని కలుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో సినీ రచయిత అంజుమ్ రాజ్బలి, జర్నలిస్ట్ జావేద్ ఆనంద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కాగా అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించిన సంగతి విధితమే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) నవంబర్ 17న ప్రకటించింది. -
కామెడీ కార్పెట్
జీవితంలోని హాస్యాన్ని నలుగురికీ పంచుతుండే ప్రముఖ సామాన్యురాలు షబానా అజ్మీ. బహుశా ఈ స్వభావం ఆమెకు ఆమె తండ్రి కైఫీ అజ్మీ నుంచి వచ్చి ఉండాలి. ఆయనా అంతే, మానవ తప్పిదాల వల్ల ఒనగూడే స్వల్ప ఆనందాలను అప్పుడప్పుడూ ఆయన తన కవిత్వంలోంచి ఒంపి ప్రపంచానికి పంచుతుంటారు. షబానా గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. అదొక సైన్బోర్డ్ ఫొటో. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్లు 2015లో ముంబై విమానాశ్రయంలో పెట్టిన బోర్డ్ అది. అప్పుడు దాన్ని ఫొటో తీసుకుని ఉంచుకున్నారో ఏమో.. షబానా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. వెంటనే వేల లైకులు, కామెంట్స్ వచ్చి పడ్డాయి. సైన్బోర్డ్ వైరల్ అవడం మొదలుపెట్టింది. అందులో ఇంగ్లిష్ లో ‘ఈటింగ్ కార్పెట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్’ అని ఉంది. షబానాకు ఏమీ అర్థం కాలేదు. ‘కార్పెట్‌ను తినడం నిషిద్ధం’ అని రాశారేమిటి అనుకున్నారు. తర్వాత పైన హిందీలో ఉన్న నిషిద్ధాన్ని చదివారు. ఫర్శ్ పర్ ఖానా సఖ్త్ మనా హై... (కార్పెట్ మీద తినడం నిషిద్ధం) అని ఉంది. అప్పుడు కానీ షబానాకు విషయం అర్థం కాలేదు.. ‘కార్పెట్‌పై పడేలా తినకూడదు’ అని దాని భావం అని. అప్పటి ఆ ఫొటోను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘రియల్లీ’ అని కామెంట్ పెట్టారు షబానా. ఎప్పుడూ సేవాకార్యక్రమాల్లో ఉండే షబానా.. ఇలాంటివి కనిపించినప్పుడు, గుర్తొచ్చినప్పుడు సరదాగా షేర్ చేస్తూ ఉంటారు. -
‘మీ భార్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’
‘గజల్ కింగ్’గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి నేడు. భౌతికంగా దూరమైనప్పటికీ.. ‘తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో’ పాటకు గాత్రదానం చేసిన ఆయన.. నేటికీ అభిమానుల మనస్సులో సజీవంగా ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన శ్రావ్యమైన గొంతుతో ఎంతో మందికి ఊరట కలిగించిన జగ్జీత్ జీవితంలో మాత్రం విషాదఘటనలే ఎక్కువగా ఉండటం విచారకరమైన అంశం. కాగా గురువారం నాటికి జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఎనిమిదేళ్లు అయిన సందర్బంగా సగటు అభిమానులతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ‘ నా గాయాలను తన గొంతులో పలికించారు. ఆర్త్ సినిమా పాటలు ఇంకా నా గుండెలో నిలిచే ఉన్నాయి. నా జీవితాన్ని సార్ధకం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ జగ్జీత్ సింగ్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 1982లో మహేష్ భట్ దర్శకత్వంలో షబానా అజ్మీ, కుల్‌భూషణ్ కర్బందా, స్మితా పాటిల్, రోహిణి హట్టంగడి తదితర తారాగణంతో తెరకెక్కిన ఆర్త్ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. భర్త వదిలేసిన స్త్రీగా, ఒంటరి మహిళగా షబానా అద్భుత నటనకు.. జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్ సంగీతం అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తొలుత జగ్జీత్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడని చిత్రా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భార్యగా ఆయన జీవితంలో అడుగుపెట్టడం విశేషం. 1967లో ప్రారంభమైన జగ్జీత్-చిత్రాల పరిచయం క్రమేపీ బలపడి ప్రేమ బంధానికి దారితీసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేసిన వీరు ‘హిట్ పెయిర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిత్రా ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చారట జగ్జీత్. అయితే అప్పటికే తనకు డెబో ప్రసాద్‌తో పెళ్లి కావడం, ఓ కూతురు కూడా ఉండటంతో జగ్జీత్ ప్రేమను ఆమె నిరాకరించారట. భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన మరో పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పారట. అయితే జగ్జీత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాలు కొనసాగించారట. చిత్ర మీద ఉన్న అమితమైన ప్రేమతో ఏకంగా ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లి... ‘ నేను మీ భార్యను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను’ అని చెప్పారట. చెప్పినట్లుగానే ప్రసాద్- చిత్ర విడాకులు తీసుకున్న అనంతరం 1969లో జగ్జీత్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు చిత్ర మొదటి భర్త కూతురు మోనికాకు కూడా తండ్రిప్రేమ పంచారు. కొడుకు మరణం.. కూతురు ఆత్మహత్య సాఫీగా సాగిపోతున్న సంగీత జంట జగ్జీత్- చిత్రాల జీవితంలో వారి కొడుకు వివేక్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 1990లో జరిగిన ఓ కారు ప్రమాదంలో వివేక్(20) దుర్మరణం పాలయ్యాడు. ఈ బాధతో చిత్ర.. సంగీతాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. జగ్జీత్ కూడా ఏడాది పాటు సంగీతానికి దూరం అయినప్పటికీ.. తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను సంగీతం రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన చిత్ర దంపతులను 2009లో మరో విషాదం వెంటాడింది. తన వైవాహిక జీవితం విఫలమైందనే బాధతో చిత్ర కూతురు మోనికా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో 2011, అక్టోబరు 10న తన 70వ ఏట.. తన భార్య చిత్రను ఒంటరిని చేస్తూ జగ్జీత్ తుదిశ్వాస విడిచి ఆమెను మరింత విషాదంలోకి నెట్టారు. అభిమానులను శోకసంద్రంలో ముంచారు. He made my ‘wounds’ sing. The songs of Arth still resonate in my heart. Thank u for touching my life. 🙏🙏🙏 https://t.co/7h6pYYaXnf — Mahesh Bhatt (@MaheshNBhatt) October 10, 2019 -
హాలీవుడ్‌కి హలో
బాలీవుడ్ నటి షబానా ఆజ్మి బుడాపెస్ట్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మిస్తున్న ‘హాలో’ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో షబానా నటించనున్నారు. ‘హాలో’ అనే పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఈ విషయం గురించి షబానా మాట్లాడుతూ – ‘‘ఇదో కొత్త ప్రయాణం. చాలా ఎగై్జట్‌మెంట్‌తో పాటు కొంచెం నెర్వస్‌గానూ ఉంది. ఈ ప్రాజెక్ట్ అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది. దీనికోసం రెండు సినిమాలను కూడా వదులుకున్నాను. ఆ సినిమాలు వదులుకునేంత విలువైందే ఈ సిరీస్ అనుకుంటున్నాను’’ అన్నారు. అక్టోబర్‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదివరకు ‘సిటీ ఆఫ్ జాయ్, లా నూట్ బెంగాలీ’ అనే హాలీవుడ్ చిత్రాల్లో నటించారు షబానా. -
షబానా, జావేద్‌లపై పాక్ విమర్శలు
కరాచీ: బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త జావేద్ అక్తర్ తమ దేశ పర్యటన రద్దు చేసుకోవడాన్ని పాకిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్ విమర్శించింది. కరాచీలో జరగనున్న షబానా తండ్రి కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు వీరిద్దరూ హాజరుకావాల్సివుంది. జమ్మూకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. షబానా, జావేద్ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఆర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అహ్మద్ షా తప్పుబట్టారు. తమను షబానా నిరాశకు గురిచేశారని వ్యాఖ్యానించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. జావేద్ అక్తర్ ధైర్యముంటే కశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ సాగిస్తున్న అరాచకాలపై గళమెత్తాలని సూచించారు. ఈనెల 23, 24 తేదీల్లో కరాచీలో నిర్వహించనున్న కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రచయితలు, కవులతో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. -
అమ్మ.. నాన్న.. ఓ ప్రేమకథ
మూడు రోజుల ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ లో చివరి రోజు సెషన్లలో ప్రముఖంగా ఆకర్షించిన సెలబ్రిటీ షబానా ఆజ్మీ. ఆదివారం నాడు ఆమె తన తండ్రి, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ రాసిన కవితలను, పాటలను పాడి అలరించారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో ఆమె గ్లామర్‌తోపాటు స్వరంలో తియ్యదనం ఆకట్టుకున్నాయి. తండ్రి కైఫీ జీవితాన్ని ‘కైఫీయత్’ పుస్తకంగా వెలువరించారు షబానా. ఆ పుస్తకం మీద చర్చతో పాటు, కైఫీ జీవితం మీద ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి వచ్చారు షబానా. ఆమె పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే. షబానా తల్లి షౌకత్‌ది హైదరాబాద్. ఆమె కైఫీ రచనలకు అభిమాని. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడడానికి ప్రయత్నించి మరీ తన ప్రేమను వ్యక్తం చేసినట్లు చెప్పారు షబానా. కైఫీ రక్తంతో రాసిన ప్రేమలేఖలను నమ్మవద్దని, అందులో వ్యక్తం చేసిన భావుకతలకు మురిసిపోవద్దని షౌకత్‌ను ఆమె తండ్రి (షబానా తాతగారు) హెచ్చరించినట్లు కూడా చెప్పారు షబానా. అయినప్పటికీ పట్టుపట్టి మరీ అతడినే పెళ్లి చేసుకున్న వైనాన్ని వివరించారు, పెళ్లి తర్వాత పెద్దగా సంపాదన లేని కైఫీ ఎనిమిది కుటుంబాలకు కలిపి ఒకటే టాయిలెట్ ఉండే ఇంట్లో కాపురం పెట్టారు. డబ్బు లేని బాల్యమే అయినా అందమైన జీవితాన్ని గడిపిన రోజులవి అన్నారామె. తండ్రి ఫొటో పేపర్లో ప్రచురించినప్పుడు ఫ్రెండ్స్ ప్రశంసలను ఎంజాయ్ చేయడం వంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె.కైఫీ చిన్నప్పటి నుంచి పండక్కి కొత్త దుస్తులు వేసుకోవడాన్ని వ్యతిరేకించేవారని, రైతు బిడ్డ కొత్త దుస్తుల కోసం ఆరాటపడకూడదని చెప్పేవారని ఆమె తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పదకొండేళ్ల వయసులో తండ్రి రాసిన కవితను, ఆయన తండ్రి విశ్వసించకపోవడాన్ని, మళ్లీ రాసి చూపించిన తర్వాత నమ్మిన విషయాలను పంచుకున్నారు. ‘‘మా అమ్మ చాలా ప్రాక్టికల్‌గా ఉండేది. వారి దాంపత్యంలో ఎంత ప్రేమ ఉండేదో అంతటి గొడవలు కూడా ఉండేవి. మా నాన్న చాలా నైస్‌గా చక్కదిద్దేవారు. వాళ్ల కాపురంలో సమానత్వం కోసం ప్రయత్నించడం జరగలేదు, వారి ఆచరణలో ఉండేది. నాన్న రాసిన ‘నా వెనుక నడిచే అనుచరురాలు కాదు... నువ్వు నా పక్కన నడిచే సహచరిగా ఉండాలి’ అనే కవిత మా అమ్మను ఆయన ప్రేమలో పడేసింది. అది చివరి వరకు వాళ్ల జీవితంలో కొనసాగింది. అది మా అమ్మానాన్నలకే కాదు, ప్రతి జంటకీ వర్తిస్తుంది. అన్వయించుకోగలిగితే ప్రేమబంధం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’ అన్నారు షబానా. సమాజంలో మత సంఘర్షణలు వాటికవిగా జరగవు. వాటి వెనుక కొన్ని ప్రయోజనాలుంటాయి. అవి ప్రేరేపించినప్పుడే మతకల్లోలాలు జరుగుతాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మీటూ ఉద్యమం చాలా గొప్ప సామాజికోద్యమం. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ పూరిత వాతావరణం ఉండాలి. తమకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తిన అమ్మాయిలకు సెల్యూట్’’ అని ప్రశంసించారు. ఇన్పుట్స్ : మంజీర, ఓ మధు -
‘ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను’
భారీ అంచనాల మధ్య రికార్డు స్థాయిలో విడుదలైన ‘సంజు’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతూ సూపర్ హిట్ వైపు దూసుకెళ్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు కూడా తెగ అభినందిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటి చేరారు. విభిన్న కథలతో...అద్భుతమైన నటనతో హిందీ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ షబనా ఆజ్మీ ‘సంజు’ను అభినందిస్తూ ట్విటర్లో మెసేజ్ చేశారు. ఈ సందర్భంగా రిషి కపూర్‌ను ట్యాగ్ చేస్తూ ‘సంజు సినిమా చూశాను...రణ్‌బీర్ జీవితంలోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. ‘సంజు’లో రణ్‌బీర్ యాక్టింగ్ చూసి నిజంగా ఒక్క క్షణం నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. విక్కి కౌశల్ నువ్వు నీ పాత్రకు న్యాయం చేశావు’అని మెసేజ్ చేశారు. -
కొనసాగుతున్న పద్మావతి ప్రకంపనలు
సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినిమాకు సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ నిలిచిపోయిన క్రమంలో పాలక రాజస్ధాన్, యూపీ, గుజరాత్ బీజేపీ సర్కార్ల తీరుపై బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాలే పద్మావతి చిత్ర విడుదలలో జాప్యానికి కారణమని నటి, సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. పద్మావతి విషయంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి గోవాలో సోమవారం ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. పద్మావతి మూవీపై రగడ జరుగుతుంటే రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె మౌన ప్రేక్షకురాలిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పద్మావతి మూవీని విడుదల చేస్తే హింసకు దిగుతామని హెచ్చరించిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఏరివేస్తామని ప్రకటించిన యూపీ ప్రభుత్వం శాంతిభద్రతల పేరుతో డిసెంబర్ 1న సినిమా విడుదలకు మోకాలడ్డుతోందని విమర్శించారు.పద్మావతి మూవీని కొన్ని లాంఛనాలు పూర్తికాలేదనే సాకుతో సీబీఎఫ్సీ తిప్పిపంపడాన్ని షబనా అజ్మీ తప్పుపట్టారు. దీనివెనుక గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయం దాగున్నదన్నారు. మరోవైపు రాజ్పుట్ల ప్రాబల్యం కలిగిన రాజస్ధాన్‌లో పద్మావతి మూవీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పద్మావతి మూవీలో ఏ వర్గం వారినీ కించపరిచే సన్నివేశాలు లేకుండా మార్పులు చేసేంతవరకూ సినిమా విడుదల చేయరాదని రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే కేంద్రాన్ని కోరారు. చరిత్రకారులు, సినీ వర్గాలు, రాజ్పుట్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీతో చిత్ర కథ గురించి చర్చించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని, అప్పటివరకూ విడుదల వాయిదా వేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి వసుంధర రాజే లేఖ రాశారు. -
'పద్మావతి’పై నిరసనలు తీవ్రతరం
జైపూర్: బాలీవుడ్ చిత్రం పద్మావతిపై నిరసనలు రాజస్తాన్‌లో ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. రాజ్‌సమంద్ జిల్లాలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూ శనివారం చారిత్రక కుంభల్గఢ్ కోటలోకి ప్రవేశాన్ని అడ్డగించారు. కోటలో జరిగిన ప్రదర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిష్టి బొమ్మను ఉరితీశారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందకుండానే ఈ చిత్రాన్ని కొందరు పాత్రికేయుల ముందు ప్రదర్శించడాన్ని సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి తప్పుపట్టారు. ‘ ఇలాంటి చర్యలు సీబీఎఫ్సీ పాత్రను బలహీనపరిచేలా ఉన్నాయి. తమ సౌకర్యం కోసం సర్టిఫికేషన్ ప్రక్రియను ఇలా హ్రస్వ దృష్టితో చూడటం సరికాదు’ అని జోషి వ్యాఖ్యానించారు. సీబీఎఫ్సీ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందునే దాన్ని వెనక్కి పంపామని వెల్లడించారు. ఈ చిత్రం కల్పితమా లేక చరిత్ర ఆధారితమా అన్న విషయాన్ని డిస్‌క్లేమర్‌లో చెప్పకుండా ఖాళీగా వదిలేశారని తెలిపారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దరఖాస్తును సీబీఎఫ్సీ వెనక్కి పంపడం ఓ రాజకీయ స్టంట్ అని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారు దీపికా పదుకొనేకు హాలీవుడ్ నటి రూబీ రోజ్ బాసటగా నిలిచారు. తనకు తెలిసిన ధైర్యవంత మహిళల్లో దీపికా ఒకరని ట్వీట్ చేశారు. దీపికకు వచ్చిన బెదిరింపులకు నిరసనగా గోవాలో జరనగనున్న ఇఫ్ఫి వేడుకలను సినీ పరిశ్రమ బహిష్కరించాలని ప్రముఖ నటి షబానా అజ్మీ అన్నారు. -
34 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా
సాక్షి, ముంబై : నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ భార్యాభర్తలుగా నటించిన లిబాస్ బాలీవుడ్ సినిమాను 34 ఏళ్ల తర్వాత థియేటర్లలో తొలిసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు గుల్జార్‌కు, సినిమా నిర్మాత వికాస్ మోహన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ సినిమా ఇన్నేళ్లు విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమా ముగింపు తనకు నచ్చలేదని, దాన్ని మార్చాల్సిందిగా వికాస్ మోహన్ గుల్జార్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. అయితే తాను సినిమాను విడుదల చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసిన వికాస్ మోహన్ సినిమాను మూలన పడేశారు. వికాస్ మోహన్ 2016 సంవత్సరంలో మరణించారు. ఆయన స్థానంలో సినిమా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆయన కుమారుడు అముల్ మోహన్ ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. జీ క్లాసిక్ సినిమాలతోపాటు లిబాస్ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తానని చెప్పారు. ఈ సినిమా పూర్తయిన నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన ఆర్డీ బర్మన్ పాటలకు ప్రశంసలు లభించాయి. గుల్జార్ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కార్లా రాసిన ‘సీమ’ అనే చిన్న కథ ఆధారంగా లిబాస్ సినిమాలో సీమగా షబానా ఆజ్మీ నటించగా, ఆమె భర్తగా నసీరుద్దీన్ షా నటించారు. సీమ పాత్రధారి షబానా తన బాల్య మిత్రుడు టీకే పాత్రధారి రాజ్ బబ్బర్‌తో వెళ్లిపోవడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతింటుంది. మనసును కట్టిపడేసే కథాకథనంలో ముగ్గురి పాత్రలు మనసుకు హత్తుకుంటాయనడంలో సందేహం లేదు. -
మూకదాడులపై దేశవ్యాప్త నిరసన
ముంబై/న్యూఢిల్లీ: ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మూకదాడులపై బుధవారం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వెల్లువెత్తింది. దాడులకు పాల్పడేవారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వేలాది సాధారణ ప్రజలతోపాటు పలురంగాల ప్రముఖులు రోడ్లెక్కారు. ముంబైలో జరిగిన నిరసనలో సినీతారలు షబానా ఆజ్మీ, కొంకణాసేన్ గుప్తా, రజత్ కపూర్ తదితరులు వర్షాన్ని లెక్కచేయకుండా పాల్గొన్నారు. ‘నా పేరుతో కాకుండా నా తిండి పేరుతో చంపుతున్నారు’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో.. రైల్లో హత్యకు గురైన జునైద్ సోదరుడు అసరుద్దీన్, కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు పాల్గొన్నారు. మూకదాడులు ఉండని స్వర్గంలో ఉన్నానంటూ జునైద్ తన తల్లికి రాసినట్లు ఓ మిత్రుడు రాసిన లేఖను అసరుద్దీన్ చదివి వినిపించారు. దీంతో అక్కడివారు కన్నీటిపర్యంతమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పట్నా, తిరువనంతపురం తదితర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ప్రేమ్‌సింగ్ ఈ నెల 25 నుంచి వారం రోజుల నిరాహార దీక్ష ప్రారంభించారు. మరోపక్క.. జునైద్ హత్య కేసులో 50 ఏళ్ల ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి సహా నలుగురిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని హరియాణా పోలీసులు తెలిపారు. -
సోషల్ షబానా
షబానా ఆజ్మీ, నటి, సోషల్ వర్కర్ జన్మదినం : 18 సెప్టెంబర్ 1950 జన్మస్థలం : హైదరాబాద్ (పెరిగింది ముంబై) తల్లిదండ్రులు : కైఫీ ఆజ్మీ, షౌకత్ ఆజ్మీ సోదరుడు : బాబా ఆజ్మీ భర్త : జావెద్ అఖ్తర్ అవార్డులు : అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ముఖ్య పురస్కారం : గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు నిన్నటితో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. ఇండియా నుంచి సినిమాలేమీ వెళ్లలేదు. సోనమ్ కపూర్, ఐశ్వర్యా రాయ్, శ్రుతీ హాసన్, దీపికా పడుకోన్ మాత్రం వెళ్లారు. అందరి కళ్లూ వాళ్ల డ్రెస్‌ల మీదే. మీడియా దృష్టీ వాళ్ల మీదే. ఫెస్టివల్ మొదలవడానికి ముందు షబానా ఆజ్మీ ట్విట్టర్లో 1976 నాటి తన కాన్స్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో షబానా, శ్యామ్ బె¯ð గల్, స్మితా పాటిల్ ఉన్నారు. ‘నిషాంత్’ సినిమా ప్రమోషన్ కోసం వీళ్లు ముగ్గురూ కాన్స్ వెళ్లినప్పటి ఫొటో అది! ఫొటో పోస్ట్ చేసి ఊరుకోలేదు షబానా. దాని కింద చిన్న కామెంట్ పెట్టారు. ‘సినిమా ముఖ్యం. బట్టలు కాదు’ అన్నది ఆ కామెంట్. కాన్స్ ఫెస్టివల్ జరిగిన ఈ పదిహేను రోజులూ బాలీవుడ్‌ను ఈ కామెంట్ ముల్లులా గుచ్చుతూ ఉంది! వింతేం లేదు. షబానా అభిప్రాయాలెప్పుడూ ముల్లులానే ఉంటాయి. అయితే ముల్లును తీసే ముల్లు మాత్రమే షబానా. ఆమె కామెంట్ చెడును తొలగిస్తుంది. మంచిని చేస్తుంది. అయితే షబానాను ఒక్క మాటతోనో, ట్వీట్‌తోనో పూర్తిగా అర్థం చేసుకోలేం. కొంత ముందుకూ, కొంత వెనక్కూ వెళ్లాలి. జీవితానికి ఎన్ని సాధారణ అర్థాలైనా ఉండొచ్చు. అసాధారణమైన అర్థం మాత్రం... షబానా ఆజ్మీ! సంతృప్తి పరిచే సమాధానాలు ఎన్నైనా లభించవచ్చు. ఆలోచన రేపే ఆన్సర్ మాత్రం... షబానా ఆజ్మీ. ‘మనుషులు కాని వాళ్లెవరూ మా ఇంటి తలుపు తట్టేందుకు వీల్లేదు’ అన్నట్లుంటుంది ముంబైలోని షబానా ఇల్లు.‘గర్వంగా, గౌరవంగా చెప్పుకో... నేను మనిషినని’ అనే అర్థం వచ్చేలా అక్షరాలను పొదిగి ఉన్న శిలాఫలకం ఆమె ఇంటి బయట గోడలో ఒక భాగమై ఉంటుంది. షబానా మాట కూడా ఇంతే. ఘాటు! ‘సమాజానికి ఏదైనా ఇవ్వు’ అని డిమాండింగ్‌గా అడుగుతారు షబానా. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చిందామెకు? తల్లి కడుపులోంచి వెంట తెచ్చుకుందా? తండ్రి బిగించిన పిడికిలి వేళ్లను విప్పదీసి లాక్కుందా? షబానా తండ్రి కైఫీ ఆజ్మీ... కమ్యూనిస్టు. తల్లి షౌకత్ ఆజ్మీ... కమ్యూనిస్టు. తండ్రి కవి, తల్లి రంగస్థల నటి అవడం రెండో మాట. మొదటైతే కమ్యూనిస్టులు. వాళ్ల పిల్ల షబానా. సహాయం కోసం, సలహా కోసం, సానుభూతి కోసం, ఓదార్పు కోసం, సంప్రదింపుల కోసం, చర్చల కోసం వస్తుండే సామాన్యులు, సుప్రసిద్ధులు, కళాకారులు నిత్యం మసులుతుండే ఆ నట్టింట్లో వాళ్లతో కలిసి తిరుగుతుండే పిల్ల... షబానా! అందుకే ఆమెలో ఇంత సోషల్ కాన్షస్నెస్. జీవితం, సినిమా ఒకటి కాదు. కానీ షబానాకు అవి రెండూ వేరు కాదు. జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలనే ఆమె ఎంచుకున్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే చిత్రాలను మాత్రమే అంగీకరించారు. పాయలు పాయలుగా విడిపోయిన జీవితం షబానాది. ఒక పాయ సినిమా. ఒక పాయ సేవ. ఇంకో పాయ ఉద్యమం. అంతర్ ప్రవాహంగా మరో పాయ... జావెద్ అఖ్తర్. ఆమె భర్త! సిల్వర్ స్క్రీన్ సినిమాల్లోకి రావడానికి షబానాకు జయబాధురి ఇన్స్పిరేషన్. జయ నటించిన పదమూడున్నర నిమిషాల నిడివిగల చిత్రం ‘సుమన్’ షబానా ఆలోచననే మార్చేసింది. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో సైకాలజీ పట్టాతో బయటికి వచ్చిన షబానాను పుణె బండి ఎక్కించి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాసురూమ్‌లో కూర్చోబెట్టింది. ‘యాక్టింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటే జయలా నటించడం సాధ్యమయ్యే పనైతే వేరే కోర్సు ఎందుకు చెయ్యాలి’ అనుకునేంతగా జయ నటన ఆమెను లోబరుచుకుంది. నటిస్తే జయలా నటించాలి. అదీ షబానా ఎయిమ్. 1972 బ్యాచ్ పుణె ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ కోర్సు టాపర్ల జాబితాలో షబానా పేరు అందరికన్నా టాప్‌లో ఉంది. ఇప్పటికీ ఈ 2017లోనూ, ఈ 66 ఏళ్ల వయసులోనూ తనే టాప్.. తనదైన విలక్షణతలో, వైవిధ్యంలో. నాలుగు దిక్కులు జావెద్ అఖ్తర్ : భర్త, హితుడు, స్నేహితుడు, షబానా ప్రేమికుడు! తన తల్లిదండ్రుల తర్వాత షబానాకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసిన ఆప్తుడు. అంతరంగం తెలిసినవాడు. ఫెమినిస్టు. ఆయన సమక్షంలో షబానా ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. శ్యామ్ బెనగల్ : షబానా మొదటి సినిమా డైరెక్టర్. ఈయనతో కలిసే షబానా తొలిసారిగా విదేశీ ప్రయాణం చేశారు. షబానా నటించిన ప్రతి సినిమాకు శ్యామ్ చక్కటి విమర్శకుడు. శ్యామ్‌ను షబానా గురువులా భావిస్తారు. కానీ శ్యామ్... నువ్వు నీ ఫీల్డులో, నేను నా ఫీల్డులో ఇద్దరం సమానమే అంటారు. జెన్నిఫర్ కపూర్ : శశికపూర్ భార్య. ఈవిడంటే షబానాకు ఆరాధన. ఇద్దరి భావాలూ ఒక్కటే. ఫ్రెండ్లీగా ఉంటారు. సుభాషిణి అలీ : ముజఫర్ అలీ మొదటి భార్య. ఉద్యమకారిణి. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. షబానా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సుభాషిణి క్రియాశీల కార్యకర్తగా సామాజిక సమస్యలపై పోరాడుతూ కనిపించేవారు. పోలీసులు తరచూ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళుతున్నప్పుడు షబానా ఆశ్చర్యంగా చూసేవారు. డయానా ప్యాలెస్‌లో షబానా షబానా ఆజ్మీ నటించిన తాజా చిత్రం ‘ది బ్లాక్ ప్రిన్స్’ జూలై 21న ఇంగ్లిష్, హిందీ, పంజాబీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇందులో షబానా రాజమాత జిందాగా నటిస్తున్నారు. బ్రిటిష్ ఇండియాలో పంజాబ్ చివరి రాజు మహారాజా దులీప్ సింగ్‌కి, రాణి విక్టోరియాకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, ఇతర అంశాలను కథాంశంగా తీసుకుని భారత సంతతి బ్రిటన్ దర్శకుడు కవి రజ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌లో షబానాపై ముఖ్య సన్నివేశాలను ఇటీవలే ఇంగ్లండ్‌లోని ప్రిన్సెస్ డయానా ప్యాలెస్‌లో చిత్రీకరించారు. మహారాజా దులీప్ సింగ్‌గా ప్రముఖ సూఫీ సింగర్, కంపోజర్, సాంగ్ రైటర్ సతీందర్ సర్తాజ్ నటిస్తున్నారు. ఆయన తల్లిగా షబానా నటిస్తున్నారు. తొలిసారి 1974లో శ్యాం బెనగల్ ‘అంకుర్’తో షబానా నటి అయ్యారు. నలభై రెండేళ్ల తర్వాత, వందకు పైగా సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ ఆమెలో అదే ఉత్సాహం. అదే పవర్. అదే ఎనర్జీ. సోషల్ స్క్రీన్ మనుషులంతా ఒక్కటే అయినప్పుడు మతాలు వేరైతే మాత్రం ఏమిటి? అందరం కలిసి ఉండలేమా? షబానా వేసిన సూటి ప్రశ్నలివి. 1989లో స్వామి అగ్నివేశ్, అస్ఘర్ అలీ ఇంజనీర్లతో కలిసి ఆమె న్యూఢిల్లీ నుంచి మీరట్ వరకు నాలుగు రోజుల పాటు మత సామరస్య యాత్ర చేపట్టారు. అగ్నివేశ్ హైందవ ధర్మ కార్యకర్త. అస్ఘర్ అలీ భారతీయ ముస్లిం. సామాజిక సంస్కరణలవాది. వేర్వేరు ధ్రువాలు. వేర్వేరు భావనలు. అంతస్సూత్రం ఒకటే... సద్భావన! కలిసుందాం అన్న ప్రతిన! యాత్ర ప్రశాంతంగా ముగిసింది. రెచ్చగొట్టే పిలుపుల వల్ల, ప్రసంగాల వల్ల చివరికి బలయ్యేది అమాయకులేనని షబానా ఎన్నో సందర్భాలలో అతివాదుల్ని గట్టిగా అదుపు చేయడానికి ప్రయత్నించారు. సర్వీస్ స్క్రీన్ ఎయిడ్స్ గురించి మనం చెబుతున్న మంచిచెడ్డలన్నీ ఇప్పటికీ ఆ వ్యాధిగ్రస్థులకు దూరంగా నిలబడి చెబుతున్నవే. కానీ షబానా ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఎయిడ్స్ కంటే ‘ఆస్ట్రసిజం’ అతి భయంకరమైన వ్యాధి అంటారు షబానా. ఆస్ట్రసిజం అంటే అంటరానితనం. ఒక ప్రభుత్వ ప్రాయోజిత లఘుచిత్రంలో హెచ్.ఐ.వి. పాజిటివ్ చిన్నారిని చేతుల్లోకి లాక్కుని ప్రేమగా గుండెకు హత్తుకున్నారు షబానా. హత్తుకుని – ‘ఈ పాపకు కావలసింది మీ తిరస్కారం కాదు. మీ ప్రేమ’’ అని చెప్పారు. ‘మేఘ్లా ఆకాశ్’ అనే బెంగాలీ చిత్రంలో కూడా ఎయిడ్స్ బాధితులకు సాంత్వన కలిగించే డాక్టర్ పాత్రలో నటించారు షబానా. అలాగే టెక్ ఎయిడ్స్ అనే సంస్థ నిర్మించిన హెచ్.ఐ.వి./ఎయిడ్స్ యానిమేషన్ కిట్‌కు స్వరాన్ని సమకూర్చారు. షబానా ధ్యేయం... సినిమాలతో గానీ, సేవారంగంతో కానీ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే పనిలో భాగస్వామి కావడం. షబానా మాట్లాడే ప్రతి మాటను, చేసే ప్రతి కామెంట్‌ను మనం కోణంలోంచే తీసుకోవాలి. శాంతిదూత షబానాకు వంట చేయడం రాదు. కానీ అప్పుడప్పుడు జావెద్‌కు ప్రేమగా వండి వడ్డింస్తుంటారు! ∙అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని పొందిన తొలిæ భారతీయ మహిళ షబానా ఆజ్మీ. ∙మురికివాడల ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు షబానా ‘నివార హక్ సంరక్షణ సమితి’ సభ్యురాలిగా చేరారు. ∙ఆమెకు ఈ ఆలోచన కలగడానికి కారణం ఆనంద్ పట్వర్థన్ తీసిన ‘బాంబే అవర్ సిటీ’ చిత్రం. ఆ సినిమా అంతా మురికివాడల కూల్చివేతల చుట్టూ, కూలిపోయిన ఆ జీవితాల చుట్టూ తిరుగుతుంది. అది చూసి షబానా చలించిపోయారు. తండ్రీకూతుళ్లిద్దరికీ పద్మశ్రీ వచ్చిందనే మాట షబానాకు సంతోషం కలిగిస్తుంటుంది. (ఆమె తండ్రి కైఫీ ఆజ్మీ పద్మశ్రీ అవార్డు గ్రహీత) జావెద్ అఖ్తర్‌కు షబానా ఆజ్మీ రెండో భార్య. జావెద్‌కు, షబానాకు పిల్లలు లేరు, వద్దనుకున్నారు. సూటి మాట ∙వివిధ మతాలు, భాషలు, సమాజాలు, ఆచారాలు ఉన్నట్లే... ప్రాచీన, ఆధునిక కాలాల తత్వాలు మనలో కలగలసి ఉన్నాయి. అవన్నీ కూడా స్త్రీల జీవితంపై ప్రభావం చూపుతాయి. ∙నేటికీ ఆడశిశువుల భ్రూణ హత్యలు తగ్గలేదు. మారుమూల గ్రామాలలో ఎన్ని జరుగుతున్నాయో ముంబై, గుజరాత్, హర్యానా, పంజాబ్లలోని పట్టణాలలోనూ అన్ని జరుగుతున్నాయి. కాన్పు మరణాల సంఖ్య కూడా మన దేశంలో ఎక్కువగా ఉంది. ఆడపిల్లలకు పోషకాహారం, మంచి చదువు నేటికీ ఇవ్వలేకపోతున్నాం. ఈ పరిస్థితి మారాలి. భర్త జావెద్ అఖ్తర్‌తో షబానా ఆజ్మీ -
మెట్రో రైలు ఎక్కిన సీనియర్ హీరోయిన్
సీనియర్ హీరోయిన్, ప్రముఖ సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ ఢిల్లీ మెట్రో రైల్లో సామాన్య ప్రయాణికురాలిలా వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అత్యవసర పనిమీద వెళ్లేందుకు మెట్రో ఎక్కానని, అది చాలా శుభ్రంగా, బ్రహ్మాండంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. దాంతోపాటు తాను మెట్రోలో కూర్చుని ఉండగా సెల్ఫీ తీసుకున్న ఫొటో కూడా ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం అపర్ణాసేన్ దర్శకత్వంలో వస్తున్న సొనాటా సినిమాలో షబానా నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ముగ్గురు అవివాహిత మహిళలు మధ్యవయసులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయం గురించిన చర్చ ఉంటుంది. ఒక ప్రొఫెసర్, ఒక బ్యాంకు ఉద్యోగిని, జర్నలిస్టు.. ఈ ముగ్గురు మహిళల చుట్టూనే సినిమా కథ తిరుగుతుంటుంది. Travelling by Delhi Metro from airport to make it in time for an urgent appointment! Its SUPERB.. clean .! pic.twitter.com/m7U2xzRGwh — Azmi Shabana (@AzmiShabana) 6 April 2017 -
సీఎంపై సీనియర్ నటి మండిపాటు!
'యే దిల్ హై ముష్కిల్' (ఏడీహెచ్‌ఎం) సినిమా విడుదల విషయంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే, చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ఈ సినిమాపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించింది. సీఎం సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఏడీహెచ్ఎంపై నిషేధం ఎత్తివేసేందుకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, అలా సినిమాలు తీస్తే రూ. ఐదు కోట్లు భారత ఆర్మీ జవాన్ల సంక్షేమ నిధికి ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. అయితే, ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి రాజీయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ తీరును బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎంత దారుణమైన పరిస్థితి ఇది! సీఎం బ్రోకరిజం చేసి రూ. 5 కోట్లకు దేశభక్తిని కొనుగోలు చేశారు. ఏడీహెచ్‌ఎం శాంతియుతంగా విడుదల అయ్యేలా చూస్తామని ఏకంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చాక కూడా ఇలా జరిగింది’ అని షబానా వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ’నేను దేశభక్తురాలినా? కాదా? అన్నది ఎమ్మెన్నెస్ నిర్ణయిస్తుందా? నేను రాజ్యాంగానికి బద్ధురాలిని కానీ, రాజ్ ఠాక్రేకు కాదు. నిజానికి ఆయన దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 'యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు కేంద్రహోంమంత్రి హామీ ఇచ్చినా ఆయనపై సీఎం ఫడ్నవిస్ ఏమాత్రం గౌరవం చూపలేదని, ఆయన నుంచి బీజేపీ వివరణ అడగాలని ఆమె డిమాండ్ చేశారు. -
సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్
ముంబై: బాలీవుడ్ నటి సీనియర్ నటి షబానా అజ్మీ తన 66వ పుట్టినరోజు సందర్భంగా ‘దంగల్’ సినిమా చూసింది. షబానా పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. పుట్టినరోజున తనకు మంచి కానుక ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రధాన పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్, దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత కిరణ్ రావును ఆమె మెచ్చుకున్నారు. ‘నా పుట్టినరోజున దంగల్ సినిమా చూడడంతో మంచి బహుమతి లభించినట్టయింది. ఆమిర్ ఖాన్, నితేశ్ తివారి, కిరణ్ రావు, ఫతిమా, సనా చాలా బాగా నటించారు. మరిచిపోలేని కానుక ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ షబానా ట్వీట్ చేశారు. కుస్తీయోధుడు మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా ‘దంగల్’సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Watching #Dangal is d best birthday gift I could get. Thanku @aamir_khan nitesh tiwari kiran rao fatima sana u r outstanding — Azmi Shabana (@AzmiShabana) 19 September 2016 -
'భారత్ అమ్మీ కి జై' ఆయనకు ఓకేనా?
ముంబై: గొంతు మీద కత్తిపెట్టినా.. 'భారతమాతకు జై' అనను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ.. అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. శుక్రవారం ఓ ప్రయివేట్ కార్యాక్రమంలో మాట్లాడిన ఆమె.. అసదుద్దీన్ ఓవైసీకి భారత్ మాతాకీ జై అనడానికి బదులుగా.. 'భారత్ అమ్మీ కి జై' అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించింది. భారత్ మాతాలో 'మాతా' అనే పదంతోనే సమస్య అయినప్పుడు.. మాతాకు బదులుగా అమ్మీ అని పలకడానికి ఆయనకు ఓకేనా అని షబానా ప్రశ్నించింది. షబానా భర్త, రచయిత జావేద్ అక్తర్ సైతం అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎంఐఎం లీడర్ తన వ్యాఖ్యలతో దేశంలో అశాంతిని కలిగిస్తున్నాడని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో తప్ప ఎక్కడి నుంచైనా తాను అసదుద్దీన్‌పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. -
'స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది'
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేదిక మీదనుంచి రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుండగా తాజాగా... లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనగల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన సినిమాలలో కథానాయికగా నటించిన స్మితాపాటిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బెనగల్. స్మితాపాటిల్ ఊసరవెల్లి లాంటిది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది అంటూ కితాబిచ్చాడు. స్మిత, శ్యాం బెనగల్ రూపొందించిన మండీ, భూమిక, మంతన్, నిశాంత్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించింది. శ్యాం మాటల్లో చెప్పాలంటే 'కెమరా ఆమెను ప్రేమించింది, ఆమె సహజ నటి, ఏ పాత్రలోకైన సునాయాసంగా ఒదిగిపోతుంది. మన ప్రేమేయం లేకుండానే ఆమె మన కథలో భాగమైపోతుంది.' స్మితతో పాటు తన సినిమాల్లో కథానాయికగా నటించిన షబానా అజ్మీని కూడా ప్రశంసించాడు శ్యాం బెనగల్. ' తొలిసారిగా క్యారెక్టర్ కోసం ఆమె తన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్యర్యపోయా, షబానా అజ్మీ ప్రొఫైల్ కూడా చూడటం మానేసి ఆమెనే చూస్తూ ఉండిపోయా. ఆ సమయంలోనే అంకుర్ సినిమాలో లక్ష్మీ నా కళ్లకు కనిపించింది.' అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. -
డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్
యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు అని అడిగితే చాలామంది హీరోయిన్లు డాక్టర్ అన్న సమాధానమే చెబుతారు. కానీ, అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ ఇప్పుడు నిజంగానే డాక్టర్ అవతారం ఎత్తారు. విషయం ఏమిటంటే.. మరో సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గత ఐదారు రోజులుగా విపరీతంగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. దాంతో పసుపు నీళ్లు తాగాలని ఆమెకు షబానా అజ్మీ చెప్పారు. అది మ్యాజిక్‌లా పనిచేసిందని జూహీ సంబరపడిపోయింది. ప్రస్తుతం షబానాతో కలిసి 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో నటిస్తున్న జూహీ చావ్లా.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. పసుపు నీళ్లు తయారుచేసుకోవడం కూడా చాలా సులభమేనని, నీళ్లు బాగా మరిగించి.. అందులో మంచి నాణ్యమైన ఆర్గానిక్ పసుపు వేయాలని చెప్పింది. ఆర్గానిక్ పసుపును షబానా తనకు బహుమతిగా కూడా ఇచ్చారంటూ ఆ ప్యాకెట్ ఫొటోను ట్వీట్ చేసింది. మరోవైపు షబానా అజ్మీ కూడా జూహీ చావ్లాకు థాంక్స్ చెప్పారు. ఇదెందుకు అనుకుంటున్నారా? షూటింగ్ సెట్ దగ్గరకు ఆమె గుజరాతీ వంటకాలు తెచ్చిందట. ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయని, తాను ఇప్పటికీ తాను పెదాలు నాక్కుంటూనే ఉన్నానని షబానా చెప్పారు. జయంత్ గిలాటర్ దర్శకత్వం వహిస్తున్న 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో వీళ్లిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సమీర్ సోనీ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. Was sick .. Wheezing and coughing for the past 5 days .. Shabanaji advised me to sip haldi paani ... And it's worked like magic .. — Juhi Chawla (@iam_juhi) October 24, 2015 To make haldi paani .. Simply boil water with good quality organic haldi .. And Shabanaji sweetly gifted me that too !! :) :) — Juhi Chawla (@iam_juhi) October 24, 2015 Thanku so much @iam_juhi for the yummy Gujju food that u brot 2day on sets of Amin Suranis #Chalk And Duster. Am still licking my lips. Maju — Azmi Shabana (@AzmiShabana) October 24, 2015 -
'జెజ్‌బా' మూవీ రివ్యూ
టైటిల్ : జెజ్‌బా జానర్ ; థ్రిల్లర్ యాక్షన్ డ్రామా తారాగణం ; ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, జాకీ ష్రాఫ్, అతుల్ కులకర్ణీ దర్శకత్వం ; సంజయ్ గుప్తా సంగీతం ; సచిన్ జిగార్ నేపథ్య సంగీతం ; అమర్ మొహిలే నిర్మాత ; వైట్ ఫెదర్ ఫిలింస్, వీకింగ్స్ మీడియా & ఎంటర్టైన్మెంట్ ఐదేళ్ల విరామం తరువాత ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమాగా విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది జెజ్‌బా. 2007లో రిలీజ్ అయిన సౌత కొరియన్ ఫిలిం 'సెవెన్‌డేస్' ఆధారంగా ఈ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ నేటివిటికి తగ్గట్టుగా అన్ని రకాల మార్పులతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన జెజ్‌బా ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ : ముంబైలో లీడింగ్ క్రిమినల్ లాయర్ అయిన అనురాధ వర్మ (ఐశ్వర్యరాయ్) పరిచయంతో సినిమా మొదలవుతుంది. తన కెరీర్లో వంద శాతం సక్సెస్‌లతో నెంబర్ వన్ లాయర్ అనిపించుకుటుంది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిగా ఉంటున్న అనురాధ తన కూతురు సాన్యా (సారా అర్జున్) ఆలనాపాలనా కూడా తనే చూసుకుంటుంది. కూతురు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంటుంది. ఒకరోజు స్కూల్లో ఆటల పోటీలు జరుగుతున్న సందర్భంలో సాన్యా కిడ్నాప్ అవుతుంది. అయితే కిడ్నాపర్స్ డబ్బులు అడగటానికి బదులు జైలులో ఉన్న నవాజ్ తరపున కేసు వాదించాల్సిందిగా డిమాండ్ చేస్తారు. సియా(ప్రియాబెనర్జీ) అనే అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన నేరం మీద నవాజ్ జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఇక చేసేదేమిలేక నవాజ్ తరపున కేసు వాదించటానికి అంగీకరిస్తుంది అనురాధ. అదే సమయంలో అనురాధ స్నేహితుడు, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి యోహన్( ఇర్ఫాన్ ఖాన్) ఆమెకు సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఈ ఇద్దరు కిడ్నాపర్స్ నుంచి సాన్యాను ఎలా బయటికి తీసుకువచ్చారు అన్నదే మిగతా కథ. నటీనటులు : రీ ఎంట్రీ లో ఐశ్వర్యరాయ్ తన వయసుకు తగ్గ కథను ఎంచుకుంది. నటిగా తనలో ఏ మాత్రం పట్టు తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించుకుంది. కూతురు కిడ్నాప్ అయిన తరువాత బలవంతంగా ఓ కేసు వాదిస్తున్న లాయర్‌గా అండర్ కరెంట్ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించింది. లాయర్ అనురాధకు సాయం చేసే పాత్రలో ఇర్ఫాన్ ఖాన్ మెప్పించాడు. కొన్ని సీన్స్‌లో ఇర్ఫాన్ నటన ఆ పాత్రకు తనే అల్టిమేట్ చాయిస్ అనిపించేలా ఉంది. ఇక హత్యకు గురైన యువతి తల్లిగా షబానా అజ్మీ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఐశ్వర్యతో పోటీపడి నటించిన షబానా తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో నటించిన జాకీ ష్రాఫ్, సారా అర్జున్, అతుల్ కులకర్ణీ, సిద్ధాంత్ కపూర్ తన పాత్ర పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం సంజయ్ గుప్తా స్క్రీన్ ప్లే. క్రైం థ్రిల్లర్లను తెరకెక్కించటంలో మంచి అనుభవం ఉన్న సంజయ్ మరోసారి ఆ జానర్లో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలు అభిమానులను రెప్పవేయకుండా చూసేలా చేస్తాయి. ప్రథమార్థం చివరలో సినిమా కాస్త స్లో అయినట్టుగా అనిపించినా సెకండాఫ్ మాత్రం అద్భుతంగా వచ్చింది. సినిమాకు ప్రాణం పోసిన మరో సాంకేతిక నిపుణుడు డైలాగ్ రైటర్ కమలేష్ పాండే. ఎమోషనల్ సీన్స్‌తో పాటు కోర్ట్ సీన్స్‌లోనూ కమలేష్ డైలాగ్స్ చాలా బాగా పేలాయి. ఆడియో పరంగా ఆకట్టుకోకపోయినా అమర్ మొహిలే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన రేంజ్ లో పండించాడు. సమీర్ ఆర్య సినిమాటోగ్రఫి ఆశించిన స్థాయిలో మెప్పించింది. విశ్లేషణ : ఒక మామూలు క్రైమ్ డ్రామాను థ్రిల్లర్‌గా మలిచిన సంజయ్ గుప్త మంచి విజయం సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత వెండితెర మీద దర్శనమిచ్చిన ఐశ్వర్య తన అద్భుతమైన నటనతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. గ్లామర్ షో కోరుకునే వారిని నిరాశపరిచినా, నటన పరంగా మాత్రం బెస్ట్ అనిపించుకుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీలు డైరెక్టర్స్ బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నారు. అవార్డ్ ఇన్నింగ్ పర్ఫామెన్స్‌లతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. అయితే ఫస్టాఫ్ చివరలో వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తాయి. సాంకేతిక విభాగం నుంచి చిన్న చిన్న పొరపాట్లు కనిపించినా జెజ్‌బా సక్సెస్ ఫుల్ సినిమాగా ఆకట్టుకుంది. ప్లస్ పాయింట్స్ ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్‌ఖాన్, షబానా అజ్మీల నటన స్క్రీన్ ప్లే డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ మ్యూజిక్ ఓవరాల్ గా జెజ్‌బా ఐశ్వర్యరాయ్‌కి సక్సెస్ఫుల్ కంబ్యాక్ -
నా పాత్ర ఆడపిల్లలకు స్ఫూర్తినిస్తుంది
బాలీవుడ్ తెరపై బయోపిక్‌ల హవా ఇంకా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా నిజ జీవిత పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ వారసురాలు సోనమ్ కపూర్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. 1986లో హైజాక్ అయిన విమానంలో ప్రయాణికులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ అంటెండెంట్ నీరజా భనట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సోనమ్ లీడ్రోల్లో నటిస్తోంది. నీరజ, 1986లో ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానంలో సీనియర్ ఫ్లైట్ అటెండెంట్‌గా వెళ్లింది. ఆ విమానం కరాచీ సమీపంలో హైజాక్‌కు గురైనపుడు ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరించిన ఆమె, చివరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు నీరజ, అశోక చక్ర అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. కమర్షియల్ థ్రిల్లర్‌ను తలపించే ఈ పాయింట్లు సినిమాగా తెరకెక్కించటానికిఉపయోగపడటంతో పాటు ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాయంటుంది సోనమ్ కపూర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు రామ్ మాధ్వాని దర్శకుడు, బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ మరో కీలక పాత్రలోనటిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబందించిన టైటిల్ తో పాటు పూర్తి వివరాలను చిత్రయూనిట్ వెల్లడించనుంది. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన షబానా తల్లి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ అజ్మీ మంగళవారం అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆమెను దక్షణి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఛాతీ భాగంలో తీవ్ర నొప్పి కలగడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. షౌకత్‌కు వైద్య చికిత్స జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. షబానా అజ్మీ రాత్రి అంతా ఆస్పత్రిలో తల్లి వద్ద ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. షబానా అజ్మీ తల్లి షౌకత్ అజ్మీ ప్రముఖ నాటక కళాకారిణితోపాటు మంచి నటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
ఆ నటికి కుక్కలంటే భయమట
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి, సామాజిక వేత్త షబానా అజ్మికి కుక్కలంటే భయమని చెప్పింది. ప్రస్తుతం నీరజ్ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె.. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కుక్కలతో చిత్రించాల్సి ఉండి వాటిని తీస్తున్న సమయంలో చాలా అసహనంగా అనిపిస్తుందంట. సినిమా సెట్లో కుక్కలు తన దగ్గరకు రావడం, తన స్పర్షించడం వంటివి చూసి కొంత భయం, కొంత చిరాకు, కొంత అసహనం వస్తుందని చెప్పారు. తాను ఎప్పుడు కుక్కలతో స్నేహం చేయలేదని, అలాగని తనకు కుక్కలంటే ఇష్టం లేదని కాదని, భయంవల్లే ఇలాంటి పరిస్థితి అని చెప్పుకొచ్చింది. -
షబనా కీ ఆవాజ్
-
బీ యాక్టివ్
-
బీ యాక్టివ్
నటిగా, సామాజిక బాధ్యతగల వ్యక్తిగా షబానా అజ్మీ.. అందరికీ సుపరిచితమే. ఆదివారం నగరంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలెంటరీ అసోసియేషన్ నిర్వహించిన ఓ సదస్సుకు షబానా, డెరైక్టర్ మహేష్‌భట్ పాల్గొన్నారు. నేటి సినిమాల్లో మహిళల్ని ఆటబొమ్మలుగా చిత్రీకరించడం, దేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై జరిగిన చర్చలో వీరివురూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళలు, సినిమాలపై షబానా ఏమన్నారంటే..కేవలం సెలబ్రిటీలు ప్రచారం చేసినంత మాత్రాన ఆడవాళ్లపై అత్యాచారాలు తగ్గవు. స్త్రీ భ విత అందరి బాధ్యత అనేలా ప్రతి ఒక్కరిలోనూ ప్రేరణ కలగాలి. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినా కూడా వారిపై అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పురిటిలోనే చాలామంది ఆడపిల్లలు చనిపోతున్నారు. అది మాత్రమే కాక ఆడ శిశువని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. అ అరాచకత్వం పూర్తిగా నశించాలి. మై డియర్ గర్ల్స్ బీ యాక్టివ్. హైదరాబాద్ నా పుట్టినిల్లు నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఆ తర్వాత హై స్కూలింగ్, కాలేజీ అంతా ముంబైలో సాగింది. కానీ ఇక్కడ నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. హైదరాబాద్‌కి ఎప్పుడూ వచ్చినా అందరినీ కలవడానికి ప్రయత్నిస్తా. ఇక్కడ రుచులు అమోఘం. ఇంకా రకరకాల కాస్ట్యూమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఐ లవ్ మై మదర్ ల్యాండ్. - ఎస్.శ్రావణ్‌జయ -
ఆరుపదుల్లోనూ అందంగా...
సాధారణంగా ‘ఫ్యాషన్’ అనగానే అందరూ ‘యువతకు మాత్రమే’ కదా... అనుకుంటారు. ఫ్యాషన్ షోలు.. ర్యాంప్ వాక్‌లు వారికోసమేనని భావిస్తుంటారు. కానీ ఫ్యాషన్ ఒక వయసుకు మాత్రమే చెందినది కాదు. అన్ని వయసుల వారికీ ‘ఫ్యాషన్ మంత్ర’ అవసరమైనదే! బాలీవుడ్ తారలు హేమమాలిని, షబానా అజ్మి, శోభా డే, కిరణ్ ఖేర్...లు ఆరుపదుల వయసులోనూ అందంగా కనిపిస్తుంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు వారు అప్పటి ట్రెండ్స్‌ను అనుసరించారు. వయసు పైబడ్డాక వచ్చిన హుందాతనాన్ని తమ వేషధారణతో అందంగా మలచుకుని ఇప్పటికీ అబ్బురపరుస్తుంటారు. వార్ధక్యం ఓ వరంగా భావించే అందరూ తమ శరీరాకృతికి తగిన వేషధారణతో ఎదుటివారి ప్రశంసలను పొందుతుంటారు. ప్రయత్నిస్తే ‘ఫ్యాషన్ ఐడల్’ అనే కితాబును మీరూ పొందవచ్చు. నూరేళ్లలో కేవలం నూరు వసంతాలు మాత్రమే చూస్తారనుకుంటే పొరబాటు. ప్రతి మాసం వసంత ం, ప్రతి రుతువు ప్రీతికరమైన క్రతువు కావాలంటున్నారీ నారీనరులైన నిత్యయువకులు. యాభై ఏళ్లుగా తడబడని అడుగులతో మడమ తిప్పని సినీ రాఘవ ఓ ఉదాహరణ. ఎనభైమూడేళ్ల ఈ వయసులోనూ నా మనసుకు ఇరవై మూడే... అంటున్న సింగీతం మరో తారా తార్కాణం. పొట్ట చెత్తబుట్ట కాదనీ... మేనిని మెరిపించే పోషకాల సెజ్జ అని, యౌవనపాఠాలకు ఒజ్జ అనీ చెప్పే రేఖ మాటలను మీ చేతి రేఖలుగా చేసుకోండి. నిత్యయౌవనులైన వాళ్లను ఫాలో అవ్వండి. ఎప్పటికీ యంగ్ఫెలోస్గా ఉండండి. వీళ్లు... కదంతొక్కుతూ, పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ఉండే యువపెద్దలు. వీళ్లు... ఆరుపదుల్లో పదహారుల స్ఫూర్తి పరవళ్లు తొక్కే ఉరవళ్ల వాగులు.ఇక కృష్ణా రామా అనుకునే వయసులో యువతకు గీతోపదేశాలూ, చెడు పట్ల అసురసంహారాలు చేసీ, చేయించే వృద్ధయువతరం వీళ్లు. క్యాలెండర్ సాక్షిగా పుట్టి,తేదీలూ, ఏడాదుల పరంగా మాత్రమే యువకులై... ప్రవృత్తిపరంగా మాత్రం ఎముకలు కుళ్లీ, వయసు మళ్లీ ప్రవర్తిస్తుంటే వాళ్లలో నెత్తురు మండించీ, శక్తులు నిండించీ స్ఫూర్తిని రగిలించే సీనియర్ సిటిజెన్స్ వీళ్లు. వీరినుంచి పాఠాలు నేర్చుకుని తమ యువజన హృదయాలను మరింత స్ఫూర్తిమంతం చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మా ‘ఫ్యామిలీ’ అన్ని పేజీలనూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ యువపెద్దలకూ, పెద్దయువకులకూ సలాం చేస్తూ అంకితం చేస్తోంది సాక్షి ఫ్యామిలీ. కేశాలంకరణ ... షబానా అజ్మికి ప్రత్యేకం! బాలీవుడ్ తార షబానా అజ్మి ఆధునిక, సంప్రదాయ వేషధారణలలో కనువిందు చేస్తుంటారు. ‘దుస్తులు సౌకర్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంగా ఉండగలం’ అంటూ ఈ వయసు వారికి మరిన్ని సూచనలు ఇస్తున్నారు. ‘కేశాలంకరణలో ఆధునికంగా కనిపించడానికి ఇష్టపడతాను. అందుకే షార్ట్ హెయిర్ కట్ని ఎంచుకుంటాను. మెరుపులీనే మేకప్‌కి దూరంగా ఉంటాను. కనులు, కేశాలు, చర్మ నిగారింపు మీద దృష్టిపెడతాను. చీరలో, పైజామా కమీజ్‌లో సంప్రదాయతను ఒలికించడమే కాదు... జీన్స్, స్కర్ట్స్ వంటి ఆధునిక దుస్తులు కూడా భయం లేకుండా ధరిస్తాను.’ ఆధునికం... శోభా డే! నవలా రచయిత్రిగా, సామాజికవేత్తగా శోభా డే పేరు చాలా మందికి సుపరిచితమైనది. 66 ఏళ్లు నిండినా ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణలో ఇప్పటికీ ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉంటారు శోభా డే! ‘ఎలాంటి వస్త్రధారణలో అయినా సంప్రదాయ అలంకరణ వస్తువులను పక్కన పెట్టేయాలి. సిల్క్ స్కార్ఫ్ మెడలో వేసుకుంటే మెటాలిక్ కాపర్, వెండి, ప్రాచీన కాలంనాటి నగలుగా కనిపించే చుంకీ ఆభరణాలు వయసును ఉన్నదానికన్నా తక్కువగా చూపిస్తాయి. పెద్ద కంఠహారం ధరిస్తే మెడపై ముడతలు కూడా కనిపించవు.’ కళాత్మకం... కిరణ్ ఖేర్! వెండితెర, బుల్లితెర నటిగా, టెలివిజన్ కార్యక్రమాలలో అతిథిగానూ కిరణ్ ఖేర్ అందరికీ సుపరిచితమే! పేరు చెప్పగానే ఆమె ఆహార్యం గ్రాండ్‌గా కళ్లముందు కదులుతుంది. పెద్ద అంచులున్న చీరలు, పెద్ద పెద్ద ఆభరణాలను ఆమె ధరిస్తారు. ‘ప్రాచీన కళకు ప్రతిరూపంగా నిలిచే ఆభరణాలు ఏ లోహంతో తయారైనవైనా నా అలంకరణ సామగ్రిలో భాగమైపోతాయి. ఎంబ్రాయిడరీ, చేనేత చీరలు నన్ను మరింత హుందాగా చూపిస్తాయి. అందుకే వాటినే ఇష్టపడతాను.’ సంప్రదాయం... హేమమాలిని! అందానికి సరిపోలే అర్థంలా కనిపిస్తారు హేమమాలిని. నాడు - నేడు నిగనిగలాడే మేని వర్చస్సు, దానికి తగ్గ అలంకరణ, వేషధారణతో ఆరుపదులు దాటినా ఆకర్షణీయత ఆమె సొంతం. ‘ఏజ్ లెస్ బ్యూటీ’గా పేరున్న హేమమాలిని అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారు. ‘శరీరం ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్, యోగా-ప్రాణాయామం, డ్యాన్స్.. నన్ను ఇప్పటికీ యవ్వనంగా ఉంచుతున్నాయి. శాకాహారభోజనమే తీసుకుంటాను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. అయితే ఈ సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. రెండు కప్పుల గ్రీన్ టీతో నా దినచర్య మొదలవుతుంది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకుంటుంటాను. రాత్రి ఎనిమిదిలోపు భోజనం ముగిస్తాను. మేకప్‌లో ముందుగా కళ్లకు ప్రాముఖ్యం ఇస్తాను. ఎక్కడకు వెళ్లినా కళ్లకు కాజల్, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటాను. రోజూ క్లెన్సింగ్ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటాను. సంప్రదాయ వస్త్రధారణ నాకు బాగా నప్పుతుంది. చీరలు వయసుకు తగిన హుందాతనాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. అందుకే రకరకాల చీరలను ధరించడానికి ఇష్టపడతాను. అయితే ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా జాగ్రత్తపడతాను.’ -
బాలీవుడ్ గాడ్‌మదర్.. షబానా అజ్మీ
ఏకంగా ఐదుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఘనత... అందులోనూ వరుసగా మూడేళ్లు ఈ అవార్డు అందుకున్న ఘనత ఆమె సొంతం. రంగస్థల పునాదిని విడవకుండానే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఘనత కూడా ఆమెకే చెల్లింది. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేందుకు కాలేజీలో చదువుకున్న మనస్తత్వ శాస్త్రం ఆమెకు బాగానే ఉపకరించింది. వైవిధ్య భరితమైన పాత్రలు, విలక్షణమైన నటనకు చిరునామా షబనా అజ్మీ. హైదరాబాద్‌లో సాంస్కృతిక వాతావరణం గల కుటుంబంలో పుట్టింది. తల్లి షౌకత్ అజ్మీ రంగస్థల నటిగా ప్రసిద్ధురాలు. తండ్రి కైఫీ అజ్మీ సుప్రసిద్ధ కవి. వారిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. వారి ఇల్లు ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులతో సందడి సందడిగా ఉండేది. అలా చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలం మధ్య పెరిగింది షబానా. ఆమె సినిమాల్లోనూ ఆ భావజాల ప్రభావమూ కనిపిస్తుంది. ఆమె బాల్యంలోనే అజ్మీ కుటుంబం బాంబేకి తరలిపోయింది. షబానా అక్కడే సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. తర్వాత నటనపై ఆసక్తితో పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (ఎఫ్టీఐఐ) చేరింది. ఎఫ్టీఐఐ 1972 బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచింది. ‘అంకుర్’మే ఆరంభం... షబానా నట ప్రస్థానం ‘అంకుర్’తో ప్రారంభమైంది. మరో ‘హైదరాబాదీ’ శ్యామ్ బెనగళ్‌కు దర్శకుడిగా ఇదే తొలిచిత్రం. హైదరాబాద్‌లో జరిగిన నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం మరో విశేషం. ఇందులో షబానా సహజ నటన సినీ విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలిచిత్రమే ఆమెకు ఉత్తమ నటిగా 1975లో జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. నిజానికి ‘అంకుర్’ కంటే ముందే కె.ఎ.అబ్బాస్ చిత్రం ‘ఫాస్లా’, కాంతిలాల్ రాథోడ్ చిత్రం ‘పరిణయ్’లకు షబానా సంతకాలు చేసింది. వాటి తర్వాత సంతకం చేసిన ‘అంకుర్’ ముందుగా విడుదలైంది. ఆ తర్వాత ‘అర్థ్’ (1983), ఖాందార్ (1984), ‘పార్’ (1985), గాడ్ మదర్ (1999) కూడా షబానాకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్లో సమాంతర సినిమాల స్వర్ణయుగం మొదలైన కాలంలో తెరపైకి వచ్చిన షబానాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఇలాంటి సినిమాలతోనే. అలాగని ఆమె ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ వంటి కమర్షియల్ సినిమాలూ చేయకపోలేదు. సత్యజిత్ రే దర్శకత్వంలో ‘షత్రంజ్కే ఖిలాడీ’, మృణాల్‌సేన్ దర్శకత్వంలో ఖాందార్, జెనెసిస్, ఏక్ దిన్ అఛానక్ వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. సినిమాల్లో తలమునకలుగా ఉంటూనే, రంగస్థలంపైనా విరివిగా ప్రదర్శనలు ఇచ్చే షబానా అంకితభావం హాలీవుడ్‌నూ ఆకట్టుకుంది. జాన్ ష్లెసింగర్ దర్శకత్వంలో ‘మేడమ్ సౌసాజ్కా’, రోలండ్ జాఫీ దర్శకత్వంలో ‘సిటీ ఆఫ్ జాయ్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో షబానా నటించింది. సినీ కెరీర్ ఊపులో ఉన్న సమయంలోనే బాలీవుడ్ గీతరచయిత జావేద్ అక్తర్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సైతం ఆమె ‘ఫైర్’ వంటి సాహసోపేతమైన సినిమాల్లోనూ నటించింది. దీపా మెహతా చిత్రం ‘వాటర్’లో శకుంతల పాత్ర కోసం షబానా గుండు చేయించుకుంది. దీనిపై వివాదాలు తలెత్తడంతో కొంత షూటింగ్ తర్వాత అటకెక్కింది. ఐదేళ్ల తర్వాత తిరిగి షూటింగ్ చేపట్టినా, షబానా స్థానంలో సీమా బిశ్వాస్ ఆ పాత్ర ధరించింది. సామాజిక చైతన్యశీలి... షబానా నటనకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక కార్తకర్తగానూ ఆమెది చురుకైన పాత్ర. బాలలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం పలు ఆందోళనల్లో పాల్గొంది. మత సామరస్యం కోసం ఢిల్లీ నుంచి మీరట్‌కు నాలుగు రోజుల యాత్రలోనూ పాల్గొంది. ఎయిడ్స్ బాధితులు, హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారుల కోసం ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న షబానా, బెంగాలీ చిత్రం ‘మేఘ్లా ఆకాశ్’లో ఎయిడ్స్ రోగులకు చికిత్స చేసే వైద్యురాలి పాత్రలో సహజ నటనను ప్రదర్శించింది. భారత ప్రభుత్వం ఆమెను 1997లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఆమెను 1998లో గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. భారత ప్రభుత్వం ఆమెను 1988లో ‘పద్మశ్రీ’, 2012లో ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. ఇవేకాకుండా, నటిగా షబానా పలు అంతర్జాతీయ అవార్డులనూ పొందింది. - పన్యాల జగన్నాథదాసు -
'మానాన్నను నవాజ్ షరీఫ్ ఆరాధించేవారట'
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైఫీ అజ్మిని నవాజ్ షరీఫ్ ఆరాధించేవారని తెలుసుకోవడం ఆనందం కలిగించిందని షబానా తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని నవాజ్ తనతో అన్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు సంయుక్తంగా చిత్రాలు నిర్మించే విషయంపై నవాజ్ షరీఫ్ తో చర్చించానని షబానా వెల్లడించారు. అయితే ఇరుదేశాలు సంయుక్తంగా చిత్రాలను నిర్మించాడానికి షరీఫ్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఓ సందేశంతో నవాజ్ షరీఫ్ వచ్చారని షబానా ఆజ్మీ తెలిపారు. -
హోలీ రోజు ఏం చేస్తున్నారు ?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతా సోమవారం హోలీ ఆడుతున్నారు. మరి బాలీవుడ్ తారల పరిస్థితి ఏంటి ? షబానా ఆజ్మీ, మనోజ్ బాజ్‌పేయి, రాజ్‌కుమార్ రావు వంటి తారలు పండుగ జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. కొత్తతరం బ్యూటీలు పరిణీతి చోప్రా, ఆలియా భట్, నర్గిస్ ఫక్రీ వంటి వాళ్లు మాత్రం షూటింగుల వల్ల ఈ రంగుల ఉత్సవానికి దూరమవుతున్నారు. హోలీ గురించి వీళ్లంతా చెప్పే కబుర్లు ఇవిగో.. ఫర్హాన్ అఖ్తర్: కుటుంబ సభ్యులతో గడపడానికి చక్కని పండుగ ఇది! పరిణీతి చోప్రా: ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. కాబట్టి సోమవారం కూడా పని చేయాల్సిందే. ఆయుష్మాన్ ఖురానా: హోలీ అంటే పెద్దగా ఇష్టపడను. మా ప్రాంతంలో ‘రౌడీ హోలీ’ జరుగుతుంటుంది. పండుగ నాడు కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతాను. ఆలియా భట్: నాకు హోలీ పండుగ లేదు. హంప్టీ శర్మ కీ దుల్హానియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను రాజ్‌కుమార్ రావు: కుటుంబం, స్నేహితులతో కలిసి హోలీ జరుపుకుంటున్నాను. రంగులు గుమ్మరించుకోవడం ఏమీ ఉండదు. గులాల్ చల్లుకోవడం వరకే.. షబానా ఆజ్మీ: నా పుట్టిళ్లు జానకీ కుటీర్‌లో సంప్రదాయబద్ధంగా హోలీ జరుపుకుంటాం. సినిమా, నాటక రంగాలకు చెందిన మా స్నేహితులు వస్తారు. రిషీ కపూర్: షూటింగ్ కోసం చండీగఢ్‌లో ఉన్నాను. రెండు రోజుల సెలవు వచ్చింది. 18 రోజుల తరువాత ముంబైకి వెళ్తున్నాను. అయితే హోలీ ఆడను. నర్గిస్ ఫక్రి: మై తేరా హీరో సినిమా ప్రచార కార్యక్రమాలతో తీరిక లేదు. కాబట్టి హోలీ ఆడే అవకాశాలు తక్కువే. వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తా. మనోజ్ బాజ్‌పేయి: హోలీ ఆడడం ఇష్టముండదు. ఈసారి నా కూతురు బలవంతం చేస్తోంది. తప్పేలా లేదు. రోణిత్ రాయ్: చాలా ఏళ్లుగా హోలీ జరుపుకోవడం లేదు. మనీశ్ పాల్: వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో హోలీ ఆడుతున్నాను. -
హైవేలో ఆలియా యాక్షన్ సూపర్: షబానా అజ్మీ
స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన 'హైవే' చిత్రంలో మహేష్ భట్ కూతురుఆలియా భట్ నటన చాలా బాగుందని అలనాటి నటి షబానా అజ్మీ ప్రశంసలు కురిపించారు. ఆమె నేరుగా భట్ ఇంటికి వెళ్లి ఆలియాకు, ఆమె తల్లిదండ్రులకు స్వయంగా అభినందనలు తెలిపారు. 20 ఏళ్ల వయసులోనే ఆలియా అద్భుతంగా నటించిందని చెప్పారు. పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న షబానా అజ్మీ.. ఆలియా సహజనటి అని, ఏ రకంగా చూసినా అద్భుతంగా చేసిందని తెలిపారు. తన భర్త జావేద్ అక్తర్‌తో కలిసి నేరుగా ఆలియా ఇంటికి వెళ్లినట్లు ఆమె చెప్పారు. తామిద్దరికీ ఆమె నటన చాలా నచ్చిందని, ఆలియాను చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు. అయితే.. ఆలియా తండ్రి మహేష్ భట్ మాత్రం హైవే సినిమాను 1982లో షబానా నటించిన 'అర్థ్' సినిమాతో పోల్చారు. ఆ సినిమాకు గాను ఆలియా భట్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. మహేష్ ఏదో ఆషామాషీగా ఆ మాట అనలేదని, అలాగే ఆలియా తన కూతురు కాబట్టి కూడా చెప్పలేదని, నిజంగానే ఆమె పనితీరు అందులో అంత అద్భుతంగా ఉందని అన్నారు. ఆలియాను ఎంతో ముద్దుగా చూసుకునే ఆమె అక్క పూజాభట్ కూడా ఈ సినిమాను ప్రశంసించింది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్రంలో ఆమె యువనటిగా వస్తే, హైవేతో పూర్తి స్థాయి నటిగా నిరూపించుకుందని, ఆమెను చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పింది. ఇంతియాజ్ అలీకి ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానంది. -
బాలీవుడ్ నటి షబానా ఆజ్మీకి ఐదవ గౌరవ డాక్టరేట్!
బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీకి తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. ఫిబ్రవరి 5న జరిగే ఓ కార్యక్రమంలో తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారని షబానా ఆజ్మీ ట్విటర్ లో వెల్లడించారు. షబానా ఆజ్మీకి ఇది ఐదవ గౌరవ డాక్టరేట్ కావడం విశేషం. 2003లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ, 2007లో యార్క్ షైర్ లోని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, 2008లో ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, 2013లో సిమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను షబానా ఆజ్మికి ప్రకటించారు. 1974లో శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన అంకుర్ చిత్రం ద్వారా బాలీవుడ్ లో ప్రవేశించిన షబానా ఆజ్మీ ఇప్పటి వరకు 120 చిత్రాల్లో నటించారు. సామాజిక కార్యకర్తగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు, బాలల సంరక్షణ కోసం షబానా ఆజ్మీ సేవలందిస్తున్నారు. Honoured and humbled to be getting a Doctorate from TERI university on 5th Feb. It is my 5th!— Azmi Shabana (@AzmiShabana) February 3, 2014 -
స్వరం వినిపించాలి బలం నిరూపించాలి
మహిళలు బయటికి రావాలి, వాళ్లు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని చాలామంది సందేశాలు ఇస్తుంటారు. అయినా కూడా ఇప్పటికీ మనదేశంలో చీకట్లోనే మగ్గుతోన్న స్త్రీలు చాలామంది ఎందుకున్నట్టు! ఎందుకంటే... మాటలు చెప్పే ఎవరూ వారికి చేయూతనివ్వరు. నువ్విది చేయగలవు అంటూ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయరు. ఇలా చెయ్యి అంటూ దారి చూపించాలని అనుకోరు. జాతీయాదాలను లెక్కలేసి, ఎగుమతి దిగుమతులను విదేశీ మారకద్రవ్యాలను అంచనాలు వేసి అభివృద్ధిని కొలవడం నా దృష్టిలో సరికాదు. అసలు ఓ దేశపు అభివృద్ధి ఈ విషయాల మీద కాదు ఆధారపడి ఉండేది. ఏ దేశంలో మహిళల స్థితిగతులు బాగుంటాయో, ఏ దేశంలో మహిళలు చైతన్యవంతులుగా ఉంటారో... ఆ దేశం నిజంగా అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క. నిజానికి ఇప్పటి మహిళలకు తెలివితేటలు ఉన్నాయి. సాధించే తెగువ, ముందడుగు వేసే తెగింపు ఉన్నాయి. కానీ ఎన్నో అవరోధాలు వాళ్ల కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ప్రోత్సహించడం సంగతి తర్వాత, నువ్వు చేయలేవు అంటూ నిరుత్సాహపర్చి వెనక్కి లాగేసేవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతుంటే ఏ మహిళ అయినా ఎలా ముందుకు సాగుతుంది! మన మహిళలు విజయం సాధించాలంటే వారికి కావలసింది కాస్తంత ప్రోత్సాహం. అదే దొరికిననాడు మహిళలు ఈ సమాజాన్నే మార్చేయగలరు. రాజకీయాలను సైతం మలుపు తిప్పగలరు. ఉన్నత పదవులను అలంకరించగలరు. అభివృద్ధి అనేదానికి అసలైన నిర్వచనాన్ని ఇవ్వగలరు. కాబట్టి మాటలు కాదు, మనకి చేతలు కావాలి. చెప్పి ఊరుకోవడం కాదు, చేసే దిశగా వారిని నడిపించాలి. అప్పుడు ఏ మహిళా వంటింటికి పరిమితమైపోదు. కట్టుబాట్లకు తలవంచి నిస్సహాయంగా మిగిలిపోదు. తన స్వరం బలంగా వినిపిస్తుంది. తన బలం నిజంగా నిరూపిస్తుంది. - షబానా అజ్మీ, నటి, సంఘ సేవకురాలు -
వారి దారిలో వెళ్తాను : పూర్ణ
‘‘అందం ఎదుటివారిని త్వరగా ఆకర్షిస్తుంది. కానీ ఒక నటిని నిలబెట్టేది మాత్రం నటనే’’ అంటున్నారు అందాల భామ పూర్ణ. గ్లామర్ డోస్ తక్కువ అవడం వల్లే మీకు అవకాశాలు అనుకున్న స్థాయిలో రావడంలేదేమో! అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్ణ పై రీతిలో స్పందిస్తున్నారు. ఇంకా చెబుతూ -‘‘ప్రతి ఒక్కరికీ టైమ్ వస్తుంది. నాకు రాలేదంతే. మనం ఎంచుకునే పాత్రల బట్టే మన కెరీర్ ఉంటుందని నమ్ముతాన్నేను. నేను సెలక్టివ్‌గా సినిమాలు చేయడానికి కారణం అదే. ఇప్పటివరకూ నేను నటించిన ప్రతి సినిమా నాకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ‘అవును’కు ప్రశంసలు కూడా వచ్చాయి. నేను అందంగా ఉంటానని చాలామంది అంటుంటారు. కానీ గ్లామర్ అనే పదంపై నేను అంత ఆసక్తి చూపను. అర్చన, షబానా ఆజ్మీ లాంటి నటీమణులే నాకు ఆదర్శం. వారిద్దరూ పెద్ద అందగత్తెలు కారు. కానీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. వారి దారిలోనే వెళ్లాలనుకుంటున్నాను’’ అని చెప్పు కొచ్చారు పూర్ణ. -
ర్యాంపుపై అదరగొట్టిన షబానా - జావేద్ అఖ్తర్
ముంబైలో జరుగుతున్న భారత అంతర్జాతీయ జ్యూయెలరీ వీక్ వేదికపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, గేయ రచయిత జావేద్ అఖ్తర్ మెరుపులు మెరిపించారు. దంపతులిద్దరూ కలిసి తొలిసారిగా ర్యాంప్‌పై నడిచి ఆహూతులను అలరించారు. గోలెచా జ్యూయెల్స్ తరఫున వీరు ర్యాంపుపై నడిచి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. 61 ఏళ్ల షబానా ఎరుపు, నలుపు లెహంగా ధరించి, నెక్లెస్ పెట్టుకోగా, జావేద్ అఖ్తర్ నల్లటి షేర్వానీ ధరించి తానూ రకరకాల నగలు పెట్టుకున్నారు. 'రాయల్ ఇండియన్ బ్రైడ్స్' పేరుతో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో అద్భుతమైన కట్ వజ్రాలు, సానపట్టని ముడి వజ్రాలు, ముత్యాలు, పగడాలు, కెంపులు.. ఇలా ఎన్నింటినో ప్రదర్శించారు. ఉమ్రావో జాన్, లక్ బై ఛాన్స్, ద్రోణ లాంటి అనేక సినిమాలకు ఆభరణాలు సమకూర్చడంతో పాటు మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాలను కూడా గోలెచా జ్యూయెలరీ సంస్థ అందించింది. బుధవారం నాటి ప్రదర్శనలో షబానా జంట ధరించిన నగలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రం ఫడ్నిస్ డిజైన్ చేశారు.