Lip Lock Scene
-
అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్లో నటించింది. నటుడు ధర్మేంద్రతో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన భర్త అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు వెల్లడించారు.షాబానా అజ్మీ మాట్లాడుతూ..' నాకు ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించా. అయితే ఇందులో లిప్‌లాక్ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ చెప్పాడు. నా భర్త అనుమతి తీసుకొని చెబుతా అని అన్నా. ఇదే విషయంపై నా భర్తను అనుమతి అడిగా. ఆయన చాలా చిన్న విషయం.. దీనికి నా అనుమతి ఎందుకు' అని అన్నారు. ఈ చిత్రంలో నా రోల్ ఎప్పటికీ గుర్తుంటుందని షాబానా తెలిపారు.అయితే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు కరణ్ జోహార్. అయితే సీక్వెల్లో మరికొందరు కొత్తవాళ్లు ఉంటారని కరణ్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. -
'అబ్బో ఎంత ప్రేమో'.. వేదికపైనే ముద్దులు పెట్టిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే సెలబ్రిటీ జంటలలో ఒకరు. ఆమె భర్త నిక్ జోనాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్లో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిక్.. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి ఇండియాకు చాలాసార్లు వచ్చాడు. ఇప్పటికే ఈ జంటకు మాల్టీ మేరీ అనే కూతురు కూడా ఉంది. అయితే ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో నిక్ జోనాస్ ప్రదర్శన ఇస్తున్నారు. తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్‌లతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) తాజాగా ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. వేదికపై భర్తను ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ సందడి చేసింది. యాంకీ స్టేడియంలో ఒక సంగీత కచేరీలో ప్రియాంక ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో వేదిక పక్కనే ఉన్న ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవలే సంగీత కచేరీకి హాజరైన ప్రియాంక తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. కాగా.. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో సరోగసీ ద్వారా కుమార్తె మాల్తీ మేరీకి స్వాగతం పలికారు. ప్రియాంక.. జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌లతో స్క్రీన్ పంచుకోనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే! ) View this post on Instagram A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi) -
విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్ సీన్ ?
Rumours: Samantha Lip Lock Scene With Vijay Devarakonda In Kushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్-సమంత కలిసి నటిస్తున్నాన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటెన్స్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్-సామ్ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ చేయడంతోనే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సీన్స్ క్రియేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సన్నివేశాలకు ఉన్న డెప్త్‌ను అర్థం చేసుకున్న విజయ్-సమంత లిప్‌లాక్ సీన్లలో నటించేందుకు ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఈ వార్తల్లో ఎంత నిజముందో డైరెక్టర్ క్లారిటీ ఇస్తే గానీ, మూవీ విడుదలయ్యాక కానీ చెప్పలేం. కాగా గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ స్టైలిష్‌గా కనిపించగా, సామ్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా ఆకట్టుకుంది. చదవండి: టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న అనుపమకు తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కాగా హీరోయిన్స్‌కు లిప్‌లాక్ సీన్స్ ఎంతో క్రేజ్‌ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ కానీ ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి అనుపమ ట్రోల్స్ బారిన పడింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో అగ్ర నిర్మాత దిల్ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్గా అనపమ నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించన అనుపమా రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయి నటించిందట. ఇక బడా నిర్మాత వారసుడి సినిమా కావడంతో ఈ మూవీని దర్శకుడు భారీగానే ప్లాన్ చేశాడు. అతడికి ఎలాగైన సక్సెస్ ఇవ్వాలని దర్శకుడు ఆరాట పడుతున్నాడు. చదవండి: అవును జాకీతో ప్రేమలో ఉన్నా, కానీ అది రూమరే.. నేనే చెప్తా: రకుల్ ఈనేపథ్యంలో రౌడీ బాయ్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు హీరోహీరోయిన్ల మధ్య భారీగానే లిప్‌లాక్ సీన్లు పెట్టారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో కూడా కిస్ సీన్స్ చూపించి ఆకట్టుకున్నారు మేకర్స్. కానీ ఇదే సీన్‌పై అనుపమను ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘నీకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదా.. ఎంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్ ఇచ్చేస్తావా?, కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్ కోసం ఇంతగా దిగజారాలా’ అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి మరికొందరైతే ఏకంగా ‘నీ నెక్ట్ సినిమా మా హీరో చేయాలని, అతడికి కూడా లిప్‌లాక్ ఇవ్వాల్సిందే’ అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్ అనుపమకు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అనుపమ మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ఈ సినిమాలో 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. -
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించారు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. అలాగే అల్లు శిరీష్, నవీన్ చంద్రకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో కార్తీకేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని హీరో తల్లిగా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఆమని ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్, సినిమాల్లో తల్లి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు సినిమాలో నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి చర్చించారు. చిత్రంలో సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు. ‘నేను నా వృత్తిలో భాగంగా చేశాను. నరేష్ గారు సీనియర్ నటుడు, ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి ఆయన తన గౌరవాన్ని చాటుకున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా చందమామ కథలు చిత్రంలో ఆమని.. నరేష్‌తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. చదవండి: జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్.. ఆ అమ్మాయి అయినా ఓకేనట -
మీ టూ వల్ల తప్పించుకున్నాను!
‘మీ టూ’ అంటూ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎప్పట నుంచి అయితే బయటకు చెబుతున్నారో అప్పటి నుంచి ఓ మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి. అందుకు ఓ ఉదాహరణ సాయి పల్లవి చెప్పిన ఒక విషయం. ఇటీవల ఓ సందర్భంలో ‘మీ టూ’ ఉద్యమం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘కథలో భాగంగా హీరోతో పెదవి ముద్దు సన్నివేశంలో నటించాలని ఒక దర్శకుడు అడిగారు. అలాంటి సన్నివేశాలు చేయడం నాకు అసౌకర్యంగా ఉంటుందన్నాను. ఇంతలో, హీరో కలగజేసుకొని ‘మీరు బలవంతపెడితే ‘మీ టూ’ ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉంద’ని దర్శకుడితో అన్నారు. దాంతో లిప్ లాక్ సీన్‌ని ఆ దర్శకుడు విరమించుకున్నారు. ‘మీ టూ’ వల్ల నేను ఆ సీన్ నుంచి తప్పించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే అది ఏ సినిమా? హీరో ఎవరు? లిప్ లాక్ చేయమన్న దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం సాయి పల్లవి బయటపెట్టలేదు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించిన ‘లవ్‌స్టోరీ’లో ముద్దు సీన్ ఉంది. ట్రైన్ లో చైతూతో ట్రావెల్ చేస్తున్న సీన్లో సాయి పల్లవి, చైతూకి ముద్దుపెడతారు. అయితే ఇది లిప్ లాక్ కాదు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నారామె. మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. -
కరోనా ఎఫెక్ట్: ముద్దు సీన్లు కట్!
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ చైనాను కుదిపేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 800 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. అయితే ఈ ప్రభావం పలు దేశాల సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. చైనాలో ఇప్పటికే సినిమా, సీరియల్ వంటి షూటింగ్‌ల అనుమతులను నిలిపివేసింది. అయితే కరోనా వైరస్ అంతగా ప్రభావం లేని తైవాన్ దేశం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడి టీవీ స్టేషన్స్ దర్శకనిర్మాతలకు పలు సూచనలు చేసింది. నటీనటులు కరోనాతో పాటు మరే వైరస్ బారిన పడకుండా ఉండేందుకు లిప్ లాక్ సీన్స్ లేకుండా షూటింగ్ జరపాలని కోరినట్లు అక్కడి స్థానిక మీడియా ప్రచురించింది. అంతేకాకుండా లిప్ లాక్ సీన్స్ ప్రభావం ప్రజలపై పడకుండా సీరియల్స్, సినిమాల్లో ముద్దు సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులను రద్దు చేసింది. కాగా, నటీనటులు ఏదైనా వైరస్ బారిన పడినా, అనారోగ్యంగా ఉన్నా ముద్దు సన్నివేశాల్లో పాల్గొనొద్దని ఇప్పటికే సింగపూర్ ఆరోగ్య శాఖ అక్కడి సినీ ఇండస్ట్రీకి సూచించింది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. చదవండి: 811కి చేరిన కరోనా మృతుల సంఖ్య కూతురికి గాల్లో హగ్ ఇచ్చిన నర్సు.. ఆకలితో చావాల్సి వస్తుంది, అందుకే ఇలా..! -
మరీ ఇంత ఘాటు ముద్దా?.. హీరోయిన్ ఆగ్రహం
లిప్‌లాక్‌కు ఒప్పుకున్నాను కానీ మరీ ఇంత ఘాటు ముద్దా.. అంటూ నవ కథానాయకి దర్శకుడిపై మండిపడి షూటింగ్ నుంచే వెళ్లిపోయిన సంఘటన ఉట్రాన్ చిత్రంలో చోటు చేసుకుంది. సాట్ సినిమాస్ పతాకంపై రూపొందిన చిత్రం ఉట్రాన్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 31వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి హిరోషిణి హీరోయిన్గా నటించింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన హిరోషిణి హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం ఇది. రాజా గజనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశం వివాదంగా మారింది. దీనిపై చిత్ర వర్గాలు మాట్లాడుతూ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు. ఆ సన్నివేశానికి దర్శకుడు కట్ చెప్పిన తరువాత హీరోయిన్ ఆగ్రహంతో దర్శకుడి వద్దకు వచ్చి మీరు కథ చెప్పినప్పుడు లిప్‌లాక్ సన్నివేశం ఉంటుందనే చెప్పారని, అందుకే తాను ఓకే చెప్పానని అంది. ఇప్పుడు హీరో స్మూచ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసిందన్నారు. అయితే హీరోయిన్ చెప్పింది దర్శకుడికి అర్థంగాక అయోమయంలో పడడంతో హీరోయిన్ తనే ముద్దు గురించి వివరించిందన్నారు. లిప్‌లాక్ అంటే పెదాలపై చుంభించడం అనీ, స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అనీ, హీరో అదే చేస్తున్నారని చెప్పిందన్నారు. హీరో కల్పించుకుని ఈ సారి కరెక్ట్‌గా లిప్‌లాక్ చేస్తానని చెప్పడంతో దర్శకుడు హీరోయిన్‌కు సర్దిచెప్పి నటింపజేశారన్నారు. హీరో మళ్లీ స్మూచ్ కిస్ ఇవ్వడంతో మండిపడ్డ నటి హిరోషిణి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయి కార్వాన్లో కూర్చుందన్నారు. యూనిట్ వర్గాలు ఎంత చెప్పినా వినకుండా ఊరుకు వెళ్లిపోయిందని చెప్పారు. ముద్దుల్లో ఎన్నిరకాలు ఉంటాయో తెలియని దర్శకుడు నటి హరిరోషిణి ఇచ్చిన వివరణతో విస్మయం చెందారని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా నటి వెయిల్ ప్రియాంక, వేల రామమూర్తి, మధుసూదనరావ్, ఆర్.రవిశంకర్, జిన్నా, గానా సుధాకర్, ఒరు కన్ ఒరు కన్నాడీ ఫేమ్ మధుమిత, దర్శకుడు సరవణన్ శక్తి, ఇమాన్‌అన్నాచ్చి, విజయ్ టీవీ ఫేమ్ కోదండం, కాదల్ చిత్ర ఫేమ్ సరవణన్, సులక్షణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రఘునంథన్ సంగీతాన్ని, హాలిక్ ప్రభు ఛాయాగ్రహణను అందించారు. -
ఆ ముద్దుతో పోలికే లేదు
‘రష్మికా మండన్నా ముద్దుకి, నా ముద్దుకి అస్సలు పోలికే లేదు’ అంటున్నారు కథానాయిక హరిప్రియ. ‘తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా’ వంటి చిత్రాల్లో నటించారీ కన్నడ బ్యూటీ. ‘జై సింహా’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించని హరిప్రియ కన్నడలో మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తేజస్వి దర్శకత్వంలో హరిప్రియ, సృజన్ లోకేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎల్లిదే ఇల్లితనకా’ శుక్రవారం (11) విడుదలైంది. ఈ సినిమాలో సృజన్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. ఇది కాస్తా ‘గీత గోవిందం’ చిత్రంలోని విజయ్ దేవరకొండ–రష్మికా మండన్నాల మధ్య వచ్చే ముద్దు సీన్లా ఉందని, ఆ సన్నివేశంలో రష్మికలా హరిప్రియ కూడా జీవించారంటూ సోషల్ మీడియాలో పోలికలు పెట్టారు. వీటి గురించి హరిప్రియ మాట్లాడుతూ– ‘‘నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నా. అయితే అది రష్మికా మండన్నాలా లిప్‌లాక్ సన్నివేశం కాదు. నాది మామూలు ముద్దే’’ అన్నారు. -
ముద్దు రద్దును వెనక్కి తీసుకున్న నటి!
‘‘పెళ్లయ్యాక నటన పరంగా కొన్ని హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నేను, మా ఆయన సైఫ్ అలీఖాన్ ముద్దు సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా కపూర్ పేర్కొన్నారు. కానీ, ముద్దు రద్దు అనే మాటను వెనక్కి తీసుకుని, అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ సీన్లో నటించారామె. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కి అండ్ క’. ఇందులో కబీర్ అనే యువకుడిగా అర్జున్ కపూర్, కియా అనే యువతిగా కరీనా నటించారు. వీళ్ల పాత్రల పేర్లలోంచి ‘కి’, ‘క’ని తీసుకుని ‘కి అండ్ క’ అని పెట్టారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధం చుట్టూ సాగుతుంది. కథానుసారం లిప్ లాక్ ఉంటేనే బాగుంటుందని భావించిన కరీనా నటించారు. అర్జున్, కరీనాల లిప్ లాక్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. -
ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు!
దక్షిణాదిన ఏ హీరోతో నటించాలని ఉంది? అని అడిగితే.. బాలీవుడ్లో ఇరగదీస్తున్న దీపికా పదుకొనే నుంచి ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ద్వారా పరిచయమైన పల్లక్ లల్వానీ వరకూ చెప్పే పేరు మహేశ్‌బాబు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మహేశ్ అనీ, ఆయనతో పాటు టాలీవుడ్లో ఉన్న హీరోలందరి సరసన నటించాలని ఉందని పల్లక్ చెప్పింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య, పల్లక్ నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పల్లక్ తన గురించీ, ఈ చిత్రంలో నటించడం గురించీ చెబుతూ - ‘‘మా నాన్న జితిన్ లల్వాని హిందీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. దాంతో నటన మీద నాకూ ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ముంబయ్‌లోని జైహింద్ కళాశాలలో బీఏ చదువుతున్నా. ఇప్పట్లో కథానాయిక అయ్యే ఆలోచన లేకపోయినా సౌత్‌లో ఓ చిత్రానికి అవకాశం రావడంతో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఆ ఫొటోలు చూసి, రమేశ్ వర్మగారు ఈ సినిమాకి అడిగారు. ఫేస్బుక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వ్యక్తిగతంగా నేను ఫేస్బుక్లో లేను. అయితే, ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎకౌంట్ ఉండేది. అప్పుడు ఓ పది మంది అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్ కూడా చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా’’ అన్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యతో ముద్దు సీన్లో చేశారు.. ఆ సీన్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదా? అనే ప్రశ్న పల్లక్ ముందుంచితే - ‘‘నిజం చెప్పాలంటే ఇబ్బందే. కానీ, అక్కడ ముద్దు పెట్టుకున్నది నేనూ, నాగశౌర్య కాదు. సినిమాలోని అభి, ప్రార్థన పాత్రలు. సీన్‌కి అది అవసరం కాబట్టి, చేశాను’’ అని చెప్పారు. టాలీవుడ్ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయనీ, చదువుకుంటూ నటిస్తాననీ ఈ ఉత్తరాది బ్యూటీ స్పష్టం చేశారు. -
లిప్ లాక్ సీన్ తీసేశాం!
‘‘సందర్భోచితంగా లిప్ లాక్ సీన్ తీశాం. కానీ, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటంతో పంటి కింద రాయిలా ఉంటుందని తీసేశాం’’ అని ‘గాలిపటం’ చిత్రం దర్శకుడు నవీన్ గాంధీ అన్నారు. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన ‘గాలిపటం’ గతవారం విడుదలైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే అందరి ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందని నవీన్ గాంధీ చెబుతూ - ‘‘మాది అనంత్‌పూర్. అక్కడే చదువుకున్నా. ఎమ్ఏ సోషియాలజీ చేశాను. టీచర్‌గా చేయడంతో పాటు కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా చేశాను. అనంతరం గోపీచంద్, రాఘవేంద్రరావు, రాజమౌళి దగ్గర పనిచేశాను. ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ తీసిన వాణిజ్య ప్రకటనలకు సహాయ దర్శకునిగా కూడా చేశాను. నేను, సంపత్ నంది రూమ్ మేట్స్. దర్శకుడు కావాలనే తన ఆశయం ముందు నెరవేరింది. ‘గాలిపటం’తో నా కల కూడా ఫలించింది’’ అని చెప్పారు. ‘గాలిపటం’ క్లయిమాక్స్ చాలా బోల్డ్‌గా ఉందనేవారికి మీ సమాధానం అనడిగితే - ‘‘కొంచెం అడ్వాన్డ్స్‌గా ఉందని చాలామంది అన్నారు. దాన్ని ప్రశంసలా తీసుకున్నాం. ఓ పది, ఇరవయ్యేళ్ల తర్వాత ఎలా ఉంటుందో చూపించాం. ఈ కథకు ఆ ముగింపే కరెక్ట్. నేటి తరం స్వేచ్ఛగా ఉండాలని భావిస్తున్నారు. దాన్నే చూపించాం’’ అన్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని నవీన్ తెలిపారు.