Love relation
-
ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్ ఇలా
సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్లను కొంతమంది సీరియస్‌గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. ‘నా రిలేషన్షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు. -
అలాంటి వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు
కాన్సాస్ : మనిషి ఆరోగ్యంగా జీవించటానికి నవ్వు ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలిసిన విషయమే. అయితే నవ్వు వల్ల ఓ జంట మధ్య ప్రేమ బంధం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జంట మనస్పూర్తిగా కలిసి నవ్వుకోవటం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. అంతేకాదు ఓ జంట మధ్య రిలేషన్ కలతల్లేకుండా కలకాలం సాగాలంటే కమ్యూనికేషన్, సర్దుకుపోయే గుణమే కాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎంతో అవసరం. మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ పార్ట్నర్తో మన బంధాన్ని బలోపేతం చేస్తుందని తాజా పరిశోదనల్లో తేలింది. చాలా మంది తమ భాగస్వామికి సెన్స్ హ్యూమర్ ఉండాలని కోరుకుంటున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ కెన్సాస్కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఎదుటి వ్యక్తిని నవ్వించగలిగే గుణం ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తోందని వెల్లడించారు. జంటలోని ఇద్దరు వ్యక్తులు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నట్లయితే ఆ బంధం మరింత బలంగా ఉంటుందని తెలిపారు. జంటలోని ఓ వ్యక్తికి మాత్రమే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే సరిపోదని ఇద్దరి సెన్స్ ఆఫ్ హ్యూమర్లో పోలికలు ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వ్యక్తిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ వారిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుందని యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు చెబుతున్నారు. అందంగా ఉన్నావారి కంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులనే ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడించారు. నవ్వు ఒత్తిడిని తగ్గించే మందు లాగా పనిచేస్తుందని, నవ్వటం ద్వారా మనలో ఆనందాన్ని నింపే హార్మోన్లు విడుదలవుతాయని, తద్వారా ఒత్తిడినుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. నవ్వు ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కళ్లు మూసి కలిపి చదువుకో ఒక్కసారి!
హృదయం: ‘రాళ్లల్లో ఇసుకల్లో రాశామూ ఇద్దరి పేర్లు.. కళ్లు మూసి కలిపి చదువుకో ఒక్కసారి... ’అంటూ సినీ కవి ఒకరు చిన్ననాటి బంధంలోని అందం గురించి చెప్పాడు. ఇలా మన దగ్గరే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా రాళ్లల్లో ఇసకల్లో ఇద్దరి పేర్లూ రాసుకొని ఆనందించే జంటలు ఉంటాయి. అలాంటి రాతలే ఆమె జీవితానికి గొప్ప జ్ఞాపకంగా మారాయి. తోడు దూరం అయ్యాక కూడా ఊరటనిచ్చే అనురాగపు పరిమళాలు అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆ కథ ఏమిటి? నిద్రలేని రాత్రులు.. చెమ్మగిల్లిన నేత్రాలు.. ఒంటరితన ం... హృదయం బరువెక్కిన క్షణాలు... అలాంటి ఏకాంతపు ద్వీపంలో బతుకు ఆమెది. ప్రాణంగా ప్రేమించిన భర్త దూరం అయ్యాడు. ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయాడు. అతడు భర్త మాత్రమే కాదు, ఆమెప్రాణం కూడా. అమెరికాలోని సౌత్కరోలినాకు చెందిన ఆమె పేరు సిస్సీహెవిట్. భర్త డేవిడ్ హెవిట్. 12 యేళ్ల వయసు నుంచే అతడితో ఆమెకు అనుబంధం! డేటింగ్‌తో మొదలై 34 యేళ్ల పాటు దాంపత్య జీవితాన్ని పంచుకొన్నారిద్దరూ. అయితే ఆరేళ్ల కిందట అతడి హఠాన్మరణం ఆమెను కుంగదీసింది. ‘ఇక బతకడం అనవసరం. అతడు లేని జీవితానికి అర్థమే లేదు. అతడితో కలిసి జీవించడంతోనే ఈ జీవితానికి పరిపూర్ణత వచ్చింది. ఇక అతడే లేనప్పుడు బతకడం ఎందుకంటూ..’ ఆత్మహత్యకు కూడా సిద్ధం అయ్యింది. సరిగ్గా ఆ సమయంలో అతడితో గడిపిన క్షణాలను వెదుక్కొంటూ వెళుతున్న ఆమెకు.. భౌతిక రూపంలో లభించిన ఒక జ్ఞాపకం జీవితంపై కొత్త ఆశలను రేకెత్తించింది. అతడి మధుర జ్ఞాపకంగా కనిపించిన ఆ ‘కానుక’ ఒక సిమెంటు పలక. ఆ పలకతో ఆమె తొలి ప్రేమ జ్ఞాపకం ముడిపడి ఉంది. పన్నెండోయేటే డేటింగ్ మొదలు పెట్టిన ఈ జంట అప్పట్లోనే పక్షుల జంటలా విహరించింది. ఆ విహారంలో తమ ప్రేమకు గుర్తుగా కొన్ని చోట్ల తమ పేర్లను రాసింది. ఆ సమయంలోనే ‘డేవిడ్+సిస్సీ’ అంటూ ఒక చోట సిమెంట్ పలకపై రాశారు. అయితే ఆ తర్వాత దాని గురించి మరిచిపోయారు. డేవిడ్ ఉన్నన్ని రోజులూ ఆమె వర్తమానంలోనే బతికింది. గతాన్ని తలుచుకోవాల్సిన అవసరం, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అగత్యం లేకుండా ప్రేమను పంచాడతను. అలాంటి మనిషి ఒక్కసారిగా దూరం కావడంతో కుంగిపోతున్న ఆమెకు అనుకోకుండా కనిపించిన తమ టీనేజీ నాటి ఆ సిమెంట్ పలకపై ఉన్న పేర్లు అపురూపంగా కనిపించాయి. ఆ పేర్లు ఆమెను నవయవ్వన ప్రాయంలోకి తీసుకెళ్లి తొలి ప్రేమ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాయి. తనకు దూరమైన భర్తకు సంబంధించిన అరుదైన జ్ఞాపకంగా మారాయి. నలభై యేళ్ల కిందట తమ ప్రేమ కావ్యానికి ఆనవాళ్లుగా ఉన్న వాటిని ఇప్పుడు అపురూపంగా అందరికీ చూపించుకొంటూ ఆనందిస్తోందామె. ఈ రుజువు చాలు మరణించినా అతడు తన ప్రేమతో ఆమెను సంతోషంగా బతికిస్తున్నాడనడానికి. ప్రేమ బంధానికి లాక్ వేస్తున్నారు! పరిస్థితుల కారణంగా తాము ఎక్కడ విడిపోతామో అనే భయం అనేక మంది ప్రేమికుల్లో ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు తమ ప్రేమ శాశ్వతం కావాలనీ, ఒక బంధంగా జీవితాంతం కొనసాగాలనీ కోరుకోవడమూ సహజమే. ఆ కోరిక ప్రపంచమంతా ఒకే విధంగా ఉంటుందనడానికి రుజువు ‘లవ్ లాక్స్’. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న గ్రిల్స్‌కు తాళం వేసి, లాక్ వేశామంటే తమ ప్రేమ అమరం అవుతుందని అక్కడి ప్రేమికుల నమ్మకం. అందుకే యేటా కొన్ని వందల, వేల జంటలు లాక్కు ఇరువైపులా తమ పేర్లను రాసి ఆ బ్రిడ్జిక్ వేస్తూ ఉంటారు. అయితే ఇలా లాక్వేసే వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో పారిస్ నగరాభివృద్ధి వాళ్లకు బాగా ఇబ్బందిగా మారింది. వాటిని తీసేస్తే ప్రేమికులు హర్ట్ అవుతారు, తీసి వేయకపోతే ఇలాగే పెరుగుతూ పోతాయి. దీంతో ఈ లాక్‌ల విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అక్కడి అధికారులు.