![Tollywood Young Hero Ashish Reddy Engagement with Advitha Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/1/Engagement-with-Advitha-Reddy.jpg.webp?itok=jZl7QLe0)
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎంతోమంది బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇదే మంచి సమయం అనుకుని మూడుముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా వెంకటేశ్ రెండో కూతురు నిశ్చితార్థం జరిగింది. తాజాగా దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయ్యాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ఎంగేజ్‌మెంట్ గురువారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వేలికి ఉంగరం తొడిగాడు ఆశిష్. ఈ నిశ్చితార్థ వేడుకను గోప్యంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్.
ఈ సినిమాలో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజైంది. తర్వాత విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఆశిష్ హీరోగా ఇటీవల ఓ కొత్త చిత్రం పట్టాలెక్కింది.
చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా?
Comments
Please login to add a commentAdd a comment