Ashish Reddy
-
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్‌కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్‌ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్‌గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్‌స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్‌స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్‌గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్‌కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్‌గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'లవ్ మీ' మూవీ ఆడియో వేడుక (ఫొటోలు)
-
'ఒకసారి డేట్‌కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి.. కొన్నిరోజుల ముందు పెళ్లి చేసుకున్నాడు. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. జైపూర్‌లో జరిగిన వివాహానికి పలువురు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్ కన్వెక్షన్‌లో రిసెప్షన్ జరగ్గా.. నాగార్జున, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా క్లాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. విజయ్ వచ్చిన కాసేపటికి రష్మిక కూడా ఈ వేడుకకు రావడం విశేషం. ప్రస్తుతం వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విజయ్ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ఇది రిలీజ్ కానుంది. దీనికి దిల్ రాజు నిర్మాత. మరోవైపు రష్మిక.. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఒకేపెళ్లికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాకపోతే విడివిడిగానే వచ్చారండోయ్. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) Srivalli aka the Ravishing Actress @iamRashmika at hero Ashish wedding reception #RashmikaMandanna #Rashmika #Pushpa2TheRule #DilRaju pic.twitter.com/3LBUbGFCNM — Sai Satish (@PROSaiSatish) February 23, 2024 Brides fan moment🥹💗🤩#dilrajusonreception#VDK #VijayDeverakonda #VijayDevarakonda #rowdy pic.twitter.com/fPt7cRQwTt — SRAVS💛💥 (@happy_souull) February 24, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో.. గ్రాండ్‌గా పెళ్లి వేడుక!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, టాలీవుడ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహా వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పాల్గొన్నారు. ఈ డెస్టినేషన్ గ్రాండ్ వెడ్డింగ్‌లో దిల్ రాజు సందడి చేశారు. డప్పు వాయిస్తూ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. ఫ్యామిలీతో బయలుదేరిన నిర్మాత!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు తమ్ముడు కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. ఈనెల 14న జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తాజాగా వివాహా వేడుక కోసం దిల్ రాజు ఫ్యామిలీ బయలుదేరి వెళ్లారు. జైపూర్ వెళ్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. #TFNExclusive: Ace Producer #DilRaju & Groom @AshishVOffl along with their family members get papped as they jet off to Jaipur for the grand wedding ceremony!! 📸🤩#Ashish #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/IQllj4yVCU — Telugu FilmNagar (@telugufilmnagar) February 12, 2024 -
నితిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన యంగ్ హీరో..!
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్‌లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. -
Ashish Reddy Wedding: నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. కేసీఆర్‌కి ఆహ్వానం
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సోదరుడు అశిష్ రెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. జైపూర్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలకు శుభలేఖలు అందజేస్తున్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు.. తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) -
దిల్ రాజు ఇంట పెళ్లి వేడుక.. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం!
ఇటీవల ఎక్కువగా సినీతారల పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొత్త ఏడాదిలోనూ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావుడి మొదలైంది.గతేడాది సైతం పలువురు టాలీవుడ్ ప్రముఖులు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. 2023లో పెళ్లి చేసుకున్న వారిలో మంచుమనోజ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయారు. తన పెళ్లికి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి వివాహా ఆహ్వాన పత్రికను అందించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా? ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడే. తాజాగా నిర్మాత దిల్‌రాజుతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వచ్చే నెలలోనే ఆశిష్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో ఆతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కాగా.. ఆశిష్ ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందే 2022లో రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. Dil Raju and Shirish personally invited Man of Masses NTR @Tarak9999 for the joyous occasion of Shirish's son, @AshishVoffl 's wedding. pic.twitter.com/5lX1Gw5O90 — Vamsi Kaka (@vamsikaka) January 31, 2024 -
Ashish Reddy: దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు.. ఆంధ్రా అల్లుడు కాబోతున్న హీరో.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
దిల్ రాజు ఇంట వేడుకలు.. యంగ్ హీరో నిశ్చితార్థం..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎంతోమంది బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇదే మంచి సమయం అనుకుని మూడుముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా వెంకటేశ్ రెండో కూతురు నిశ్చితార్థం జరిగింది. తాజాగా దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయ్యాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ఎంగేజ్మెంట్ గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వేలికి ఉంగరం తొడిగాడు ఆశిష్. ఈ నిశ్చితార్థ వేడుకను గోప్యంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్. ఈ సినిమాలో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజైంది. తర్వాత విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్గా నటించింది. ఆశిష్ హీరోగా ఇటీవల ఓ కొత్త చిత్రం పట్టాలెక్కింది. చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా? -
సెల్ఫిష్ బాయ్: ఫస్ట్ సాంగ్ రిలీజయ్యేది అప్పుడే
‘రౌడీ బాయ్స్’తో హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్’. నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, ‘దిల్’ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో స్వార్థానికి చిరునామాలా ఉండే పాత బస్తీ కుర్రాడి పాత్రలో కనిపిస్తారు హీరో ఆశిష్. ఇవానా హీరోయిన్. ఈ చిత్రంలోని తొలి పాట ‘దిల్ ఖుష్..’ను మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఆశిష్ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం, ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
చైత్రతో ప్రేమ
‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సెల్ఫిష్’. కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇవానా కథానాయిక. ఆమె పాత్ర పేరు చైత్ర. ఆందోళనగా ఉన్న చైత్రను హీరో తదేకంగా చూస్తున్న పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగే ఈ మాస్ లవ్‌స్టోరీలో ఆశిష్ ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్ర చేస్తుండగా, ఇవానా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. -
అలా అయితే ఎఫ్3 విడుదల వాయిదా వేస్తాం : దిల్ రాజు
‘రౌడీబాయ్స్’ ఆశిష్ కెరీర్‌కు శుభారంభాన్నిచ్చింది. ఆశిష్ హీరోగా పరిచయం అయిన తొలి సినిమా రెండో వారం పూర్తయ్యేసరికి 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం చాలా సంతోషంగా ఉంది. మూడోవారం పూర్తయ్యేసరికి 15 కోట్ల గ్రాస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఓ కొత్త హీరోకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం అంటే సాధారణ విషయం కాదు. ‘రౌడీబాయ్స్’ మా అంచనాలు అందుకుంది’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆశిష్ హీరోగా పరిచయం అయిన ‘రౌడీబాయ్స్’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా తీవ్రత తగ్గి పెద్ద సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుందనే ఆశిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. ఒకవేళ పరిస్థితుల కారణంగా మార్చి 18న కాకుండా ఏప్రిల్ 28న విడుదలకు ‘ఆర్ఆర్ఆర్’ సిద్ధమైతే ‘ఎఫ్ 3’ సినిమా వాయిదా పడవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే ఏపీలోని సినిమా టికెట్ ధరల సవరణ గురించి ఫిబ్రవరిలోపు పరిష్కారం లభిస్తుందనే నమ్ముతున్నాను. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయి’’ అన్నారు. -
రౌడీ బాయ్స్ కోసం రంగంలోకి ప్రభాస్
Ye Zindagi Song Launch by Prabhas: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీలవల ఈ సినిమా నుంచి ‘డైట్ నైట్’అనే పాటను అల్లు అర్జున్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్‌ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ‘యే జిందగీ’అంటూ సాగే ఈ పాట...స్నేహబంధానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా సాగుతుంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. రామ్ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. అలాగే ఈ సినిమాలోని మరో రెండు పాటలను కూడా ఈ రోజే విడుదల చేయనున్నారు. , 2 గంటలకు, 5 గంటలకు వరుసగా సినిమాలో నుంచి పాటలను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు “రౌడీ బాయ్స్” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. -
డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న అనుపమకు తాజాగా సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. కాగా హీరోయిన్స్‌కు లిప్‌లాక్ సీన్స్ ఎంతో క్రేజ్‌ను తెచ్చి పెడతాయి. అది కూడా స్టార్ హీరోతో అయితేనే. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్‌లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ కానీ ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి అనుపమ ట్రోల్స్ బారిన పడింది. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో అగ్ర నిర్మాత దిల్ రాజు నట వారసుడిగా ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్గా అనపమ నటిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించన అనుపమా రౌడీ బాయ్స్‌లో రెచ్చిపోయి నటించిందట. ఇక బడా నిర్మాత వారసుడి సినిమా కావడంతో ఈ మూవీని దర్శకుడు భారీగానే ప్లాన్ చేశాడు. అతడికి ఎలాగైన సక్సెస్ ఇవ్వాలని దర్శకుడు ఆరాట పడుతున్నాడు. చదవండి: అవును జాకీతో ప్రేమలో ఉన్నా, కానీ అది రూమరే.. నేనే చెప్తా: రకుల్ ఈనేపథ్యంలో రౌడీ బాయ్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు హీరోహీరోయిన్ల మధ్య భారీగానే లిప్‌లాక్ సీన్లు పెట్టారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో కూడా కిస్ సీన్స్ చూపించి ఆకట్టుకున్నారు మేకర్స్. కానీ ఇదే సీన్‌పై అనుపమను ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘నీకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదా.. ఎంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్ ఇచ్చేస్తావా?, కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్ కోసం ఇంతగా దిగజారాలా’ అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి మరికొందరైతే ఏకంగా ‘నీ నెక్ట్ సినిమా మా హీరో చేయాలని, అతడికి కూడా లిప్‌లాక్ ఇవ్వాల్సిందే’ అంటూ పలువురు హీరోల ఫ్యాన్స్ అనుపమకు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అనుపమ మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ఈ సినిమాలో 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. -
ఆడి కారు యాక్సిడెంట్ కేసులో కొత్త మలుపు
సాక్షి, గచ్చిబౌలి: తప్పతాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మాదాపూర్‌లో తెల్లవారు జామున ఆడి కారు ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి కారణమైన వారితో పాటు తండ్రి కటకటాలపాలయ్యారు. మల్లాపూర్‌లో నివాసం ఉంటూ గోవాలో ఎంఎస్ చదువుతున్న వాకిటి సుజిత్ రెడ్డి(24) స్నేహితుడు ఆశిష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ సమీపంలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఈ నెల 27 ఉదయం 5.30 గంటల సమయంలో ఆశిష్‌తో కలిసి ఆడి కారులో కృష్ణానగర్ బయలు దేరారు. అతి వేగంగా వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ఢీ కొట్టడంతో వెనక సీట్లో కూర్చున్న వై.ఉమేష్ కుమార్ (37, పబ్‌లో వర్కర్) ఎగిరి ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులో ఉన్నవారు ఆగకుండా ముందుకు వెళ్లి కారు నెంబర్ ప్లేట్లు తీసేసీ ఇనార్బిట్ మాల్ వైపు పరిగెత్తారు. అక్కడి నుంచి సుజిత్‌రెడ్డి తండ్రి రఘునందన్ రెడ్డికి ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఆటోలో రావాలని చెప్పాడు. కొడుకును డీడీ కాలనీలో దాచిపెట్టారు. ఈ నెల 28న డ్రైవర్ ప్రభాకర్ (52) కారు నడిపాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీసీ పుటేజీలో యువకులు పరిగెత్తినట్లు కనిపించడంతో పోలీసులు తమ స్టయిల్లో విచారించారు. డైవర్‌ను మార్చే ప్రయత్నం చేశామని ఒప్పుకోవడంతో రఘునందన్ రెడ్డిపై ఐపీసీ 202, 203, 205,212,419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెంబర్ ప్లేట్లు తీస్తుండగా చూసిన ఇద్దరు వ్యక్తులను బెదిరించారు. కారు నడిపిన సుజీత్ రెడ్డితోపాటు, అశిష్‌పై 304(2), 201,506, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో ఎగిరి కింద పడి మృతి చెందిన ఉమేష్ కుమార్ నుజ్జునుజ్జయిన ఆటో -
కొత్త కెరటం...
బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న ఆశిష్ రెడ్డి సాక్షి క్రీడా విభాగం: కొన్నాళ్ల క్రితం అనంతపురంలో ‘యంగ్ మాస్టర్స్’ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. అందులో పదిహేనేళ్ల కుర్రాడు తన పదునైన ఆట తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అండర్–17 స్థాయిలో జరిగిన ఆ టోర్నీలో తుది విజేతగా నిలవకున్నా తన ఆటతో ఆకట్టుకున్నాడు. ‘బెస్ట్ స్మాషర్’ అవార్డును సొంతం చేసుకున్న ఆ యువ షట్లర్ పేరు ఎం.పరమేశ్ ఆశిష్‌రెడ్డి. అదే ఉత్సాహంతో దూసుకుపోయిన ఆశిష్... అగ్ర శ్రేణి టోర్నీలలో నిలకడగా విజయాలు సాధించాడు. సత్తా చాటుతూ... అనంతపురం జిల్లాకు చెందిన ఆశిష్, నంద్యాలలోని నంది పైప్స్ అకాడమీలో ప్రాథమికాంశాలు నేర్చుకున్నాడు. అక్కడి కోచ్ వెంకట్ వద్ద శిక్షణలో రాటుదేలిన తర్వాత వివిధ టోర్నీలలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అనంతపురంలో నిర్వహించిన అండర్–15 టోర్నీలో రన్నరప్‌గా ఉన్న అతను, తర్వాతి ఏడాది జరిగిన అండర్–17 విభాగంలో విజేతగా నిలవడం విశేషం. అనంతరం ‘సాక్షి’ మీడియా నిర్వహించిన యూత్ ఎరీనా ఫెస్ట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన ఆశిష్, చక్కటి ఆటతీరును కనబర్చాడు. అనేక ర్యాంకింగ్ టోర్నీలలో కూడా పాల్గొన్న ఆశిష్ రెడ్డి, 2017లో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్‌షిప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నంద్యాలలో గత జులైలో జరిగిన ఈ టోర్నీ అండర్–19 సింగిల్స్ విభాగంలో అతను సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినా... మంచి భవిష్యత్తు ఉన్న షట్లర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. ఇదే టోర్నీలో సాయినాథ్ రెడ్డితో కలిసి అతను డబుల్స్ విభాగంలో కూడా పోటీ పడ్డాడు. చదువులో కూడా చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను... ప్రస్తుతం హైదరాబాద్‌లో మరింత మెరుగైన శిక్షణతో తన ఆటలో రాటుదేలేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆశిష్ ఆటను మరింత ప్రోత్సహించి అండగా నిలిచేందుకు ఎవరైనా స్పాన్సర్లు ఆసక్తి చూపిస్తే ఈ యువ ఆటగాడు మున్ముందు మరింత సంచలన విజయాలు సాధించడం ఖాయం. ఈ యువ షట్లర్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించాలనుకునేవారు 7729942589 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు. బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ స్థాయికి ఎదగడమే నా లక్ష్యం. అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాను. గత రెండేళ్లలో నా ఆట ఎంతో మెరుగైంది. కోచ్ వెంకట్ సార్ పర్యవేక్షణలో నా లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందు కోసం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేస్తున్నా. ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని పట్టుదలగా ఉన్నా. – ఆశిష్ రెడ్డి, యువ షట్లర్ -
ఆశిష్ రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా బ్యాంక్ బ్యాట్స్‌మన్ ఏ. ఆశిష్ రెడ్డి (178 బంతుల్లో 205 నాటౌట్; 22 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఆ జట్టు భారీస్కోరు సాధిం చింది. ఎస్బీఐ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో 116.2 ఓవర్లలో 600 పరుగులకు ఆలౌలైంది. ఎస్బీఐ బౌలర్లలో ఆకాశ్ భం డారి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఎస్బీఐ జట్టు రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో 2 వికెట్లకు 190 పరుగులు చేసింది. అనిరుధ్‌సింగ్ (182 బంతుల్లో 103 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. ఎవర్గ్రీన్, ఇండియా సిమెంట్స్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదట ఇండియా సిమెంట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేయగా, ఎవర్గ్రీన్ జట్టు 83.1 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మూడో రోజు గురువారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇండియా సిమెంట్స్ ఆటముగిసే సమయానికి 62 ఓవర్లలో 8 వికెట్లకు 193పరుగులతో నిలిచింది. ఎవర్ గ్రీన్ బౌలర్ పి. మనీశ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు బీడీఎల్: 133 (తొలి ఇన్నింగ్స్), 281 (చంద్రశేఖర్ 38, కె. సుమంత్ 67, సందీప్ గౌడ్ 84; హిమాన్షు 3/46, విద్యానంద్ 3/57); ఇన్‌కం ట్యాక్స్: 226/9 (70.5 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్: 417 (తొలి ఇన్నింగ్స్), 37/3 (అజయ్ దేవ్ గౌడ్ 3/12); ఈఎంసీసీ: 266 (బెంజమిన్ థామస్ 84; సయ్యద్ అహ్మద్ 6/83), జై హనుమాన్: 353 (అనిరుధ్ రెడ్డి 87; వరుణ్ గౌడ్ 4/79); డెక్కన్ క్రానికల్: 147/4 (వరుణ్ 56 బ్యాటింగ్), హైదరాబాద్ బాట్లింగ్: 322 (95.3 ఓవర్లలో); కాంటినెంటల్: 243/9 (ఆశిష్ 68; ముజమ్మిల్ 3/37), జెమిని ఫ్రెండ్స్: 366 (తొలి ఇన్నింగ్స్), 189 (మెహదీ హసన్ 3/40); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 248, 191 (మల్లికార్జున్ 70, నీలేశ్ 50; సంకీర్త్ 3/66, రాధాకృష్ణ 3/57), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 162 (తొలి ఇన్నింగ్స్), 141 (సాగర్ శర్మ 3/58, ఎస్. పాండే 5/18); ఏఓసీ: 142 (తొలి ఇన్నింగ్స్), 162/8 (రాహుల్ సింగ్ 78, సుఫియాన్ 51; షేక్ కమ్రుద్దీన్ 3/36, సుధాకర్ 4/44) -
రాణించిన ఆశిష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆశిష్ రెడ్డి (59) అర్ధ సెంచరీ సాధించడంతో ఎస్సీఆర్ఎస్ఏతో జరుగుతున్న ‘ఎ’ డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్రా బ్యాంక్ 76 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆశిష్‌తో పాటు కిరణ్ కుమార్ (39 బ్యాటింగ్) ఫర్వాలేదనిపించాడు. ఎస్సీఆర్ బౌలర్లలో ఎం.సురేశ్ 71 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట సాధ్యం కాలేదు. ఆంధ్ర 229/8 బరోడాతో ప్రారంభమైన అండర్-19 మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సూరజ్ ప్రీతమ్ (55) హాఫ్ సెంచరీ చేయగా...టి. శ్రీకృష్ణ (49), జ్ఞానేశ్వర్ (35) రాణించారు. బరోడా బౌలర్లలో గుర్జీనర్ సింగ్ మాన్ 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.