
రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్‌లో నటించింది. నటుడు ధర్మేంద్రతో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన భర్త అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు వెల్లడించారు.
షాబానా అజ్మీ మాట్లాడుతూ..' నాకు ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించా. అయితే ఇందులో లిప్‌లాక్ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ చెప్పాడు. నా భర్త అనుమతి తీసుకొని చెబుతా అని అన్నా. ఇదే విషయంపై నా భర్తను అనుమతి అడిగా. ఆయన చాలా చిన్న విషయం.. దీనికి నా అనుమతి ఎందుకు' అని అన్నారు. ఈ చిత్రంలో నా రోల్ ఎప్పటికీ గుర్తుంటుందని షాబానా తెలిపారు.
అయితే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు కరణ్ జోహార్. అయితే సీక్వెల్‌లో మరికొందరు కొత్తవాళ్లు ఉంటారని కరణ్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment