
అంతర్జాతీయ గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి, భారత పార్లమెంటు సభ్యురాలు షబానా అజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటిగా ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులు అందుకుంది. పైగా యూఎస్ గుడ్‌విల్ అంబాసిడర్ కూడా. ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటారు.
అలానే తాజాగా తన ఫుడ్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ ఒక చోటే బ్రేక్ తీసుకుని మరీ ఇష్టంగా తిన్న తన ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను పూణే నుంచి తిరుగు పయనంలో ఓ ప్రముఖ ఫుడ్ కోర్టు వద్ద ఆగమని, అక్కడ తాను తనకెంతో ఇష్టమైన వడపావ్ ఆస్వాదించనట్లు చెప్పుకొచ్చారు.
అలాగే అక్కడ మహారాష్ట్ర వంటకాలు కూడా చాలా బాగుంటాయని తెలిపారు. ఆమె నటించిన 'కైఫీ ఔర్ మెయిన్' తారాగణంతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చారు షబానా అజ్మీ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment