
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు, టాలీవుడ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహా వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పాల్గొన్నారు. ఈ డెస్టినేషన్ గ్రాండ్ వెడ్డింగ్‌లో దిల్ రాజు సందడి చేశారు. డప్పు వాయిస్తూ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు.
కాగా.. దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు.ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. టాలీవుడ్‌లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment