వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్‌లో విజయ్-రష్మిక | Vijay Devarakonda And Rashmika In Dil Raju's Nephew Ashish Reception - Sakshi
Sakshi News home page

Vijay Rashmika: రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన క్యూట్ జోడీ.. కాకపోతే!

Published Sat, Feb 24 2024 2:39 PM | Last Updated on Sat, Feb 24 2024 2:56 PM

Vijay Devarakonda And Rashmika In Dil Raju Son Ashish Reception - Sakshi

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి.. కొన్నిరోజుల ముందు పెళ్లి చేసుకున్నాడు. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. జైపూర్‌లో జరిగిన వివాహానికి పలువురు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్ కన్వెక్షన్‌లో రిసెప్షన్ జరగ్గా.. నాగార్జున, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా క్లాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. విజయ్ వచ్చిన కాసేపటికి రష్మిక కూడా ఈ వేడుకకు రావడం విశేషం. ప్రస్తుతం వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే విజయ్ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ఇది రిలీజ్ కానుంది. దీనికి దిల్ రాజు నిర్మాత. మరోవైపు రష్మిక.. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఒకేపెళ్లికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాకపోతే విడివిడిగానే వచ్చారండోయ్.

(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement