సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్‌లను కొంతమంది సీరియస్‌గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్‌లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.
గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడతానన్నాడు.
‘నా రిలేషన్‌షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు.
ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్‌నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment