ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు! | Naga Shourya and Palak Lalwani Lip Kiss | Sakshi
Sakshi News home page

ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు!

Published Sat, Jan 2 2016 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు!

ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు!

 దక్షిణాదిన ఏ హీరోతో నటించాలని ఉంది? అని అడిగితే.. బాలీవుడ్‌లో ఇరగదీస్తున్న దీపికా పదుకొనే నుంచి ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ద్వారా పరిచయమైన పల్లక్ లల్వానీ వరకూ చెప్పే పేరు మహేశ్‌బాబు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మహేశ్ అనీ, ఆయనతో పాటు టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరి సరసన నటించాలని ఉందని పల్లక్ చెప్పింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య, పల్లక్ నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
 
 ఈ సందర్భంగా పల్లక్ తన గురించీ, ఈ చిత్రంలో నటించడం గురించీ చెబుతూ - ‘‘మా నాన్న జితిన్ లల్వాని హిందీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. దాంతో నటన మీద నాకూ ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ముంబయ్‌లోని జైహింద్ కళాశాలలో బీఏ చదువుతున్నా. ఇప్పట్లో కథానాయిక అయ్యే ఆలోచన లేకపోయినా సౌత్‌లో ఓ చిత్రానికి అవకాశం రావడంతో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఆ ఫొటోలు చూసి, రమేశ్ వర్మగారు ఈ సినిమాకి అడిగారు. ఫేస్‌బుక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వ్యక్తిగతంగా నేను ఫేస్‌బుక్‌లో లేను. అయితే, ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎకౌంట్ ఉండేది.
 
  అప్పుడు ఓ పది మంది అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్ కూడా చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా’’ అన్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యతో ముద్దు సీన్‌లో చేశారు..  ఆ సీన్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదా? అనే ప్రశ్న పల్లక్ ముందుంచితే - ‘‘నిజం చెప్పాలంటే ఇబ్బందే. కానీ, అక్కడ ముద్దు పెట్టుకున్నది నేనూ, నాగశౌర్య కాదు. సినిమాలోని అభి, ప్రార్థన పాత్రలు. సీన్‌కి అది అవసరం కాబట్టి, చేశాను’’ అని చెప్పారు. టాలీవుడ్ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయనీ, చదువుకుంటూ నటిస్తాననీ ఈ ఉత్తరాది బ్యూటీ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement