ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు మరేదీ సాటిరాదు. నవమోసాలు మోసి, తన ప్రాణాలు పణంగా పెట్టి కన్న బిడ్డల కోసం తల్లి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. తన రక్తాన్ని పాలలా మార్చి పాపాయిల ఆకలి తీర్చే మాతృమూర్తి, వాళ్లను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. అయితే పిల్లల కేరింతలు, ఆటపాటలు చూసి మురిసిపోయే భాగ్యం మాత్రం కొందరు తల్లులకే దక్కుతుంది. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించే వీలు దొరుకుతుంది. ముఖ్యంగా సగటు భారతీయ స్త్రీలకు కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండవు. పేదరికంలో మగ్గే మహిళలు గర్బం దాల్చింది మొదలు బిడ్డల్ని కనేంత వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (చదవండి: వయసులో చిన్నది.. ఔదార్యంలో గొప్పది)
డెలివరీకి ముందు, ఆ తర్వాత కూడా తమ పనులు తాము చక్కదిద్దుకోవడంతో పాటుగా బిడ్డల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంటుంది. కాస్తైనా విశ్రాంతి దొరికే పరిస్థితి ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టే ఫొటోను బాలీవుడ్ ప్రముఖ నటి ట్విటర్‌లో షేర్ చేశారు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న ఓ మహిళ ఓవైపు నెత్తిపై ఇటుకలు మోస్తూనే, మరోవైపు వస్త్రాన్ని ఉయ్యాలగా మార్చి తన బిడ్డను వీపున గట్టుకున్న ఆ ఫొటోకు..‘మా తుజే సలాం’ అంటూ క్యాప్షన్ జతచేసి తల్లి ప్రేమకు నీరజనాలు అర్పించారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ఫొటో ఇప్పటికే 10 వేలకు పైగా లైకులు సాధించి, రీట్వీట్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తల్లిప్రేమను గుర్తు చేసుకుంటూ, షబానా అజ్మీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Ma tujhe salaam 🙏 pic.twitter.com/xzyY4Rz1k8
— Azmi Shabana (@AzmiShabana) September 23, 2020
Comments
Please login to add a commentAdd a comment