Prabhas: Hero Launches Ye Zindagi Song From Rowdy Boys Movie, Details In Telugu - Sakshi
Sakshi News home page

Prabhas: రౌడీ బాయ్స్ కోసం రంగంలోకి ప్రభాస్‌

Published Wed, Jan 12 2022 11:23 AM | Last Updated on Wed, Jan 12 2022 12:30 PM

Prabhas Launches Ye Zindagi Song From Rowdy Boys Movie - Sakshi

Ye Zindagi Song Launch by Prabhas: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మేనల్లుడు అశిష్‌ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌.  హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీలవల ఈ సినిమా నుంచి ‘డైట్‌ నైట్‌’అనే పాటను అల్లు అర్జున్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ని పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశారు.

‘యే జిందగీ’అంటూ సాగే ఈ పాట...స్నేహబంధానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా సాగుతుంది. ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా.. రామ్‌ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. అలాగే ఈ సినిమాలోని మరో రెండు పాటలను కూడా ఈ రోజే విడుదల చేయనున్నారు. , 2 గంటలకు, 5 గంటలకు వరుసగా సినిమాలో నుంచి పాటలను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు “రౌడీ బాయ్స్” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement