Anupama Parameswaran: Netizens Trolls On Lip Lock scene In Rowdy Boys Movie - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్‌

Jan 10 2022 8:44 PM | Updated on Jan 18 2022 6:52 PM

Netizens Trolls Anupama Parameswaran Over Lip Lock In Rowdy Boys Movie - Sakshi

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న అనుపమకు తాజాగా సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కాగా హీరోయిన్స్‌కు లిప్‌లాక్‌ సీన్స్‌ ఎంతో క్రేజ్‌ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్‌ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్‌ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్‌ సీన్‌ చేసేందుకు హీరోయిన్స్‌ ఒప్పుకోరు.

చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్‌, మహిళా కమిషన్‌ ఎంట్రీ

కానీ ఓ డెబ్యూ హీరోతో కిస్‌ సీన్‌ చేసి అనుపమ ట్రోల్స్‌ బారిన పడింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. ఈ చిత్రంతో అగ్ర నిర్మాత దిల్‌ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా అనపమ నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించన అనుపమా రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయి నటించిందట. ఇక బడా నిర్మాత వారసుడి సినిమా కావడంతో ఈ మూవీని దర్శకుడు భారీగానే ప్లాన్‌ చేశాడు. అతడికి ఎలాగైన సక్సెస్‌ ఇవ్వాలని దర్శకుడు ఆరాట పడుతున్నాడు.

చదవండి: అవును జాకీతో ప్రేమలో ఉన్నా, కానీ అది రూమరే.. నేనే చెప్తా: రకుల్‌

ఈనేపథ్యంలో రౌడీ బాయ్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు హీరోహీరోయిన్ల మధ్య భారీగానే లిప్‌లాక్‌ సీన్లు పెట్టారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో కూడా కిస్‌ సీన్స్‌ చూపించి ఆకట్టుకున్నారు మేకర్స్‌. కానీ ఇదే సీన్‌పై అనుపమను ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘నీకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ లేదా.. ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్‌ ఇచ్చేస్తావా?, కిస్‌ సీన్‌ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్‌ కోసం ఇంతగా దిగజారాలా’ అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన నటి

మరికొందరైతే ఏకంగా ‘నీ నెక్ట్‌ సినిమా మా హీరో చేయాలని, అతడికి కూడా లిప్‌లాక్‌ ఇవ్వాల్సిందే’ అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్‌ అనుపమకు వార్నింగ్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్‌ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అనుపమ మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్‌గా మారింది.  ఏకంగా ఈ సినిమాలో 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా  శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement